Telugu News

News
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Special
  • Off Beat
News
News
CloseIcon
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Photo Gallery
  • Speed News
  • Health
  • Life Style
  • Devotional
  • Off Beat

  • Telugu News
  • ⁄India News
  • ⁄Agnipath Scheme For Four Year Military Tour Of Duty Unveiled

Agnipath : త్రివిధ దళాల యువ తేజస్సు “అగ్ని పథ్”కు శ్రీకారం.. ఇదేమిటి?

యువతను స్వల్పకాలికంగా త్రివిధ సైన్య దళాల్లోకి తీసుకునేందుకు అవకాశం కల్పించే "అగ్ని పథ్" రిక్రూట్మెంట్ స్కీం అందుబాటులోకి వచ్చింది.

  • By Hashtag U Published Date - 05:00 PM, Tue - 14 June 22
Agnipath : త్రివిధ దళాల యువ తేజస్సు “అగ్ని పథ్”కు శ్రీకారం.. ఇదేమిటి?

యువతను స్వల్పకాలికంగా త్రివిధ సైన్య దళాల్లోకి తీసుకునేందుకు అవకాశం కల్పించే “అగ్ని పథ్” రిక్రూట్మెంట్ స్కీం అందుబాటులోకి వచ్చింది. ఈ ప్రతిష్టాత్మక సైనిక నియామక ప్రక్రియను రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ మంగళవారం న్యూఢిల్లీలో ప్రారంభించారు. దీనికి 17.5 నుంచి 21 ఏళ్లలోపు యువకులు అర్హులు.వీరిని ప్రత్యేక ఆన్ లైన్ పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. ఈ శిక్షణకు ఎంపికయ్యే వారిని ” అగ్ని వీర్స్” అని పిలుస్తారు. 6 నెలల శిక్షణా కాలంతో కలుపుకొని మొత్తం నాలుగేళ్ల పాటు వీరు సైన్యంలో సేవలు అందిస్తారు. ఈక్రమంలో ప్రతినెలా రూ.45 వేల వేతనం, వైద్య ప్రయోజనాలతో పాటు రూ.48 లక్షల బీమా కవరేజీ కూడా కల్పిస్తారు. మరో 90 రోజుల్లోగా 46000 మంది భర్తీ లక్ష్యంగా.. “అగ్ని పథ్” తొలి బ్యాచ్ నియామక ప్రక్రియ మొదలుకానుంది. 2023 జూన్ లోగా మొదటి బ్యాచ్ శిక్షణ పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి.

Enter India's 'Agniveers' | Announcing the Agnipath scheme, Defence Minister Rajnath Singh (@rajnathsingh) said it was a "historic" move taken by Cabinet Committee on Security.#AgnipathScheme pic.twitter.com/TA24I7VEAA

— IndiaToday (@IndiaToday) June 14, 2022

ఇలా చేరే వారిలో..నాలుగేళ్ళ తర్వాత కేవలం 25 శాతం మంది అగ్ని వీర్ల ఉద్యోగాలను సైన్యంలోకి రెగ్యులరైజ్ చేస్తారు. రెగ్యులరైజ్ అయ్యే వాళ్ళు నాన్ ఆఫీసర్ ర్యాంకుల్లో 15 ఏళ్ళ పాటు పనిచేయొచ్చు. మిగితా 75 శాతం మంది మాత్రం ప్రభుత్వం అందించే రూ.12 లక్షల గౌరవ ప్యాకేజీ తో వైదొలగాల్సి ఉంటుంది. వీరికి పెన్షన్ ప్రయోజనాలు వర్తించవు. ఇలా వైదొలగే వారు భవిష్యత్ లో ఉన్నత విద్య చదవాలన్న.. వ్యాపారం పెట్టుకోవాలనుకున్నా బ్యాంకు లోన్ ను కేంద్రం ఇప్పిస్తుంది. ఏటా భారత రక్షణ బడ్జెట్ లో దాదాపు సగం సైన్యం జీతాలు, పెన్షన్ నిధికి సంబంధించిన కేటాయింపులకే సరిపోతుంది. అగ్ని పథ్ స్కీం ద్వారా సైనికులను భర్తీ చేసుకునే ప్రక్రియను విజయవంతంగా అమలు చేయగలిగితే.. సైన్యం వేతనాలు, పెన్షన్లకు కేటాయింపులు గణనీయంగా తగ్గిపోతాయని మోడీ సర్కారు యోచిస్తోంది.

