Thodasam Kailash: ప్రధాని మోడీ ‘మన్ కీ బాత్’లో తెలంగాణ టీచర్.. తొడసం కైలాశ్ ఎవరు ?
తొడసం కైలాశ్(Thodasam Kailash) ఆదిలాబాద్ పట్టణానికి 14 కిలోమీటర్ల దూరంలోని గిరిజన గోండు గూడెం వాఘాపూర్‌కు చెందినవారు.
- By Pasha Published Date - 01:36 PM, Sun - 23 February 25

Thodasam Kailash: ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఇవాళ (ఆదివారం) ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో తెలంగాణకు చెందిన ఒక ఉపాధ్యాయుడి గురించి ప్రస్తావించారు. ఆదిలాబాద్‌కు చెందిన ప్రభుత్వ స్కూల్ టీచర్ తొడసం కైలాశ్ గిరిజన భాషలను కాపాడడంలో కీలక పాత్ర పోషిస్తున్నారని మోడీ కొనియాడారు. ఆర్టిఫీషియల్ ఇంటెలీజెన్స్ (ఏఐ) టూల్స్‌ను ఉపయోగించి కొలామి భాషలో తొడసం కైలాశ్ పాటను కంపోజ్ చేశారని ప్రధాని గుర్తు చేశారు. ఈసందర్భంగా తొడసం కైలాశ్ గురించి కథనమిది.
Also Read :Rajalingamurthy Murder Case: రాజలింగమూర్తి హత్య.. నిందితుల్లో బీఆర్ఎస్ నేత.. మర్డర్‌కు కారణమిదీ
తొడసం కైలాశ్ నేపథ్యం..
- తొడసం కైలాశ్(Thodasam Kailash) ఆదిలాబాద్ పట్టణానికి 14 కిలోమీటర్ల దూరంలోని గిరిజన గోండు గూడెం వాఘాపూర్‌కు చెందినవారు.
- ఆయన ఎంఏ ఇంగ్లీషు, పొలిటికల్ సైన్సులో డబుల్ మాస్టర్స్ డిగ్రీ చేశారు.
- ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా 23 ఏళ్లుగా తొడసం కైలాశ్ పనిచేస్తున్నారు.
- ఆయన మహా భారతాన్ని మొట్టమొదటిసారి ‘పండోర్న మహాభారత్ కథ’ పేరిట గోండు భాషలో రాశారు. ఆ పుస్తకాన్ని జిల్లా కలెక్టర్ రాజర్షి షా ఆవిష్కరించారు.
- గోండు భాషలో మహాభారతాన్ని రాసిన తొడసం కైలాశ్‌ను మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు కూడా అభినందించారు.
- తొడసం కైలాస్.. గిరిజనుల్లోని తొడసం తెగకు చెందినవారు. తన మాతృభాష అయిన గోండిలో మహాభారతం లేక పోవడం ఆయన్ను బాధించేది. అందుకే మహాభారతాన్ని గోండు భాషలోకి అనువదించారు. ఆయన నాలుగు నెలలు శ్రమించి అనువాదం ప్రక్రియను పూర్తి చేశారు.
- ‘‘కేంద్రప్రభుత్వం గోండు భాషను గుర్తించాలంటే 20వేల పదాలు కావాలి. దీనిలో భాగంగానే గోండు భాషలో రచనలు చేస్తున్నాను’’ అని తొడసం కైలాస్ అంటున్నారు.
- కైలాస్ రాసిన ‘పండోర్న మహాభారత్ కథ’ పుస్తకాన్ని పుస్తకాన్ని ఎక్కువ కాపీలు ముద్రించి గిరిజన విద్యార్థులకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఉట్నూరు ఐటీడీఏ నిధులను కేటాయిస్తామని జిల్లా కలెక్టరు ప్రకటించారు.
- గిరిజన పిల్లల కోసం పిల్లల కథలతో ‘కాండిరంగ వేసుడింగ్’ పేరిట గోండు భాషలో ఆయన మరో పుస్తకం రాశారు.
- తండ్రి లేకపోయినా అత్యుత్తమ క్రికెటరుగా ఎదిగిన విరాట్ కోహ్లీ విజయగాథను గోండు భాషలో కైలాస్ రాశారు.
- ఏఐ టెక్నాలజీ సాయంతో గోండి భాషలో కైలాస్ కవిత్వం వినిపిస్తున్నారు. తాను రాసిన కవిత్వం, కథలు, స్పూర్తిదాయక సందేశాలను ఏఐ ద్వారా చదివించి, రికార్డ్ చేసి యూట్యూబ్ లో పోస్టు చేస్తున్నారు. దీనికోసం ఏఐ యాంకర్ సుంగాల్ తుర్పోను సృష్టించారు.
- తెలుగు లిపితో గోండి భాషలో రాసిన కవిత్వాన్ని ఏఐ ద్వార కైలాస్ చదివిస్తున్నారు.