HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Health
  • >Why Should Small Children Be Kept Away From Colorful Clothes

పిల్లలకు రంగురంగుల బట్టలు ఎందుకు వేయకూడదు?

ప్రస్తుతం 'ఫాస్ట్ ఫ్యాషన్' ట్రెండ్‌లో భాగంగా తక్కువ ధరకే ఆకర్షణీయమైన బట్టలు మార్కెట్లోకి వస్తున్నాయి. అయితే వాటి నాణ్యతపై ఎప్పుడూ ప్రశ్నలు తలెత్తుతూనే ఉన్నాయి.

  • Author : Gopi Date : 26-04-2026 - 11:58 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Child Health Safety
Child Health Safety

Child Health Safety: మీ పిల్లల ఇష్టమే వారి ప్రాణాలకు ముప్పుగా మారుతుందా? పిల్లలకు ఎంతో ఇష్టమైన రంగురంగుల బట్టలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ఇటీవల వచ్చిన ఒక పరిశోధనలోని విషయాలు తెలిస్తే ప్రతి తల్లిదండ్రులు ఆందోళన చెందడం ఖాయం. కొత్త పరిశోధనల ప్రకారం.. కొన్ని రంగురంగుల బట్టలలో హానికరమైన రసాయనాలు ఉన్నట్లు తేలింది. ఇవి ముఖ్యంగా 6 ఏళ్లలోపు పిల్లలకు ఎంతో ప్రమాదకరం. పిల్లలకు బట్టలు కొనేటప్పుడు తల్లిదండ్రులు మరింత అప్రమత్తంగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

పరిశోధనలో తేలిన దిగ్భ్రాంతికర నిజాలు

రీసెంట్ రిపోర్ట్స్, అమెరికన్ కెమికల్ సొసైటీ సమావేశంలో సమర్పించిన ఒక అధ్యయనం పిల్లల బట్టల గురించి షాకింగ్ విషయాలను వెల్లడించింది. మార్కెట్లో లభించే అనేక రంగురంగుల దుస్తులను పరిశోధకులు పరీక్షించగా.. వాటిలో నిర్ణీత భద్రతా పరిమితుల కంటే ఎక్కువ స్థాయిలో హానికరమైన మూలకాలు ఉన్నట్లు గుర్తించారు. చిన్నపిల్లల చర్మం చాలా సున్నితంగా ఉండటం వల్ల ఇది తీవ్ర ఆందోళన కలిగించే అంశం.

ఎవరు ఈ పరిశోధన చేశారు? ఏం చెప్పారు?

మారియన్ యూనివర్సిటీ కెమిస్ట్రీ విభాగ పరిశోధకురాలు కామిలా డెవర్స్ నేతృత్వంలో ఈ అధ్యయనం జరిగింది. ఆమె బృందం వివిధ రిటైల్ స్టోర్ల నుండి బట్టలు కొనుగోలు చేసి వాటిని విశ్లేషించింది. ముఖ్యంగా ప్రకాశవంతమైన రంగులు ఉన్న బట్టలలో పిల్లల ఆరోగ్యానికి హాని కలిగించే స్థాయి కంటే ఎక్కువ కెమికల్స్ ఉన్నట్లు కనుగొన్నారు.

Also Read: దేశంలో నేడు బంగారం ధ‌ర‌లు ఎలా ఉన్నాయంటే?

చిన్న పిల్లలకే ఎందుకు ఎక్కువ రిస్క్?

నిపుణుల అభిప్రాయం ప్రకారం.. 6 ఏళ్లలోపు పిల్లలు అత్యంత సున్నితంగా ఉంటారు. ఈ వయస్సులో పిల్లలు తరచుగా తమ బట్టలను నోటిలో పెట్టుకుంటారు లేదా అవి ఎక్కువ సమయం వారి చర్మంతో నేరుగా సంబంధం కలిగి ఉంటాయి. బట్టల రంగుల కోసం వాడే హానికరమైన రసాయనాలు చర్మం ద్వారా లేదా నోటి ద్వారా వారి శరీరంలోకి చేరే ప్రమాదం ఉంది. అందుకే ఈ విషయంలో జాగ్రత్త వహించాలని సూచిస్తున్నారు.

తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం

ఇది కేవలం ఒక పరిశోధనా నివేదిక మాత్రమే కాదు, మన దైనందిన జీవితానికి సంబంధించిన సమస్య. చాలా మంది తల్లిదండ్రులు పిల్లల కోసం ఆకర్షణీయమైన, మెరిసే రంగుల బట్టలను ఎంచుకుంటారు. కానీ ఆ రంగుల తయారీలో వాడిన పదార్థాల గురించి ఆలోచించరు. బట్టలు ఎంచుకునేటప్పుడు కేవలం డిజైన్ లేదా రంగు మాత్రమే కాకుండా వాటి నాణ్యత, భద్రతను కూడా చూడటం ఎంతో ముఖ్యం.

ఫాస్ట్ ఫ్యాషన్- మారుతున్న ధోరణి

ప్రస్తుతం ‘ఫాస్ట్ ఫ్యాషన్’ ట్రెండ్‌లో భాగంగా తక్కువ ధరకే ఆకర్షణీయమైన బట్టలు మార్కెట్లోకి వస్తున్నాయి. అయితే వాటి నాణ్యతపై ఎప్పుడూ ప్రశ్నలు తలెత్తుతూనే ఉన్నాయి. పిల్లల దుస్తుల ఎంపిక ఇప్పుడు కేవలం స్టైల్‌కు సంబంధించింది మాత్రమే కాదు, అది ఒక బాధ్యతగా మారుతోంది. రంగురంగుల బట్టలు పిల్లలకు సంతోషాన్ని ఇస్తాయి. కానీ వారి భద్రత అంతకంటే ముఖ్యం. పిల్లల ఇష్టంతో పాటు వారి ఆరోగ్యాన్ని కూడా సమానంగా చూడాల్సిన సమయం ఆసన్నమైందని ఈ పరిశోధన స్పష్టం చేస్తోంది. పిల్లలకు బట్టలు కొనేటప్పుడు సహజ రంగులు ఉన్న లేదా ఆర్గానిక్ బట్టలను ఎంచుకోవడం ఉత్తమం.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Chemical Exposure Risk
  • Child Health Safety
  • Childrens Clothing
  • lifestyle
  • Parental Safety Guide
  • Toxic Fabric Dyes

Related News

Water

ఉదయం పరగడుపున నీళ్లు తాగితే అద్భుతాలే!!

చర్మం తగినంత హైడ్రేటెడ్ గా ఉండటం వల్ల ముఖంపై సహజమైన మెరుపు రావడమే కాకుండా చర్మ కణాలు త్వరగా రిపేర్ అవుతాయి. బరువు తగ్గాలనుకునే వారికి కూడా ఇది ఒక చక్కని మార్గం.

  • Dehydration

    ఎంత నీరు తాగినా ఇంకా దాహమేస్తోందా?

  • Jeans

    జీన్స్ ప్యాంట్‌తోనే ప‌డుకుంటున్నారా?

Latest News

  • కార్తీతో బోయపాటి శ్రీను క్రేజీ ప్రాజెక్ట్?

  • ఐపీఎల్ 2026.. నేడైనా ధోనీ మైదానంలోకి దిగుతాడా?

  • అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు విఫలం.. యుద్ధం త‌ప్ప‌దా?

  • ఫాస్టాగ్ వాడుతున్నారా? అయితే ఈ వార్నింగ్ మీకోస‌మే!

  • కొత్త సిలిండర్ బుకింగ్ రూల్స్.. మే 1 నుండి మారనున్న నిబంధనలు?

Trending News

    • వైభవ్‌ సూర్యవంశీ ఖాతాలో రికార్డులే రికార్డులు!

    • ఐపీఎల్ 2026.. ఒకే రోజు 986 ప‌రుగులు!!

    • దాడి త‌ర్వాత మాట్లాడిన ట్రంప్‌.. ఇరాన్‌పై అనుమానాలు?

    • ఇరాన్ సుప్రీం లీడర్ మోజ్తబా ఖమేనీ పరిస్థితి విషమం!

    • ఫిఫా వరల్డ్ కప్ 2026.. ఇరాన్ స్థానంలో ఇటలీ?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd