2025లో ట్రెండింగ్‌గా నిలిచిన ఫిట్‌నెస్ విధానాలీవే!!
గ్రూప్ ట్రైనింగ్ 2025లో వైరల్ అయింది. ఇంట్లో ఒంటరిగా వ్యాయామం చేయడం కంటే స్నేహితులు లేదా భాగస్వామితో కలిసి వ్యాయామం చేయడం ప్రజలకు మరింత మెరుగ్గా అనిపించింది. తోడుగా ఎవరైనా ఉంటే జిమ్‌కి వెళ్లడం లేదా వర్కవుట్ చేయడం సులభంగా అనిపిస్తుంది.
- Author : Gopichand
Date : 15-12-2025 - 5:30 IST
Published By : Hashtagu Telugu Desk
- ఈ ఏడాది ప్రజలు అనుసరించిన ఫిట్‌నెస్ సూత్రాలివే
- ఏ ఫిట్‌నెస్ ట్రెండ్స్ ఎక్కువ ఉపయోగించారో తెలుసా?
Fitness Trends: ఫిట్‌గా ఉండాలని ఎవరు మాత్రం కోరుకోరు? అయితే ఫిట్‌గా ఉండేందుకు ప్రజలు ఎంచుకునే విధానాలు వేరువేరుగా ఉంటాయి. కొందరు జిమ్ మెంబర్‌షిప్ తీసుకుని ఫిట్ అవుతారు. మరికొందరు యోగా చేయడాన్ని ఇష్టపడతారు. ఇంకొంతమంది తమ ఆహారపు అలవాట్లను మార్చుకుని ఫిట్‌గా ఉండేందుకు ప్రయత్నిస్తారు. ఈ నేపథ్యంలో 2025 సంవత్సరంలో ప్రజలు ఫిట్‌గా ఉండేందుకు ఏమేం చేశారు? ఏ ఫిట్‌నెస్ ట్రెండ్స్ ఈ ఏడాది బాగా వైరల్ అయ్యాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం!
2025 సంవత్సరపు ఫిట్‌నెస్ ట్రెండ్స్
మొబైల్ ఫిట్‌నెస్ యాప్స్
ఈ సంవత్సరంలో ప్రజలు తమ ఫిట్‌నెస్‌ను ట్రాక్ చేయడానికి ట్రాకింగ్ యాప్స్‌ను విస్తృతంగా ఉపయోగించారు. ధరించే పరికరాలు, ఆటోమేటెడ్ అలర్ట్‌లు ఇచ్చే ఫిట్‌నెస్ ట్రాకర్స్, స్మార్ట్ వాచ్‌లు, హార్ట్ రేట్ మానిటర్ల వంటి పరికరాలు ఈ సంవత్సరం బాగా చర్చలో నిలిచాయి. పర్సనల్ ట్రైనర్‌ను నియమించుకోవడం కంటే ప్రజలు ఈ సంవత్సరం తమ ఫిట్‌నెస్‌ను సొంతంగా ట్రాక్ చేసుకున్నారు.
మినిమల్ ఈటింగ్ రూటీన్
ఈ సంవత్సరంలో ప్రజలు సమతుల్య ఆహారం ప్రాముఖ్యతను అర్థం చేసుకున్నారు. దీనికి సోషల్ మీడియా ప్రభావం కూడా చాలావరకు ఉందని చెప్పవచ్చు. రోజూ ప్రోటీన్ అధికంగా ఉండే హెల్తీ స్నాక్స్ రీల్స్ చూసి చూసి, ప్రజలు ఈ ఆరోగ్యకరమైన ఆహారాలను తినడం ప్రారంభించి, తమ డైట్‌లో మంచి మార్పులు చేసుకున్నారు.
Also Read: రూ. 25,000 జీతంలో డబ్బు ఆదా చేయడం ఎలా?
ఔట్‌డోర్ ఫిట్‌నెస్ యాక్టివిటీస్
2025లో ప్రజలు తమ ఫిట్‌నెస్‌ను సీరియస్‌గా తీసుకుని ఔట్‌డోర్ యాక్టివిటీస్‌పైనా దృష్టి పెట్టారు. ముఖ్యంగా ఔట్‌డోర్ యోగా చేయడం ద్వారా ప్రజలు తమను తాము ఫిట్‌గా ఉంచుకున్నారు. వీటితో పాటు, బయట వాకింగ్ చేయడం, పరుగెత్తడం, హైకింగ్, స్కీయింగ్ వంటి యాక్టివిటీస్ కూడా ప్రజల ఫిట్‌నెస్ రొటీన్‌లో భాగమయ్యాయి.
గ్రూప్ ట్రైనింగ్
గ్రూప్ ట్రైనింగ్ 2025లో వైరల్ అయింది. ఇంట్లో ఒంటరిగా వ్యాయామం చేయడం కంటే స్నేహితులు లేదా భాగస్వామితో కలిసి వ్యాయామం చేయడం ప్రజలకు మరింత మెరుగ్గా అనిపించింది. తోడుగా ఎవరైనా ఉంటే జిమ్‌కి వెళ్లడం లేదా వర్కవుట్ చేయడం సులభంగా అనిపిస్తుంది.
మార్నింగ్ వర్కవుట్
సాయంత్రం సమయాన్ని బయట తిరగడానికి కేటాయించడం కోసం ప్రజలు తమ ఉదయం రొటీన్‌లో వ్యాయామాన్ని చేర్చుకున్నారు. కేవలం వ్యాయామం మాత్రమే కాకుండా యోగా లేదా వాక్ చేయడానికి కూడా ఉదయం సమయం సరైనదిగా నిలిచింది.