Covid Like Scare : ‘కేరళకు వెళ్లొద్దు.. బీ కేర్ ఫుల్..’ కర్ణాటక బార్డర్ లో హెల్త్ అలర్ట్ !
Covid Like Scare : కేరళలోని కోజికోడ్ జిల్లాలో నిఫా వైరస్ కలకలం రేపుతోంది.
- Author : Pasha
Date : 15-09-2023 - 11:06 IST
Published By : Hashtagu Telugu Desk
Covid Like Scare : కేరళలోని కోజికోడ్ జిల్లాలో నిఫా వైరస్ కలకలం రేపుతోంది. ఆ లక్షణాలతో ఎంతోమంది ఆస్పత్రుల్లో చేరుతున్నారు. ఇప్పటికే ఆరుగురు చనిపోయారు. ఈ నేపథ్యంలో కేరళ పొరుగు రాష్ట్రమైన కర్ణాటక కీలక నిర్ణయం తీసుకుంది. అనవసరంగా కేరళకు ప్రయాణాలు పెట్టుకోవద్దని ప్రజలకు సూచిస్తూ ఓ సర్య్కులర్ ను జారీ చేసింది. కేరళలో నిఫా కేసులున్న ప్రాంతాలకు వెళ్లొద్దని నిర్దేశించింది. కేరళ సరిహద్దుల్లో ఉన్న కొడగు, దక్షిణ కన్నడ, చామరాజనగర, మైసూర్ లలో భద్రతను కట్టుదిట్టం చేసింది. కేరళలోని నిఫా ప్రభావిత ప్రాంతాల నుంచి ఎవ్వరినీ కర్ణాటక సరిహద్దు జిల్లాల్లోకి ఎంటర్ కాకుండా చూడాలని అధికారులకు సూచించింది.
Also read : ChatGPT Vs Google : మీడియా, సాఫ్ట్ వేర్ రంగాల్లో ఇక విప్లవమే.. గూగుల్ ‘జెమిని’ వస్తోంది
నిఫా కలకలం నేపథ్యంలో రాజస్థాన్ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ డిపార్ట్‌మెంట్ డైరెక్టర్ ఒక అడ్వైజరీని రిలీజ్ చేసింది. రాష్ట్రంంలోని అన్ని మెడికల్ కళాశాలల ప్రిన్సిపల్స్, అన్ని జిల్లాల చీఫ్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్స్ అప్రమత్తంగా ఉండాలని సూచించింది. కాగా, కేరళలో బయటపడ్డ నిఫా వైరస్ ను బంగ్లాదేశ్ వేరియంట్‌గా గుర్తించారు. 2018 లో నిఫా వైరస్ ప్రబలినంత తీవ్రంగా ఈసారి పరిస్థితులు ఉండవని వైద్య నిపుణులు (Covid Like Scare) అంటున్నారు. గబ్బిలాలు, పందులు, వైరస్ వల్ల కలుషితమైన ఆహారం తీసుకుంటే మానవులకు నిఫా వైరస్ వ్యాపిస్తుంది. మనిషి నుంచి మనిషికి కూడా ఇది సంక్రమిస్తుంది. భారత్ లో ఈ వైరస్ గబ్బిలాల నుంచి వ్యాపించింది. ఇప్పటి వరకు నిఫా వైరస్ కు ఎలాంటి మందులు అందుబాటులో లేవు.