White Hair: తెల్ల జుట్టు వస్తుందా..? అయితే ఈ విషయం తెలుసుకోండి..
జుట్టులో ఏదైనా తెల్ల వెంట్రుక కనిపించిందంటే చాలు.. చాలామంది బాధపడిపోతుంటారు. అప్పుడే ఎందుకు వెంట్రుకలు తెల్ల పడుతున్నాయో అర్ధం కాక సతమతమవుతూ ఉంటారు. తెల్ల వెంట్రుకలు రాకుండా ఏం చేయాలనే దానిపై ఉక్కిరిబిక్కిరి అవుతూ ఉంటారు.
- By Anshu Published Date - 09:50 PM, Tue - 25 April 23

White Hair: జుట్టులో ఏదైనా తెల్ల వెంట్రుక కనిపించిందంటే చాలు.. చాలామంది బాధపడిపోతుంటారు. అప్పుడే ఎందుకు వెంట్రుకలు తెల్ల పడుతున్నాయో అర్ధం కాక సతమతమవుతూ ఉంటారు. తెల్ల వెంట్రుకలు రాకుండా ఏం చేయాలనే దానిపై ఉక్కిరిబిక్కిరి అవుతూ ఉంటారు. కొంతమంది తెల్ల వెంట్రుకలను కవర్ చేయడానికి జుట్టుకు రంగు వేసుకుంటూ ఉంటారు. కానీ రంగులు ఎక్కువ రోజులు ఉండవు. ఎప్పటికప్పుడు కొత్తగా వేసుకోవాల్సి ఉంటుంది. దీంతో కొంతమందికి చికాకుగా అనిపిస్తూ ఉంటుంది.
అయితే వెంట్రుకలు తెల్లపడటానికి అనేక కారణాలు ఉంటాయంటున్నారు వైద్య నిపుణులు. వెంట్రుకల కుదుళ్లలో ఉండే మెలనోసైట్స్ అనే రసాయనాలు జుట్టుకు రంగునిస్తాయని, వయస్సు పెరిగే కొద్ది ఇవి చనిపోతాయని అంటున్నారు. దీని వల్ల వయస్సు పెరిగే కొద్ది వెంట్రుకలు తెల్లపడుతూ ఉంటాయని న్యూయార్క్ యూనివర్సిటీలో తాజాగా చేసిన రీసెర్చ్ లో తేలింది. మెలనోసైట్స్ పరిపక్వం కావడానికి, ఇది తిరిగి వృద్ధి చెందటానికి తోడ్పటే మూలకణాలు కదలకుండా బిగుసుకుపోవటమూ వల్ల జుట్టు తెలపడుతుందని చెబుతున్నారు.
అయితే కొంతమందిలో తల్లిదండ్రులను బట్టి జుట్టు తెల్లబడుతుందని చెబుతున్నారు. తల్లిదండ్రులకు 30 ఏళ్లలోపు తెల్ల వెంట్రుకలు వస్తే వారసులకు కూడా వస్తాయని అంటున్నారు. ఇక విటమిన్ 12 లోపం వల్ల కూడా జుట్టు తెల్లబడుతుందని సైంటిస్టులు అంటున్నారు. ఇక థైరాయిడ్, బొల్లి వంటి సమస్యలతో బాధపడేవారికి కూడా తెల్లజుట్టు వస్తుందట. ఇక మానసిక ఒత్తిడికి, జుట్టు తెలబడటానికి ఎలాంటి సంబంధం లేదని వైద్యులు చెబుతున్నారు. జన్యువులే తెల్ల వెంట్రుకలు రావడానికి కారణం అవుతాయంటున్నారు.
ఇక పొగ తాగేవారికి 30 ఏళ్లలోపు జట్టు తెల్లబడే ప్రమాదం రెండున్నర రెట్లు ఎక్కువగా ఉంటుందని అంటున్నారు. అయితే తెల్ల వెంట్రుకలను పీకేయడం మంచిది కాదని అంటున్నారు. తెల్ల వెంట్రుకలను పీకితే మూడు తెల్ల వెంట్రుకలు మెలుస్తాయనే దానిలో నిజం లేదని అంటున్నారు. తెల్ల వెంట్రుకలను పీకితే దాని స్థానంలో వేరేది వచ్చే అవకాశం ఉంటుంది. దీంతో వెంట్రుకలను గట్టిగా లాగితే కుదుళ్లు దెబ్బతింటాయని, దాని వల్ల కొత్త వెంట్రుక రాదని అంటున్నారు.