Maharashtra : రెండు రోజుల్లో కొత్త సీఎం పై ప్రకటన : ఏక్‌నాథ్ షిండే
ఈ ఎన్నికల్లో మహాయతి కూటమి ఘన విజయం సాధించింది. అందులో బీజేపీ 100 మార్క్‌ను దాటి సీట్లను గెలుకుంది. ఈ నేపథ్యంలో బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్‌నే ముఖ్యమంత్రి అవుతారని అందరూ భావించారు.
- By Latha Suma Published Date - 01:15 PM, Fri - 29 November 24

Maharashtra CM : మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడై వారం రోజులు గడిచిన ఇప్పటి వరకూ ముఖ్యమంత్రి ఎవరన్న సందిగ్ధం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఒకటి లేదా రెండు రోజుల్లో దీనిపై ప్రకటన వస్తుందని ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే తాజాగా వెల్లడించారు. కాగా, ఈ నెల 23వ తేదీన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు విడుదలయ్యాయి. ఈ ఎన్నికల్లో మహాయతి కూటమి ఘన విజయం సాధించింది. అందులో బీజేపీ 100 మార్క్‌ను దాటి సీట్లను గెలుకుంది. ఈ నేపథ్యంలో బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్‌నే ముఖ్యమంత్రి అవుతారని అందరూ భావించారు. కానీ ఆ కూటమిలో నేతలే ఏక్‌నాథ్ షిండే, అజిత్ పవార్‌లు సిఎం పదవికి పోటీ పడడంతో.. కొత్త సిఎం ఎవరనేది సర్వత్రా ఆసక్తి నెలకొంది.
ఇకపోతే..మహాయతి కూటమి నేతలు ఎన్నికల ఫలితాలనంతరం కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పలుమార్లు చర్చలు జరిపారు. రోజులు గడుస్తున్నా.. సిఎం పదవిపై ఇంతవరకూ స్పష్టత రాలేదు. అయితే ఫడ్నవీస్‌కే బీజేపీ అధిష్టానం ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టే యోచనల్లో ఉన్నట్లు సమాచారం. ఏక్‌నాథ్ షిండేకి హోంశాఖ, అజిత్ పవార్‌కు ఫైనాన్స్ ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక ఈ విషయంపై చర్చించేందుకు గురువారం రాత్రి మహాయుతి నేతలు దేవేంద్ర ఫడ్నవీస్, ఏక్నాథ్ షిండే, అజిత్ పవార్ హోంమంత్రి అమిత్ షాను కలిసేందుకు ఢిల్లీ చేరుకున్నారు. ఈ సమావేశంలోనే ఈ సమీకరణ ఖరారైనట్లు సమాచారం. బీజేపీ నేత ముఖ్యమంత్రి అయితే ఇరు పార్టీలకు ఎలాంటి అభ్యంతరం ఉండదని సమావేశంలో ఇరు పక్షాలు అంగీకరించాయి. ఢిల్లీలోని తన నివాసంలో మంత్రి అమిత్ షా అధ్యక్షతన జరిగిన రెండు గంటల సుదీర్ఘ సమావేశం అర్ధరాత్రి ముగిసింది.
మరోవైపు బీజేపీ ముఖ్యమంత్రితోపాటు సగానికిపైగా మంత్రి పదవులను తన వద్దే ఉంచుకోనున్నట్లు సమాచారం. మహారాష్ట్రలో సీఎంతో సహా అత్యధికంగా 43 మంది మంత్రులను నియమించుకునే వీలుంటుంది. ఇందులో షిండే నేతృత్వంలోని శివసేనకు 12, అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీకి 9 మంత్రి పదవులు ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. ఇందులో షిండే వర్గానికి మూడు కీలక మంత్రిత్వ శాఖలు దక్కే అవకాశం ఉన్నట్లు తెలిసింది.