Indian Fishermen : పాక్ జైలు నుండి 22 మంది భారతీయ జాలర్లు విడుదల
కరాచీ నుంచి లాహోర్ వరకు వెళ్లేందుకు అవసరమైన రవాణా సౌకర్యాలను సమకూర్చింది. అక్కడి నుంచి వారు భారత్‌కు చేరుకోనున్నారు. ఆ సంస్థ మత్స్యకారులకు ప్రయాణఖర్చులు, కొన్ని బహుమతులు, నగదు అందించింది.
- By Latha Suma Published Date - 11:38 AM, Sat - 22 February 25

Indian Fishermen : 22 మంది భారత మత్స్యకారులు పాకిస్థాన్ జైలు నుంచి విడుదలయ్యారు. శిక్షాకాలం పూర్తి కావడంతో కరాచీలోని మాలిర్ కారాగారం నుంచి శుక్రవారం వారిని విడుదల చేశారు. జాతీయ మీడియా కథనాల ప్రకారం, ఈ రోజు వారిని భారత్‌కు అప్పగించే అవకాశం ఉంది. భారత జాలర్ల ప్రయాణ ఏర్పాట్లలో ఈది ఫౌండేషన్ కీలక సహాయసహకారాలు అందించింది. కరాచీ నుంచి లాహోర్ వరకు వెళ్లేందుకు అవసరమైన రవాణా సౌకర్యాలను సమకూర్చింది. అక్కడి నుంచి వారు భారత్‌కు చేరుకోనున్నారు. ఆ సంస్థ మత్స్యకారులకు ప్రయాణఖర్చులు, కొన్ని బహుమతులు, నగదు అందించింది.
Read Also: Odela 2 Teaser : తమన్నా ఓదెల 2 టీజర్ వచ్చేసింది.. మహా కుంభమేళాలో రిలీజ్..
ఈ సందర్భంగా భారత్-పాక్ ప్రభుత్వాలకు ఈది ఫౌండేషన్ ఛైర్మన్ ఫైజల్ ఈది ఒక అభ్యర్థన చేశారు. ఎలాంటి దురుద్దేశం లేకుండా పొరపాటున అంతర్జాతీయ జలాల సరిహద్దులు దాటుతున్న వారిపై దయతో వ్యవహరించాలని అభ్యర్థించారు.
వాఘా సరిహద్దు ద్వారా పాక్ అధికారులు ఈ జాలర్లను భారత్‌కు అప్పగిస్తారు. అన్ని ప్రక్రియలు పూర్తిచేసిన తర్వాత మన అధికారులు వారిని స్వస్థలాలకు పంపేందుకు ఏర్పాట్లుచేస్తారు.
కాగా, జనవరి 1న ఇరుదేశాల ఖైదీల జాబితా మార్పిడి జరిగింది. పాకిస్థాన్‌లో 266 మంది భారత ఖైదీలు ఉన్నారు. భారత జైళ్లలో మొత్తం 462 మంది పాకిస్థానీయులు ఉన్నట్లు మన దేశ జాబితా పేర్కొంది. ఇక మత్స్యకారులు సరిహద్దులను సరిగా గుర్తించకపోవడంతో ఇరువైపులా ఈ అరెస్టులు జరుగుతున్నాయి. ఖైదీల జాబితా మార్పిడి ప్రధానంగా ఆరు నెలలకు ఒకసారి జరుగుతుంది. కానీ కొన్నిసార్లు ఇది అత్యవసర పరిస్థితుల వల్ల వేగంగా జరగవచ్చు.
Read Also: Bengaluru : మహిళపై రెచ్చిపోయిన కామాంధులు