Bank Holidays In May: మేలో 12 రోజులు బ్యాంక్ సెలవులు.. ఎప్పుడెప్పుడు అంటే..?
ఎండలు మండిపోయే మే నెల (May)లో బ్యాంకులకు 12 రోజుల పాటు సెలవులు (Bank Holidays In May) ఉన్నాయి. ఈ సెలవుల (Holidays) విషయానికి వస్తే మేలో రెండో, నాలుగో శనివారాలతో పాటు ఆదివారాలు బ్యాంకులకు సెలవు.
- By Hashtag U Published Date - 07:15 AM, Wed - 26 April 23
ఎండలు మండిపోయే మే నెల (May)లో బ్యాంకులకు 12 రోజుల పాటు సెలవులు (Bank Holidays In May) ఉన్నాయి. ఈ సెలవుల (Holidays) విషయానికి వస్తే మేలో రెండో, నాలుగో శనివారాలతో పాటు ఆదివారాలు బ్యాంకులకు సెలవు. మిగితా సెలవులలో ఎక్కువ భాగం ప్రాంతీయ సెలవులే ఉన్నాయి. వీటిని రాష్ట్ర ప్రభుత్వాలే నిర్ణయిస్తాయి. భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) మార్గదర్శకాల ప్రకారం.. నిర్దిష్ట రాష్ట్రాన్ని బట్టి కొన్ని ప్రాంతీయ సెలవుల రోజుల్లోనూ బ్యాంకులు మూసివేయబడతాయి.
‘హాలిడే అండర్ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ యాక్ట్’, ‘హాలిడే అండర్ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ యాక్ట్ అండ్ రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్ హాలిడే’ , బ్యాంకుల ఖాతాల క్లోజింగ్ టైం వంటి 3 కేటగిరీల కింద కూడా బ్యాంకు సెలవులు అమలులోకి వస్తాయి. అయితే ‘హాలిడే అండర్ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ యాక్ట్’ లో భాగంగా దేశవ్యాప్తంగా బ్యాంకులకు అత్యధిక సంఖ్యలో సెలవులు వస్తుంటాయి. ఈ విధంగా మే నెలలో నెగోషియబుల్ యాక్ట్ కింద 4 సెలవులు ఉన్నాయి.
Also Read: White Hair: తెల్ల జుట్టు వస్తుందా..? అయితే ఈ విషయం తెలుసుకోండి..
మే 2023లో బ్యాంక్ సెలవుల జాబితా
* మే 1 (సోమవారం): మే డే, మహారాష్ట్ర డే
* మే 5 (శుక్రవారం): బుద్ధ పూర్ణిమ (ఢిల్లీ, హర్యానా, మహారాష్ట్ర, పంజాబ్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఉత్తరాఖండ్, అస్సాం, బీహార్, గుజరాత్, అరుణాచల్ ప్రదేశ్,
ఛత్తీస్గఢ్)
* మే 7: ఆదివారం
* మే 9 (మంగళవారం): రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి
* మే 13: రెండవ శనివారం
* మే 14: ఆదివారం
* మే 16 (మంగళవారం): రాష్ట్ర దినోత్సవం – సిక్కిం
* మే 21: ఆదివారం
* మే 22 (సోమవారం): మహారాణా ప్రతాప్ జయంతి ( గుజరాత్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, రాజస్థాన్)
* మే 24 (బుధవారం): కాజీ నజ్రుల్ ఇస్లాం జయంతి – త్రిపుర
* మే 27: నాల్గవ శనివారం
* మే 28: ఆదివారం
సిక్కిం రాష్ట్రవాసులు మే 15న సెలవు తీసుకుంటే మే 13 నుంచి మే 16 వరకు నాలుగు రోజుల పాటు సుదీర్ఘ వారాంతాన్ని ఆస్వాదించవచ్చు. మే 13 (రెండవ శనివారం), మే 14 (ఆదివారం) తేదీల్లో బ్యాంకులు మూసివేయబడతాయి. స్థానిక పండుగలను దృష్టిలో ఉంచుకుని సెలవులు నిర్ణయించబడతాయి. కాబట్టి ఈ సెలవులు ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలా ఉండే అవకాశం ఉంటుంది.
Related News
Bank Holidays in May 2024 : మే నెలలో బ్యాంకులకు ఏకంగా 12 రోజులులు సెలవులు
మరో నాల్గు రోజుల్లో మే (May 2024) నెల రాబోతుంది. ఈ తరుణంలో మే నెలలో బ్యాంకులకు ఎన్ని రోజులు పనిచేస్తున్నాయి..ఏ ఏ రోజు బ్యాంకులకు సెలవులు అనేది తెలుసుకునే పనిపడ్డారు