Singapore CJ: సుప్రీం కోర్టులో ఈరోజు ఆసక్తికర సన్నివేశం.. సుప్రీం కోర్టులో సింగపూర్ సీజే
సుప్రీంకోర్టు (Supreme Court) 73వ వార్షికోత్సవం సందర్భంగా శనివారం నిర్వహించనున్న కార్యక్రమానికి హాజరయ్యేందుకు
- Author : Maheswara Rao Nadella
Date : 03-02-2023 - 4:05 IST
Published By : Hashtagu Telugu Desk
ఈరోజు ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనంతో కలిసి సింగపూర్ సుప్రీంకోర్టు సీజే (Singapore CJ) జస్టిస్ సుందరేశ్ మీనన్ కూర్చున్నారు.
సుప్రీంకోర్టు 73వ వార్షికోత్సవం సందర్భంగా శనివారం నిర్వహించనున్న కార్యక్రమానికి హాజరయ్యేందుకు భారత్ కు జస్టిస్ మీనన్ వచ్చారు. ఈ సందర్భంగానే సీజేఐ బెంచ్ తోపాటు కోర్టులో కూర్చున్నారు. ఇక రేపు నిర్వహించే కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జస్టిస్ మీనన్ పాల్గొంటారు. ‘ప్రపంచాన్ని మార్చడంలో న్యాయ వ్యవస్థ పాత్ర’ అనే అంశంపై జస్టిస్ మీనన్ ప్రసంగిస్తారు.
‘‘భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తులతో సింగపూర్ సీజే (Singapore CJ) చర్చలు జరుపుతారు. రెండు న్యాయవ్యవస్థల మధ్య మరింత సహకారం, న్యాయ విద్య, జ్ఞానాన్ని పంచుకునే అవకాశాల గురించి చర్చించే అవకాశం ఉంది’’ అని సుప్రీంకోర్టు ఓ ప్రకటనలో తెలిపింది.
Also Read: Anand Mahindra: ఈ హోటల్ వర్కర్ పనితనానికి ఆనంద్ మహీంద్రా ఫిదా