Assam CM : నీ ముఖంలో గాంధీ-పటేల్ కనించాలి, సద్దాం హుస్సేన్ కాదు.రాహుల్ గాంధీపై వివాదస్పద వ్యాఖ్యలు..!!
- By hashtagu Published Date - 09:39 AM, Sun - 20 November 22

అస్సా సీఎం హిమంత బిస్వాశర్మ రాహుల్ గాంధీని టార్గెట్ చేస్తూ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. గుజరాత్ ఎన్నికల నేపథ్యంలో జరిగిన ర్యాలీలో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా వేదికపై నుంచి మాట్లాడిన హిమంత బిస్వా రాహుల్ గాంధీపై విరుచుకుపడ్డారు. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడ్ యాత్ర నేపథ్యంలో ఆయన్ను టార్గెట్ చేశారు హిమంత బిస్వాశర్మ. రాహుల్ జీ మీ ముఖంలో ప్రజలు మహాత్మాగాంధీ,సర్దార్ వల్లాభాయ్ పటేల్ ను చూడాలి. కానీ సద్దాం హుస్సేన్ ను చూడకూడదంటూ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు.
गुजरात के लोगों ने भारत के लोगों पर बहुत बड़ा उपकार किया है कि उन्होंने मोदी जी को राष्ट्र स्तर पर भेजा है। 2022 के गुजरात चुनाव में BJP की जीत का मतलब मोदीजी 2024 में फिर प्रधानमंत्री बनेंगे। pic.twitter.com/WW0PSA4r6Q
— Himanta Biswa Sarma (@himantabiswa) November 19, 2022
గుజరాత్ ఎన్నికల ప్రచారానికి రాపోవడంపై ఆయన్ను టార్గేట్ చేస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీకి ఓ అలవాటు ఉందని…చాలా రోజులుగా గమనిస్తున్నా అన్నారు. గౌహతిలో క్రికెట్ మ్యాచ్ జరుగుతుంటే గుజరాత్ లో ఉంటాడు. గుజరాత్ లో తనతోపాటే బ్యాట్, ప్యాడ్ రెడీగా ఉంచుకుంటాడు .కానీ గ్రౌండ్ కు మాత్రం రాడు సెటైర్లు విసిరారు. రాహుల్ సావర్కర్ ను టార్గెట్ చేసిన తర్వాత కూడా సీఎం బిస్వా వంగ్యాస్త్రాలు సంధించాడు. అసలు రాహుల్ గాంధీకి చారిత్రక పరిజ్ణానం లేదన్నారు. సావర్కర్ ను అనుమానించడం ద్వారా ఘోరపాపంచేశాడు. దీనికి రాజకీయంగా మూల్యం చెల్లించుకోవల్సి వస్తుందన్నారు.