 

Army chief General Manoj Pande said the Agnipath scheme aims to make the Army a future-ready fighting force capable of meeting multiple challenges across full spectrum of conflict.#AgnipathScheme pic.twitter.com/6mMWzs3Tp6

— IndiaToday (@IndiaToday) June 14, 2022

Tags  

  • agnipath
  • agniveers
  • indian airforce
  • Indian army
  • Indian Navy
  • pm modi

Related News

LPG Price Hike : గ్యాస్ సిలిండ‌ర్ ధ‌ర‌ల‌పై కేంద్రంపై మంత్రి కేటీఆర్ ఫైర్‌

LPG Price Hike : గ్యాస్ సిలిండ‌ర్ ధ‌ర‌ల‌పై కేంద్రంపై మంత్రి కేటీఆర్ ఫైర్‌

హైదరాబాద్: గ్యాస్ సిలిండర్ ధరల పెంపుపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వమే కారణమని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కెటి రామారావు బుధవారం విమర్శించారు. గ్యాస్ సిలిండర్ల ధరలను యూనిట్‌కు రూ.50 పెంచినందున వాటి ధర బుధవారం నుంచి పెరగనుంది. దేశ రాజధాని ఢిల్లీలో ఇప్పుడు యూనిట్ ధర రూ.1,053 అవుతుంది. కోల్‌కతా, ముంబై, చెన్నైలలో వరుసగా రూ.1,079, రూ.1,052.5, రూ.1,068.5గా ఉంటుందని ఇండియన్ ఆ

  • Modi Respect:ఆమెకు మోడీ పాదాభివంద‌నం

    Modi Respect:ఆమెకు మోడీ పాదాభివంద‌నం

  • Megastar & Modi: మెగాస్టార్ కు మోడీ గాలం!

    Megastar & Modi: మెగాస్టార్ కు మోడీ గాలం!

  • Jagan and Modi Tour: మోడీ ప‌ర్య‌ట‌న‌లో జ‌గ‌నే మోనార్క్!

    Jagan and Modi Tour: మోడీ ప‌ర్య‌ట‌న‌లో జ‌గ‌నే మోనార్క్!

  • Modi Success:మోడీ స‌భ సూప‌ర్ హిట్ ర‌హ‌స్య‌మిదే.!

    Modi Success:మోడీ స‌భ సూప‌ర్ హిట్ ర‌హ‌స్య‌మిదే.!

Latest News

  • Cock Fight : హైదరాబాద్ శివారులో కోడిపందాలు…21మంది అరెస్టు…పరారీలో చింతమనేని..!!

  • Coconut: దేవుడికి కొట్టిన కొబ్బరికాయ కుళ్ళిపోతే అర్థం ఏంటి.. దేనికి సంకేతం!

  • Kidney Stones: కిడ్నీలో రాళ్లను న్యాచురల్ గా నివారించేందుకు బెస్ట్ టిప్స్ ఇవే!

  • Vastu Tips : విష్ణుప్రియ అపరాజితను ఈ దిక్కున పెట్టండి…ఇంట్లోకి ఐశ్వర్యం తెస్తుంది..!!

  • Reduce Pain: మందు లేకుండానే నొప్పిని తగ్గించే పనికరం.. ఈ వివరాలు తెలుసుకోండి!

Trending

    • Zomato Bill: ఫుడ్ డెలివరీ మోసం.. వామ్మో ఒకేసారి ఇంత దోచేస్తున్నారా?

    • OTP విషయంలో గొడవ.. ప్యాసింజర్‌ను చంపిన ట్యాక్సీ డ్రైవర్!

    • Swiggy: డెలివరీ బాయ్ కోసం స్విగ్గీ స్వారీ!

    • Air India Alert : ఎయిర్ ఇండియా పేరుపై ఆఫర్.. అది ఫేక్ అంటూ మహారాజా క్లారిటీ!

    • Service Charge In Hotels : హోట‌ల్స్, రెస్టారెంట్లపై ఫిర్యాదుకు టోల్ ఫ్రీ 1915

  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
  • Copyright © 2022 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam
  • Follow us on: