Amit Shah : మేం రాగానే.. ముస్లిం రిజర్వేషన్లను తొలగిస్తాం
మిగులు బడ్జెట్‌గా ఉన్న రాష్ట్రం ఇప్పుడు అప్పులపాలయ్యిందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు.
- By Kavya Krishna Published Date - 05:52 PM, Sat - 11 May 24

మిగులు బడ్జెట్‌గా ఉన్న రాష్ట్రం ఇప్పుడు అప్పులపాలయ్యిందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు. ఇవాళ హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియాతో సమావేశంలో మాట్లాడుతూ… గతంలో బీఆర్‌ఎస్ అప్పులు చేసినట్లే కాంగ్రెస్ కూడా చేస్తోందని ఆరోపించారు. ఈ పదేళ్లలో తెలంగాణకు లక్షల కోట్ల నిధులు ఇచ్చామని అమిత్ షా అన్నారు. ఓవైపు ఇండి కూటమి.. రెండోవైపు ఎన్డీయే కూటమి అని, ఓవైపు 12 లక్షల కోట్ల అవినీతికి కూటమి.. మరోవైపు 25 పైసల అవినీతి కూడా లేని మోదీ కూటమి అని ఆయన వ్యాఖ్యానించారు. అధికార అహంకారం తలకెక్కిన ఇండికూటమి.. 23 ఏళ్లుగా.. సెలవు లేకుండా దీపావళిని కూడా సైనికుల మధ్య జరుపుకునే మోదీ కూటమి అని ఆయన అన్నారు. ఈ పదేళ్లలో మేం దేశ అంతర్గత భద్రత, ఆర్ధిక వ్యవస్థ, మౌలికవసతుల అభివృద్ధి, డిజిటల్ ఇండియా, స్టార్టప్ వంటివాటిలో గణనీయమైన ప్రగతిని సాధించామని, 20సార్లు లాంచ్ చేసినా.. రాహుల్ లాంచింగ్ ను కాంగ్రెస్ విజయవంతంగా చేపట్టలేకపోతోందని అమిత్‌షా అన్నారు.
We’re now on WhatsApp. Click to Join.
21వసారి కూడా అదే విఫలప్రయత్నం దిశగా వారు పనిచేస్తున్నారని అమిత్ షా విమర్శలు గుప్పించారు. 2014లో తెలంగాణలో రెవెన్యూ సర్ ప్లస్ ఉన్నదని, కానీ ఈ పదేళ్లలో రాష్ట్రప్రభుత్వాల తీరుతో రాష్ట్రం ఆర్థికంగా వెనుకబడిందని ఆయన వెల్లడించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు రూ.15వేల కోట్లు లభిస్తే.. ఇవాళ ఒక్క తెలంగాణకే రూ.60వేల కోట్లు గ్రాంట్ ఇన్ ఎయిడ్ గా లభిస్తోందని ఆయన పేర్కొన్నారు. మౌలికవసతులు, విమానాశ్రయాలు, జాతీయ రహదారులకోసం.. స్వాతంత్ర్యం వచ్చినప్పటినుంచి 2014 వరకు వచ్చిన నిధులకంటే.. ఈ పదేళ్లలో రెట్టింపు నిధులు మోదీ గారు ఇచ్చారని, అవినీతి, అక్రమాలు, కుటుంబ రాజకీయాలతో తెలంగాణ రాజకీయాలు భ్రష్టుపట్టాయని అమిత్ షా మండిపడ్డారు.
ఈ పరిస్థితి అర్థం చేసుకున్న ప్రజలు ఈసారి వీలైనన్ని ఎక్కువసీట్లలో బీజేపీకి విజయాన్ని కట్టబెట్టనున్నాయని, బీఆర్ఎస్, కాంగ్రెస్ ఎవరు అధికారంలో ఉన్నా.. నడిపేది మజ్లిస్ పార్టీయే అని ఆయన అన్నారు. తెలంగాణల్ 4శాతం ముస్లిం రిజర్వేషన్లు.. ఎస్సీ, ఎస్టీ, బీసీల హక్కులను కాలరాయడమేనని, మేం రాగానే.. ముస్లిం రిజర్వేషన్లను తొలగిస్తామని అమిత్ షా అన్నారు. కాంగ్రెస్ 6 గ్యారెంటీల అమలులో విఫలమైందని, 2 లక్షల రుణమాఫీని సోనియా జన్మదినం రోజు చేస్తామన్నారని, సోనియా ఎన్నవ పుట్టినరోజు అనేది చెప్పలేదన్నారు అమిత్ షా. రైతులకు రూ.15వేల రైతు భరోసా అన్నారు. అది కూడా చేయలేదని, క్వింటాలుపై ధాన్యానికి రూ.500 బోనస్ ఇస్తా అన్నారు ఇవ్వలేదన్నారు అమిత్ షా. మహిళలకు రూ.2500 ఇస్తామన్నారు అది కూడా చేయలేదని, ఇవేవీ చేయలేదు.. కానీ.. హైకమాండ్ కు ఇచ్చిన ఒక్క హామీని మాత్రం పూర్తిచేస్తున్నారన్నారు అమిత్ షా. దేశవ్యాప్తంగా ఎన్నికలకోసం తెలంగాణ నుంచి వసూలు చేసి పంపిస్తున్నారని, కాంగ్రెస్ నాయకుడు మణిశంకర్ అయ్యర్, కూటమి నాయకుడు ఫారూఖ్ అబ్దుల్లా చేసిన వ్యాఖ్యలు దేశసమగ్రతను దెబ్బతీసేలా ఉన్నాయని అమిత్ షా వ్యాఖ్యానించారు.
Read Also : Viral News : టీడీపీ క్యాడర్‌కు అతిపెద్ద మోటివేషన్..!