Asaduddin Owaisi : వివాదాస్పదంగా మారిన అసదుద్దీన్ నినాదం
ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఉర్దూలో ప్రమాణం చేశారు. అనంతరం ఆయన జై పాలస్తీనా నినాదం ఇవ్వడంతో పలువురు సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు
- By Sudheer Published Date - 05:40 PM, Tue - 25 June 24

లోక్ సభ లో ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ (Asaduddin Owaisi) చేసిన ప్రమాణం (Oath) వివాదాస్పదంగా మారింది. లోక్ సభలో కొత్తగా ఎన్నికైన ఎంపీల ప్రమాణ స్వీకారం తంతు జరుగుతున్న సంగతి తెలిసిందే. నిన్న ఏపీ ఎంపీలు ప్రమాణ స్వీకారం చేయగా..ఈరోజు తెలంగాణ ఎంపీలు చేశారు. కాంగ్రెస్ ఎంపీలు మల్లు రవి, చామల కిరణ్ కుమార్ రెడ్డి, రఘువీర్ రెడ్డి, బలరాం నాయక్, కడియం కావ్య, సురేశ్ షెట్కార్ లు తెలుగులో ప్రమాణం చేయగా, వంశీకృష్ణ, రామసహాయం రఘురాంరెడ్డి ఇంగ్లీష్‌లో ప్రతిజ్ఞ చేశారు.
We’re now on WhatsApp. Click to Join.
బీజేపీ ఎంపీలు ఈటల రాజేందర్, డీకే అరుణ తెలుగులో ప్రమాణం చేయగా, రఘునందన్ రావు, ధర్మపురి అర్వింద్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఇంగ్లీష్‌లో, గోడం నగేశ్ హిందీలో ప్రమాణం చేశారు. ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఉర్దూలో ప్రమాణం చేశారు. అనంతరం ఆయన జై పాలస్తీనా నినాదం ఇవ్వడంతో పలువురు సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. జై పాలస్తీనా అనడం తప్పు కాదా ? అని ప్రశ్నించారు.
అసదుద్దీన్ స్పందిస్తూ… తాను చెప్పిన దాంట్లో తప్పేముందని ప్రశ్నించారు. జై పాలస్తీనా అంటే ఇబ్బంది ఏమిటని నిలదీశారు. అభ్యంతరం చెప్పేవాళ్ల గురించి తాను పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. మహాత్మా గాంధీ కూడా పాలస్తీనా గురించి ఏం చెప్పారో చదివి తెలుసుకోవాలని సూచించారు. నేను చెప్పాల్సింది చెప్పానని వ్యాఖ్యానించారు. అసదుద్దీన్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో ఆయన వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగిస్తామని స్పీకర్ వెల్లడించారు.
Read Also : BRS : రేవంత్ రెడ్డి సోదరుడు చెక్కులు పంపిణి చేయడం ఫై బిఆర్ఎస్ ఆగ్రహం