HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >Amit Shahs Sensational Statement On Article 370 Abrogation

Amit Shah: ఆర్టికల్ 370 రద్దు పై అమిత్ షా సంచలనం…

జమ్మూ కాశ్మీర్‌లో ఆర్టికల్ 370ని పునరుద్ధరించే అవకాశాలను కేంద్ర హోం మంత్రి అమిత్ షా తోసిపుచ్చారు. "ఇందిరా గాంధీ స్వర్గం నుండి తిరిగి వచ్చినా, ఆర్టికల్ 370 పునరుద్ధరించబడదు" అని ఆయన స్పష్టం చేశారు.

  • Author : Vamsi Chowdary Korata Date : 14-11-2024 - 3:11 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Amit Shah On Article 370
Amit Shah On Article 370

Amit Shah: జమ్మూ కాశ్మీర్‌లో ఆర్టికల్ 370ని పునరుద్ధరించే అవకాశాలు లేదని కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పష్టత ఇచ్చారు. మహారాష్ట్రలో జరిగిన ఎన్నికల ర్యాలీలో మాట్లాడుతూ, “ఇందిరా గాంధీ స్వర్గం నుండి దిగి వచ్చినా, ఆర్టికల్ 370 పునరుద్ధరించబడదు” అని ఆయన ప్రకటించారు. 2019లో నరేంద్ర మోడీ నాయకత్వంలోని ప్రభుత్వం ఆర్టికల్ 370ని రద్దు చేసి, జమ్మూ కాశ్మీర్‌కు ఇచ్చిన ప్రత్యేక హోదాను తొలగించింది. ఈ నిర్ణయం తర్వాత, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించారు.

ముస్లిం రిజర్వేషన్లపై అమిత్ షా రాహుల్ గాంధీని టార్గెట్ చేశారు:

ముస్లిం రిజర్వేషన్లపై రాహుల్ గాంధీని టార్గెట్ చేస్తూ అమిత్ షా ఇలా అన్నారు, “కొన్ని రోజుల క్రితం, ఉలేమాలు (ముస్లిం పండితులు) కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిని కలిశారు. ముస్లింలకు ఉద్యోగాలు, విద్యా రంగాల్లో రిజర్వేషన్లు ఇవ్వాలని వారు చెప్పారు. కానీ, ముస్లింలకు రిజర్వేషన్లు ఇచ్చి ఎస్సీ/ఎస్టీ/ఓబీసీ కోటాలు తగ్గించడం అనేది అసాధ్యం. రాహుల్ బాబా, మీరు మాత్రమే కాదు, మీ నాలుగు తరాలు కలిసి వచ్చినా, వారు ఎస్సీ/ఎస్టీలు/ఓబీసీల కోటాను తగ్గించి ముస్లింలకు ఇవ్వలేరు” అని అమిత్ షా స్పష్టం చేసారు.

సోనియాగాంధీపై అమిత్ షా తీవ్ర విమర్శలు చేశారు. “రాహుల్ బాబా పేరుతో సోనియా 20 సార్లు విమానాన్ని ల్యాండ్ చేయడానికి ప్రయత్నించారు, కానీ 20 సార్లు ఆ విమానం కూలిపోయింది. ఇప్పుడు మహారాష్ట్రలో 21వ సారి విమానాన్ని ల్యాండ్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి” అని అమిత్ షా పేర్కొన్నారు.

“మీ రాహుల్ విమానం 21వ సారి కూడా క్రాష్ కానుంది,” అని ఆయన అన్న దానికి ఉద్దేశం, మహారాష్ట్రలో తమ పార్టీ గెలుపు ఖాయం అనే ధోరణిని అయన వ్యక్తపరిచాడు. ” ఈ రాష్ట్రాన్ని ఎవరి చేతిలో పెట్టాలన్నది మరి కొద్ది రోజుల్లో మహారాష్ట్ర ఓటర్లు తమ నిర్ణయాన్ని తీసుకుంటారు,” అని అమిత్ షా చెప్పారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • amit shah
  • ARTICLE 370
  • Jammu and Kashmir
  • Muslim voters
  • narendra modi
  • rahul gandhi

Related News

President Donald Trump congratulated Taranjit Singh Sandhu on becoming the new Lieutenant Governor of Delhi

Donald Trump: ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్‌పై ట్రంప్ ప్రశంసల వర్షం

Taranjit Singh Sandhu అంతర్జాతీయ వేదికపై భారత్ ప్రాధాన్యత రోజురోజుకూ పెరుగుతోందనడానికి అగ్రరాజ్యం అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలే నిదర్శనంగా నిలుస్తున్నాయి. భారత ప్రధాని నరేంద్ర మోదీ తనకు అత్యంత ఆప్తమిత్రుడని, ఆయన దేశం కోసం అద్భుతంగా పనిచేస్తున్నారని ట్రంప్ కొనియాడారు. ఇటీవల వీరిద్దరి మధ్య జరిగిన 40 నిమిషాల సుదీర్ఘ ఫోన్ సంభాషణలో పశ్చిమాసియా ఉద్రిక్తతల

    Latest News

    • బీజేపీ మాజీ ఎంపీ మృతి.. పీఎం మోదీ సంతాపం

    • అజింక్యా ర‌హానే ఖాతాలో మ‌రో చెత్త రికార్డు!

    • హోర్ముజ్ జలసంధి నుండి బ‌య‌ట‌ప‌డిన భార‌త నౌక‌!

    • సీజ్‌ఫైర్‌పై నీలినీడలు?

    • టీమిండియా ఖాతాలో మ‌రో ఓట‌మి!

    Trending News

      • గల్ఫ్ దేశాల్లో కొనసాగుతున్న ఉత్కంఠ.. హోర్ముజ్ జలసంధికి పొంచి ఉన్న ముప్పు!

      • ఏసీ నడపడానికి ఎంత సోలార్ సామర్థ్యం ఉండాలి?

      • Punarvika: చిన్నారి పునర్వికకు రూ.16 కోట్ల ఇంజెక్షన్‌ తెప్పించిన లోకేశ్‌

      • అక్షయ తృతీయ 2026.. లక్ష్మీ పూజ కోసం ఇంటిని ఎలా సిద్ధం చేయాలి?

      • నేడు ఢిల్లీతో ఆర్సీబీ ఢీ.. ఇంపాక్ట్ ప్లేయ‌ర్‌గా కోహ్లీ?

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd