Mamata Banerjee: ఎన్నికలకు ముందు బీజేపీ తప్పుడు హామీలు ఇచ్చింది : మమతా బెనర్జీ
- By Balu J Published Date - 05:37 PM, Wed - 6 December 23

Mamata Banerjee: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బుధవారం భారతీయ జనతా పార్టీ (బిజెపి)ని లక్ష్యంగా చేసుకున్నారు. బీజేపీ పార్టీని “అతిపెద్ద జేబు దొంగ” అని అభివర్ణించారు. అలాగే ఎన్నికల ముందు బీజేపీ ఓటర్లను మోసం చేసి అధికారంలోకి వచ్చిందని మండిపడ్డారు. ఉత్తర బెంగాల్‌కు బయలుదేరే ముందు నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో విలేకరులతో మాట్టాడారు.
బిజెపికి “రాజకీయ లంచాలు” అందించడానికి కేంద్ర ఏజెన్సీలు పదేపదే రాష్ట్రాన్ని సందర్శిస్తున్నాయని మమతా ఘాటు వ్యాఖ్యలు చేశారు. దేశంలోనే అతిపెద్ద జేబు దొంగలు (బిజెపి) అని, దీని వల్ల ప్రజలు చాలా నష్టపోయారని ముఖ్యమంత్రి అన్నారు. ప్రతి వ్యక్తి ఖాతాకు రూ.15 లక్షలు పంపిస్తానని, ఆ తర్వాత నోట్ల రద్దు, మహమ్మారి సమయంలో ఇబ్బందులు… ఎన్నికల ముందు తప్పుడు వాగ్దానాలు చేసి ప్రజలను బీజీపీ మోసం చేసిందన్నారు.
Also Read: Delhi: ఢిల్లీలో పెరుగుతున్న ఆత్యహత్యలు, కారణమిదే