20 Cars Gutted: పార్కింగ్‌లో 20 కార్లు దగ్ధం.. కారణమిదే..?
ఒకరి మీద కోపంతో ఓ యువకుడు చేసిన పనికి 20 కార్లు (Cars) అగ్నికి ఆహుతయ్యాయి. ఢిల్లీలోని సుభాష్ నగర్లో 4 అంతస్తుల పార్కింగ్ భవనాన్ని మంటలు చుట్టుముట్టాయి. అగ్నిమాపక సిబ్బంది మంటల్ని అదుపు చేశారు. అయితే ఓ వ్యక్తి కావాలనే కారుకు నిప్పు పెట్టడాన్ని సీసీటీవీ ఫుటేజ్‌ల్లో గమనించారు పోలీసులు. అనంతరం ఆ మంటలు మిగిలిన కార్లను చుట్టుముట్టాయని తెలుసుకున్నారు.
- By Gopichand Published Date - 10:53 AM, Tue - 27 December 22
ఒకరి మీద కోపంతో ఓ యువకుడు చేసిన పనికి 20 కార్లు (Cars) అగ్నికి ఆహుతయ్యాయి. ఢిల్లీలోని సుభాష్ నగర్లో 4 అంతస్తుల పార్కింగ్ భవనాన్ని మంటలు చుట్టుముట్టాయి. అగ్నిమాపక సిబ్బంది మంటల్ని అదుపు చేశారు. అయితే ఓ వ్యక్తి కావాలనే కారుకు నిప్పు పెట్టడాన్ని సీసీటీవీ ఫుటేజ్‌ల్లో గమనించారు పోలీసులు. అనంతరం ఆ మంటలు మిగిలిన కార్లను చుట్టుముట్టాయని తెలుసుకున్నారు.
నిందితుడు 23 ఏళ్ల యశ్ అరోడాగాను అదుపులోకి తీసుకుని విచారించగా ఆ కారు యజమానిపై కోపంతో అలా నిప్పుపెట్టానని చెప్పాడు. అతను తన కుటుంబస భ్యుల్లో ఒకరితో సంబంధం పెట్టుకోవడంతో అసహనానికి గురయ్యానని యశ్ పోలీసులకు తెలిపాడు. నిందితుడిపై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశామన్నారు.
Also Read: Chopped Body Into Pieces: యువకుడిని ముక్కలుగా నరికి.. కుక్కలకు ఆహారం
ప్రస్తుతం పోలీసుల విచారణ కొనసాగుతోందని.. సోమవారం తెల్లవారుజామున 4 గంటలకు అగ్నిప్రమాదం జరిగినట్లు సమాచారం అందిందని అగ్నిమాపక అధికారులు తెలిపారు. సమాచారం అందుకున్న వెంటనే ఆరు అగ్నిమాపక వాహనాలను సంఘటనా స్థలానికి తరలించారు. ఉదయం 6.10 గంటలకు మంటలు అదుపులోకి వచ్చినట్లు అగ్నిమాపక శాఖ సీనియర్ అధికారి తెలిపారు. ప్రస్తుతం ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరిగినట్లు సమాచారం లేదు.
ఇంతకు ముందు కూడా ఆదివారం సౌత్ ఎక్స్ సమీపంలోని డిటిసి బస్సులో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మంటలను చూసిన డ్రైవర్ వెంటనే బస్సు దిగి ప్రాణాలను కాపాడుకున్నాడు. దీంతో పాటు బస్సులో ఉన్న ప్రయాణికులను కూడా వెంటనే బస్సు నుంచి బయటకు తీయడంతో మంటలు చెలరేగడంతో అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అదే సమయంలో సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని అదుపు చేశారు.