Road Accident: మధ్యప్రదేశ్‌లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి.. 17 మందికి గాయాలు
మధ్యప్రదేశ్‌లోని రత్లాం జిల్లాలో రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. జిల్లా కేంద్రానికి 20 కిలోమీటర్ల దూరంలో జవోరా-లాబెడ్ రహదారిపై ట్రక్కును ప్రయాణికులతో వెళ్తున్న బస్సు ఢీకొట్టింది.
- By Gopichand Published Date - 07:22 AM, Thu - 16 February 23

మధ్యప్రదేశ్‌లోని రత్లాం జిల్లాలో రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. జిల్లా కేంద్రానికి 20 కిలోమీటర్ల దూరంలో జవోరా-లాబెడ్ రహదారిపై ట్రక్కును ప్రయాణికులతో వెళ్తున్న బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతిచెందగా 17 మందికి గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే అక్కడకు చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Also Read: Earthquake: ఫిలిప్పిన్స్‌లో భారీ భూకంపం.. పరుగులు తీసిన జనం
పూర్తి వివరాలలోకి వెళ్తే.. మధ్యప్రదేశ్‌లోని రత్లాం జిల్లాలో ఆగి ఉన్న ట్రక్కును బస్సు ఢీకొనడంతో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా, మరో 17 మంది గాయపడ్డారు. జిల్లా కేంద్రానికి 20 కిలోమీటర్ల దూరంలోని బిల్‌పాంక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సర్వర్ జమునియా గ్రామ సమీపంలోని జావ్రా-లెబార్డ్ రహదారిపై ఈ ప్రమాదం జరిగినట్లు ఒక అధికారి తెలిపారు. మహారాష్ట్రలోని పూణె నుంచి భిల్వారా (రాజస్థాన్) వెళ్తున్న రాజస్థాన్ రోడ్‌వేస్ బస్సు రోడ్డు పక్కన ఆగి ఉన్న ట్రక్కును ఢీకొట్టిందని బిల్‌పాంక్ పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ ఓపీ సింగ్ తెలిపారు. 45, 55 సంవత్సరాల వయస్సు గల ఇద్దరు బస్సు డ్రైవర్లు అక్కడికక్కడే మరణించారు. 17 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులు రత్లాంలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.