6 Babies Died : పిల్లల ఆస్పత్రిలో అగ్నికీలలు.. ఆరుగురు శిశువులు మృతి.. ఐదుగురు సీరియస్
వివేక్ విహార్‌లోని బేబీ కేర్ ఆస్పత్రిలో సంభవించిన ఘోర అగ్నిప్రమాదంలో ఆరుగురు నవజాత శిశువులు మరణించారు.
- Author : Pasha
Date : 26-05-2024 - 8:48 IST
Published By : Hashtagu Telugu Desk
6 Babies Died : దేశ రాజధాని ఢిల్లీలో ఘోరం జరిగింది. వివేక్ విహార్‌లోని బేబీ కేర్ ఆస్పత్రిలో సంభవించిన ఘోర అగ్నిప్రమాదంలో ఆరుగురు నవజాత శిశువులు మరణించారు. మరో ఐదుగురు శిశువుల పరిస్థితి విషమంగా ఉంది. శనివారం రాత్రి 11:30గంటలకు చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వార్త తాజాగా ఆదివారం ఉదయం మీడియా ద్వారా బయటి ప్రపంచానికి తెలిసింది. అగ్నిమాపక సిబ్బంది దాదాపు గంటసేపు శ్రమించి.. ఈ ఆస్పత్రికి అంటుకున్న మంటలను ఆర్పినట్లు సమాచారం.
We’re now on WhatsApp. Click to Join
ఈ బేబీ కేర్ ఆస్పత్రితో పాటు దాని పక్కనే ఉన్న మరో భవనం అగ్నిప్రమాదంలో కాలిపోయినట్లు చెబుతున్నారు. మరో 12 మందిని ఈ రెండు భవనాల నుంచి రక్షించి చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించాం. ఆస్పత్రిలోని ఆక్సిజన్ సిలిండర్ పేలడం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని భావిస్తున్నారు. ఆస్పత్రి వెలుపల ఉన్న అంబులెన్స్‌లోని సిలిండర్‌లో ఆక్సిజన్ నింపుతుండగా అది పేలిందని స్థానికుల తెలిపారు. మూడు సిలిండర్లు ఒకదాని తర్వాత ఒకటిగా వరుసపెట్టి పేలడంతో ప్రమాద తీవ్రత చాలా పెరిగింది.
Also Read :Pan – Aadhaar : ‘పాన్-ఆధార్’ మే 31లోగా లింక్ చేసుకోండి.. లేదంటే డబుల్ పెనాల్టీ
9 మంది చిన్నారులు..
మరోవైపు గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లోని టీఆర్పీ గేమింగ్ జోన్‌లో శనివారం జరిగిన అగ్ని ప్రమాదంలో 27 మంది చనిపోయారు. వారిలోనూ 9 మంది చిన్నారులే ఉండటం విషాదకరం. ఈ ఘటనలో మంటల్లో కాలిపోయిన డెడ్ బాడీస్ గుర్తు పట్టలేని విధంగా తయారయ్యారని అంటున్నారు. అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే గేమింగ్ జోన్ పైకప్పు కూలి.. అక్కడున్న వారిపై పడింది. దీంతో ప్రజలు ఎటూ కదలలేక మంటల్లో కాలిపోయి సజీవ దహనమయ్యారు. ఈ ఘటనలో మంటలను అదుపులోకి తేవడానికి దాదాపు 4 గంటల టైం పట్టింది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రమాదానికి గురైన టీఆర్‌పీ గేమ్ జోన్ యువరాజ్ సింగ్ సోలంకి అనే వ్యక్తిపేరు మీద ఉందని రాజ్‌కోట్ పోలీస్ కమిషనర్ రాజు భార్గవ్ తెలిపారు. కోసం గుజరాత్ ప్రభుత్వం ప్రత్యేక బృందాన్ని సిట్‌ను ఏర్పాటు చేసింది. గేమ్‌జోన్ యజమాని యువరాజ్ సింగ్ సోలంకి, మేనేజర్ నితిన్‌జైన్ సహా ముగ్గురిని అరెస్టు చేశారు.