Manipur violence: మణిపూర్‌లో ‘ఇండియా’ పర్యటన
మణిపూర్‌లో అడపాదడపా హింసాత్మక సంఘటనలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి.దీనికి సంబంధించి పార్లమెంట్ లో రచ్చ జరగడంతో పాటు ప్రతిపక్షాలు కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నాయి
- Author : Praveen Aluthuru
Date : 29-07-2023 - 10:05 IST
Published By : Hashtagu Telugu Desk
Manipur violence: మణిపూర్‌లో అడపాదడపా హింసాత్మక సంఘటనలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి.దీనికి సంబంధించి పార్లమెంట్ లో రచ్చ జరగడంతో పాటు ప్రతిపక్షాలు కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నాయి. మరోవైపు ప్రతిపక్ష పార్టీల కూటమి ‘ఇండియా’ కి చెందిన 21 మంది ఎంపీల బృందం ఈరోజు మణిపూర్‌లో పర్యటించేందుకు బయలుదేరింది. ఈ ఎంపీలు హింస ప్రభావిత ప్రాంతాలను, సహాయక శిబిరాలను సందర్శించి క్షేత్రస్థాయి పరిస్థితిని సమీక్షిస్తారు. దేశమంతా శాంతి మార్గంలో నడవాలని కోరుకుంటున్నామని వారు అన్నారు. మణిపూర్‌లో శాంతి నెలకొనాలని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా పిలుపునిచ్చారు.
మణిపూర్ పర్యటనకు వెళ్లిన కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. మణిపూర్‌లో శాంతి నెలకొందని కేంద్ర ప్రభుత్వం చెబుతోందని, అలాంటప్పుడు ప్రజలు సహాయక శిబిరాల్లో ఎందుకు నివసిస్తున్నారని అన్నారు. వారు ఎందుకు తమ స్వస్థలాలకు వెళ్లలేకపోతున్నారు? ఒకవేళ ప్రధాని మోదీ అఖిలపక్ష ప్రతినిధి బృందంతో కలిసి మణిపూర్‌లో పర్యటించాలని నిర్ణయించుకుంటే, మేము ఆయనతో పాటు వెళ్లాలనుకుంటున్నామని చెప్పారు.
Also Read: IND vs WI 2nd ODI: ఇషాన్ (55) శుభమాన్(34) వద్ద అవుట్