Waqf Board Case: ఆప్ ఎమ్మెల్యేని అరెస్ట్ చేసిన ఈడీ
తెల్లవారుజామున ఈడీ ఆప్ ఎమ్మెల్యే అమానతుల్లా ఇంటికి చేరుకుని దాడులు చేసింది. ఏజెన్సీ అధికారులను తొలుత ఇంట్లోకి రానివ్వలేదు. ఎమ్మెల్యే, అధికారుల మధ్య చాలాసేపు హైవోల్టేజీ డ్రామా కొనసాగింది. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే స్థానిక పోలీసుల సహాయంతో ఈడీ ఎమ్మెల్యేను అరెస్టు చేసింది.
- By Praveen Aluthuru Published Date - 01:58 PM, Mon - 2 September 24

Waqf Board Case: మనీలాండరింగ్ ఆరోపణలపై ఓఖ్లాకు చెందిన ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సోమవారం మధ్యాహ్నం అరెస్టు చేసింది. ఢిల్లీ వక్ఫ్ బోర్డులో నియామకాలు, ఆస్తుల లీజుకు సంబంధించిన అక్రమాలకు సంబంధించి ఈ అరెస్టు జరిగింది. ఆప్ ఎమ్మెల్యే అరెస్టుతో ఆప్ పార్టీలో మళ్ళీ ఆందోళన వ్యక్తమవుతోంది.
తెల్లవారుజామున ఈడీ ఆప్ ఎమ్మెల్యే అమానతుల్లా ఇంటికి చేరుకుని దాడులు చేసింది. ఏజెన్సీ అధికారులను తొలుత ఇంట్లోకి రానివ్వలేదు. ఎమ్మెల్యే, అధికారుల మధ్య చాలాసేపు హైవోల్టేజీ డ్రామా కొనసాగింది. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే స్థానిక పోలీసుల సహాయంతో ఈడీ ఎమ్మెల్యేను అరెస్టు చేసింది.
వక్ఫ్ బోర్డు మనీలాండరింగ్ కేసు విచారణకు సంబంధించి ఈడీ బృందం ఉదయం 6 గంటల ప్రాంతంలో అమానతుల్లా ఇంటికి చేరుకుంది. ఆ సమయంలో ఎమ్మెల్యే ఇంట్లోనే ఉన్నారు. ఇంట్లోకి వెళ్లాలని అధికారులు కోరగా.. ఎమ్మెల్యే తలుపు తీయలేదు. దీనిపై అధికారులు ఫ్లాట్ బయట ఉన్న భవనం మెట్లపై నిలబడ్డారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే, అధికారుల మధ్య హైవోల్టేజీ డ్రామా నడిచింది. దాదాపు ఆరు గంటల తర్వాత ఈడీ అమానతుల్లాను అరెస్టు చేసింది. దీంతో బృందం అతడిని విచారణ నిమిత్తం ఈడీ కార్యాలయానికి తీసుకెళ్లింది. కాగా ఈడీ నోటీసులన్నింటికీ సమాధానమిచ్చామని ఎమ్మెల్యే తెలిపారు. అయినా తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. నన్ను మాత్రమే కాకుండా నా పార్టీని కూడా వేధిస్తున్నారని అమానతుల్లా ఖాన్ అన్నారు.
ఢిల్లీ వక్ఫ్ బోర్డు ఛైర్మన్‌గా ఉంటూ 32 మందిని అక్రమంగా రిక్రూట్ చేసుకున్నట్లు మనీలాండరింగ్ కేసులో ఆప్ ఎమ్మెల్యే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అంతే కాకుండా నిధులు దుర్వినియోగం అయ్యాయి. ఢిల్లీ వక్ఫ్ బోర్డుకు చెందిన పలు ఆస్తులను అక్రమంగా అద్దెకు ఇచ్చాడు.
Also Read: Snoring Tips : గురక సమస్య పరిష్కారానికి ఏం చేయాలి..?