HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Health
  • >You Will Lose Weight If You Cook Chicken Like This

Chicken: చికెన్‌ ఇలా వండుకుని తింటే బరువు తగ్గుతారట..

చాలా మంది బరువు తగ్గాలంటే నాన్‌వెజ్‌కి దూరంగా ఉండాలని అనుకుంటారు. నిజంగానే, ఇందులో నిజం ఉందా అంటే..

  • Author : Maheswara Rao Nadella Date : 23-02-2023 - 4:30 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
You Will Lose Weight If You Cook Chicken Like This.
You Will Lose Weight If You Cook Chicken Like This.

చికెన్ (Chicken) అంటే చాలా మందికి ఇష్టం. దీనిని చాలా మంది ఎంతో ఇష్టంగా తింటారు. నాన్‌వెజ్‌లో ఎక్కువగా తినే ఫుడ్ ఏదైనా ఉంందంటే.. అది చికెన్ (Chicken) అని కచ్చితంగా చెప్పొచ్చు. ప్రతి ఒక్కరూ ఇష్టంగా తినే ఈ ఫుడ్‌తో బరువు కూడా తగ్గొచ్చొని చెబుతున్నారు నిపుణులు. అందుకు కారణం కూడా లేకపోలేదు. దీనిని ఎలా వండితే మంచిది. రుచితో పాటు బెనిఫిట్స్ అందుకోవాలంటే ఏ రకంగా వండితే బెటర్‌ రిజల్ట్స్ ఉంటాయో ఇప్పుడు చూద్దాం.

చికెన్‌లోని (Chicken) పోషకాలు:

చికెన్‌లో ఎక్కువగా ప్రోటీన్ ఉంటుంది. పిండి పదార్థాలు, కేలరీలు తక్కువగా ఉంటాయి. అందుకే బరువు తగ్గేందుకు ఎక్కువగా హెల్ప్ అవుతుంది. అందరికీ అందుబాటులో ఉండే చికెన్ మిగతా నాన్‌వెజ్ ఐటెమ్స్‌ కంటే కాస్తా తక్కువ ధరలోనే లబిస్తుంది. దీనిని ఎన్నో రకాలుగా కూడా ఈజీగా చేసుకోవచ్చు. ఫ్యామిలీ అంతా హ్యాపీగా తినొచ్చు.

ఎలా వండాలంటే:

చికెన్ తినడం వల్ల బరువు తగ్గుతారు. కానీ, ఇది కూడా దీనిని వండే విధానంపై ఆధారపడి ఉంటుందని చెబుతున్నారు నిపుణులు. ఇష్టంగా వండితే బరువు తగ్గడం అటుంచితే అదనపు బరువు వచ్చి చేరుతుంది శరీరంలో అందుకే దీనిని వండే విధానంలోనూ మార్పు చేయాలి. చికెన్‌ని ఫ్రై చేయకూడదు. చీజ్, ఎక్కువ కేలరీలతో కలిపి తినొద్దు. మరి ఎలా చేసుకుని తినాలంటే అది కూడా చూద్దాం.

చికెన్ (Chicken) టిక్కా:

అరకిలో బోన్‌లెస్ చికెన్, తగినంత ఉప్పు, 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, నిమ్మరసం కొద్దిగా, పెరుగు కొద్దిగా, ఆవ నూనె 4 టేబుల్ స్పూన్లు, తందూరి మసాలా 1 టేబుల్ స్పూన్, 3 టీ స్పూన్ల కాశ్మీరీ ఎర్ర కారం, పావు టీ స్పూన్ పసుపు, అర స్పూన్ గరం మసాలా, అర స్పూన్ మిరియాల పొడి, 1 ఉల్లిపాయ, 1 క్యాప్సికమ్.

తయారీ విధానం:

మందుగా చికెన్‌ని కడగాలి. దీనిని డైస్‌ల్లా కట్ చేయాలి. మెరినేడ్ కోసం ఓ పెద్ద గిన్నెలో పెరుగు, నిమ్మరసం, వెల్లుల్లి అల్లం పేస్ట్, ఉప్పు, గరం మసాలా, కారం, నల్ల మిరియాల పొడి, పసుపు కలపాలి. అందులోని ఆవ నూనె, శనగపిండి, తందూరి మసాలా వేసి మళ్ళీ కలపాలి. ముక్కలకి పట్టించి. తయారైన మసాలా మిశ్రమాన్ని చికెన్ ముక్కలకి పట్టించి కాసేపు మూత పెట్టి పక్కన పెట్టండి. ఇప్పుడు, ఉల్లిపాయ, కాప్సికమ్‌ని కూడా క్యూబ్స్‌ల్లా కట్ చేసి మెరినేట్ చేయండి.

