Sonia Gandhi: వాయు కాలుష్యం ఎఫెక్ట్, ఢిల్లీ నుంచి జైపూర్ కు సోనియాగాంధీ షిఫ్ట్!
దీపావళి తర్వాత ఢిల్లీలో ఒక్కసారిగా వాయు కాలుష్యం పెరిగింది. దీంతో పిల్లల నుంచి పెద్దల వరకు వివిధ అనారోగ్య సమస్యలతో బాధపడతున్నారు.
- By Balu J Published Date - 12:34 PM, Wed - 15 November 23
Sonia Gandhi: దీపావళి తర్వాత ఢిల్లీలో ఒక్కసారిగా వాయు కాలుష్యం పెరిగింది. దీంతో పిల్లల నుంచి పెద్దల వరకు వివిధ అనారోగ్య సమస్యలతో బాధపడతున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ తాత్కాలికంగా జైపూర్‌కు వెళ్లారు. ఆమె ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా జైపూర్ లో కొన్ని రోజులు ఉండాలని నిర్ణయించుకున్నారు. రెండు నెలల క్రితం సోనియా గాంధీ శ్వాసకోశ సంబంధిత సమస్యలతో బాధపడుతూ ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోగాలి కాలుష్యం లేని ప్రదేశానికి మారాలని ఆమె వైద్యులు సోనియా గాంధీకి సలహా ఇచ్చారు.
దీంతో సోనియా గాంధీ తన కుమారుడు రాహుల్ గాంధీతో కలిసి జైపూర్ చేరుకున్నారు. గతంలో కూడా ఢిల్లీలో కాలుష్యం పెరిగినప్పుడు సోనియా గాంధీ కొన్ని రోజులు గోవాలో ఉన్నారు. దీపావళి తర్వాత ఢిల్లీలో వాయు కాలుష్యం స్థాయి తీవ్రంగా పెరిగింది. మంగళవారం ఢిల్లీలో ఏక్యూఐ 375(తీవ్ర ప్రమాదకర స్థాయి)కు చేరగా, జైపూర్‌లో ఏక్యూఐ 72(మితస్థాయి)గా నమోదయింది. పొగ కాలుష్యంతో బాధపడే చాలామంది ఢిల్లీ నుంచి సమీప రాష్ట్రాలకు తరలివెళ్తున్నారు.
Also Read: Singareni: సింగరేణి లో రాజకీయ పార్టీల సైరన్, కార్మికుల ఓట్లే లక్ష్యంగా క్యాంపెయిన్!