LIC Jobs : 250 అప్రెంటిస్‌షిప్ జాబ్స్.. ఎల్‌ఐసీ ఎంప్లాయీగా మారే ఛాన్స్
LIC Jobs : ఎల్‌ఐసీ సంస్థకు చెందిన ఎల్‌ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ బ్రాంచ్‌లలో అప్రెంటిస్‌షిప్ చేసే అవకాశమిది.
- By Pasha Published Date - 12:10 PM, Sat - 23 December 23

LIC Jobs : ఎల్‌ఐసీ సంస్థకు చెందిన ఎల్‌ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ బ్రాంచ్‌లలో అప్రెంటిస్‌షిప్ చేసే అవకాశమిది. దేశవ్యాప్తంగా 250 అప్రెంటిస్‌షిప్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. ఏదైనా డిగ్రీ చేసిన అభ్యర్థులు ఈ జాబ్స్‌కు అప్లై చేయొచ్చు. 2023 డిసెంబర్ 1 నాటికి 20 నుంచి 25 ఏళ్లలోపు వయసు కలిగినవారు వీటికి అర్హులు. అప్లికేషన్ ఫీజు దివ్యాంగ అభ్యర్థులకు రూ.472, ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులకు రూ.708, జనరల్ కేటగిరీ, ఓబీసీ అభ్యర్థులకు రూ.944 ఉంటుంది. ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌లో అప్లికేషన్ సబ్మిట్ చేసేందుకు చివరి తేదీ డిసెంబర్ 31.
We’re now on WhatsApp. Click to Join.
ఎగ్జామ్ ఫీజు కట్టేందుకు లాస్ట్ డేట్ జనవరి 03. ఆన్‌లైన్ రాత పరీక్ష, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. జనవరి 6న ఎగ్జామ్ ఉంటుంది. జనవరి 9 నుంచి 11 వరకు డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఇంటర్వ్యూలు జరుగుతాయి. ఈ జాబ్స్‌కు ఎంపికయ్యే అభ్యర్థులకు జాబ్ ఆర్డర్స్ జనవరి 12 నుంచి 13లోగా జారీ అవుతాయి. జనవరి 15 నుంచి ఎల్‌ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ బ్రాంచ్‌లలో వీరికి ట్రైనింగ్ ప్రారంభం అవుతుంది. అభ్యర్థులకు 12 నెలలు అప్రెంటిస్ శిక్షణను అందిస్తారు. ప్రతినెలా రూ.9,000 నుంచి రూ.15,000 వరకు స్టైపెండ్‌ను(LIC Jobs) అందిస్తారు.