ఓవెన్‌లో:

మైక్రో ఓవెన్‌‌ని 400 డిగ్రీలకు ప్రీహీట్ చేయండి. ఉల్లిపాయ, క్యాప్సికమ్‌తో పాటు మెరినేట్ చేసిన చికెన్‌ని స్కేవర్‌కి పెట్టి బేకింగ్ ట్రేలో పెట్టి 10 నుంచి 12 నిమిషాల పాటు గ్రిల్ చేయండి. దీనిపై నిమ్మరసం చల్లి సర్వ్ చేయండి. ఇలా వంట చేసి తినడం వల్ల ఎక్కువ నూనె పట్టొదు. దీంతో పాటు క్యాప్సికమ్ కూడా ఉంది కాబట్టి అదనపు ఫైబర్ అందినట్లే. కాబట్టి ఫ్రైలాంటివి చేయకుండా ఇలా చేయండి.

Also Read:  Chia Seeds: వేసవిలో చియా విత్తనాలు ఎందుకు తినాలి?


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • benefits
  • chicken
  • cook
  • food
  • health
  • Life Style
  • preparation
  • tips
  • Tricks
  • weight loss

Related News

Health

Health : హైబీపీ – సైలెంట్ కిల్లర్‌ను నిర్లక్ష్యం చేయకండి – డా. చింతా ప్ర‌భాక‌ర్ రెడ్డి

హైబీపీ (అధిక రక్తపోటు) అనేది ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందిని ప్రభావితం చేస్తున్న ఒక ప్రధాన ఆరోగ్య సమస్య. దీనిని “సైలెంట్ కిల్లర్” అని పిలుస్తారు. కారణం, చాలా మందిలో హైబీపీ ఉన్నప్పటికీ ప్రారంభ దశల్లో ఎలాంటి లక్షణాలు కనిపించవు. వ్యక్తికి తాను పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నాననే భావన ఉన్నప్పటికీ, లోపల గుండె, మెదడు, మూత్రపిండాలు మరియు కంటి రక్తనాళాలపై నెమ్మదిగా నష్టం జరుగుతూ ఉం

  • Gismat Jail Mandi

    Food Safety : మదీనగూడలో ఫుడ్ సేఫ్టీ దాడులు.. గిస్మత్ జైల్ మండీకి షోకాజ్ నోటీసు

  • Food safety

    HYD : హోటళ్లలో తనిఖీలు చేసిన ఫుడ్ సేఫ్టీ అధికారులు.. వెలుగులోకి ఆందోళనకర అంశాలు

  • Are you sleeping with your phone under your pillow?

    Sleeping With Phone: ఫోన్‌ను దిండు కింద పెట్టి పడుకుంటున్నారా..?

  • Surgery For Appearance Avika Gor

    Avika Gor: లుక్ కోసం సర్జరీ: అవికా గోర్

Latest News

  • RCB vs GT : ఐపీఎల్ 2026 ఫైనల్: టాస్ గెలిచిన ఆర్‌సీబీ.. రెండో టైటిల్ కోసం ఇరుజ‌ట్లు పోటీ

  • Jaggareddy : మెదక్‌కు డైనమిక్ నాయకుడు అవసరం.. రోహిత్‌పై జగ్గారెడ్డి ప్రశంసలు

  • Congress : ఖర్గేతో సీఎం రేవంత్ భేటీ.. తెలంగాణ రాజకీయాలు, ప్రభుత్వ కార్యక్రమాలపై చర్చ

  • Bengaluru : మటన్ పేరుతో బీఫ్ విక్రయం?.. బెంగళూరులో ఇద్దరు రెస్టారెంట్ యజమానుల అరెస్ట్

  • CONGRESS vs BRS : ప‌వ‌ర్ పాలిటిక్స్‌.. ఉచిత విద్యుత్‌పై రేవంత్ స‌వాల్‌కు బీఆర్ఎస్ సైలెంట్‌..?

Trending News

    • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd