Dry Fruits: డయాబెటిస్ ఉన్నవారు డ్రై ఫ్రూట్స్ తినకూడదా.. తింటే ఏం జరుగుతుందో మీకు తెలుసా?
షుగర్ వ్యాధి గ్రస్తులు డ్రై ఫ్రూట్స్ తిన్నావచ్చా, తినకూడదా, ఒకవేళ తింటే ఏం జరుగుతుందో, ఈ విషయం గురించి ఆరోగ్య నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
- By Anshu Published Date - 06:00 PM, Sun - 4 May 25

డ్రై ఫ్రూట్స్ ఆరోగ్యానికి మంచివి అన్న విషయం మనందరికీ తెలిసిందే. వీటిని తరచుగా తీసుకోవడం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలను పొందవచ్చు. డ్రై ఫ్రూట్స్ ని కొన్ని నేరుగా తింటే మరికొన్నింటిని నీటిలో నానబెట్టి తినాలని చెబుతున్నారు. అయితే డ్రై ఫ్రూట్స్ ఆరోగ్యానికి మంచిది అన్నప్పటికీ కొన్ని రకాల డ్రై ఫ్రూట్స్ ని డయాబెటిస్ ఉన్నవారు అసలు తినకూడదు అని చెబుతున్నారు. మరి డయాబెటిస్ ఉన్నవారు ఎలాంటి డ్రైఫ్రూట్స్ ని తినకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
డయాబెటిక్ పేషెంట్లు ఆరోగ్యంగా ఉండాలంటే మాత్రం కొన్ని రకాల డ్రై ఫ్రూట్స్ ను తినకపోవడమే మంచిదట. రక్తంలో చక్కెర స్థాయిలను చాలా ఫాస్ట్ గా పెంచుతాయట. అంతేకాదు డ్రై ఫ్రూట్స్ లో కార్బోహైడ్రేట్ల పరిమాణం కూడా ఎక్కువగా ఉంటుందట. డయాబెటీస్ ఉన్నవారు మర్చిపోయి కూడా ఎండుద్రాక్షను అసలు తినకూడదట. ఎండుద్రాక్షలో చాలా పోషకాలు ఉంటాయట. కానీ వీటిలో సహజ చక్కెరలు ఎక్కువ మొత్తంలో ఉంటాయట. వీటిని తింటే రక్తంలో చక్కెర స్థాయిలు వేగంగా పెరుగుతాయట. అందుకే డయాబెటీస్ పేషెంట్లు ఎండు ద్రాక్షలకు దూరంగా ఉండటం మంచిదని చెబుతున్నారు.
చాలా మంది డయాబెటీస్ పేషెంట్లు సహజ చక్కెరల కోసం ఖర్జూరాలను ఎక్కువగా తింటుంటారు. ఖర్జూరాల్లో సహజ చక్కెరలు ఎక్కువ మొత్తంలో ఉంటాయట. వీటిని తింటే మీ రక్తంలో గ్లూకోజ్ స్థాయి అకస్మత్తుగా పెరుగుతుందట. అందుకే బ్లడ్ షుగర్ లెవెల్స్ ఎక్కువగా డయాబెటీస్ పేషెంట్లు ఖర్జూరాలకు దూరంగా ఉండాలని చెబుతున్నారు. అంజీర పండ్లలో నేచురల్ షుగర్ ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను చాలా తొందరగా పెంచుతాయట. అందుకే డయాబెటిస్ ఉన్నవారు అంజీర పండ్లను తినకూడదని చెబుతున్నారు. డ్రై క్రాన్బెర్రీలు ఆడవాళ్లకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయట. అలాగే ఈ పండ్లు మూత్రానికి సంబంధించిన ఎన్నో సమస్యలను పరిష్కరించడానికి బాగా సహాయపడతాయని, కానీ ఈ పండ్లను ఎక్కువగా తింటే మాత్రం రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయట.