Ayodhya Ram Mandir : అయోధ్యలోని బాలక్ రామ్ మందిరం కొత్త రికార్డులు
Ayodhya Ram Mandir : అయోధ్యలోని బాలక్ రామ్ మందిరం భక్తుల దర్శనం, విరాళాల విషయంలో కొత్తకొత్త రికార్డులను క్రియేట్ చేస్తోంది.
- Author : Pasha
Date : 25-02-2024 - 10:32 IST
Published By : Hashtagu Telugu Desk
Ayodhya Ram Mandir : అయోధ్యలోని బాలక్ రామ్ మందిరం భక్తుల దర్శనం, విరాళాల విషయంలో కొత్తకొత్త రికార్డులను క్రియేట్ చేస్తోంది. జనవరి 22న ఆలయం ఘనంగా ప్రారంభమైంది. నాటి నుంచి నేటి వరకు.. నెల రోజుల్లో దాదాపు 60 లక్షల మంది భక్తులు బాలక్ రామ్‌ను దర్శించుకున్నారు. రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ఠ తరువాత రాములవారి ఆలయానికి విరాళాలు కూడా వెల్లువెత్తాయి. జనవరి 22 నుంచి ఫిబ్రవరి 22 వరకు ఆలయానికి బంగారం, వెండి, చెక్కులు తదితర రూపాల్లో సమకూరిన విరాళాల విలువెంతో తెలుసా.. అక్షరాలా రూ.25 కోట్లు. ట్రస్ట్ కార్యాలయ ఇన్‌ఛార్జ్ ప్రకాష్ గుప్తా ఈవివరాలను వెల్లడించారు. వివిధ రూపాల్లో వచ్చిన రూ.25 కోట్ల విరాళాలు ఆలయం హుండీల్లో జమ అయ్యాయని తెలిపారు. భక్తులు సమర్పించిన బంగారు, వెండి ఆభరణాల నిర్వహణ, కరిగించడం వంటి పనులను భారత ప్రభుత్వ మింట్‌కు అప్పగించినట్లు వివరించారు. ఆన్ లైన్ చెల్లింపుల గురించి తమకు తెలియదన్నారు.
We’re now on WhatsApp. Click to Join
అయోధ్యలో జరిగే శ్రీ రామ నవమి వేడుకల్లో విరాళాలు మరింతగా పెరుగుతాయని ఆలయ ట్రస్ట్ భావిస్తోంది. రసీదుల జారీకి కంప్యూటరైజ్డ్ కౌంటర్లతోపాటు ఆలయ ప్రాంగణంలో అదనపు హుండీలను ఏర్పాటు చేస్తారు. భారీ మొత్తంలో అందే నగదు విరాళాల లెక్కింపు కోసం నాలుగు ఆటోమేటిక్ హైటెక్ కౌంటింగ్ మెషీన్లను ఎస్‌బీఐ ఏర్పాటు చేసింది. పెద్ద మొత్తంలో నగదు లెక్కింపు కోసం ఒక ప్రత్యేక గదిని త్వరలో నిర్మించనున్నారు.
Also Read : Cannabis Plants : ఇళ్లలో గంజాయి మొక్కల పెంపకం.. చట్టానికి ఆమోదం
అయోధ్య రామ మందిరాన్ని (Ayodhya Ram Mandir) మరికొన్ని రోజులపాటూ రోజూ గంటపాటు మూసివేయనున్నారు. ఆలయ ట్రస్ట్ దర్శన సమయాన్ని ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటలకు పెంచింది. ప్రతిష్ఠా కార్యక్రమానికి ముందు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు దర్శన సమయం, మధ్యాహ్నం 1.30 నుంచి 3.30 గంటల వరకు రెండు గంటల విరామం ఉంటుంది.