HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Health
  • >Who Should Not Consume Banana

Banana: ఆ సమస్యలు ఉన్నవారు అరటి పండ్లు తినకూడదా.. నిపుణులు ఏం చెబుతున్నారంటే!

అరటిపండు తినడం మంచిదే కానీ కొన్ని సమస్యలు ఉన్నవారు ఆ పండును తినకపోవడమే మంచిదని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.

  • Author : Anshu Date : 08-01-2025 - 3:45 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Banana Benefits
Banana Benefits

అరటిపండు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది అన్న విషయం మనందరికీ తెలిసిందే. తరచుగా తీసుకోవడం వల్ల అనేక రకాల ప్రయోజనాలను పొందవచ్చు. చిన్న పెద్ద అని తేడా లేకుండా ప్రతి ఒక్కరు అరటిపండును ఇష్టపడి తింటూ ఉంటారు. చాలా రకాల స్వీట్లు తయారీలో అలాగే జ్యూసులు తయారీలో కూడా అరటి పండ్లను ఉపయోగిస్తూ ఉంటారు. అరటి పండులో పోషకాలు మెండుగా ఉంటాయి. ఇందులో ఎక్కువగా పొటాషియం ఉంటుంది. ఇది అనేక రకాల దీర్ఘకాలిక వ్యాధుల నుంచి శరీరాన్ని రక్షిస్తుంది. అలాగే అరటిలో సహజ చక్కెర అధికంగా ఉంటుంది. రోజు తినడం వల్ల శరీరానికి తక్షణ శక్తి లభిస్తుంది. అరటి పండు ఎనర్జీ బూస్టర్‌లా పనిచేస్తుంది.

అంతేకాకుండా వ్యాయామాలు, జిమ్ చేసేవారు అరటిపండును తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందుతాయి. అరటిపండు అనేది పొటాషియం, మెగ్నీషియం, విటమిన్ బి6, ఫాస్పరస్ వంటి విటమిన్లు, ఖనిజాల గని. జీర్ణశక్తిని బలోపేతం చేయడం, బరువు తగ్గడం, బరువు పెరగడం, బలమైన ఎముకలు, శక్తి స్థాయిలను పెంచడం, గుండెను ఆరోగ్యంగా ఉంచడం, రక్తంలో చక్కెరను నియంత్రించడం వంటి అనేక ప్రయోజనాలను అరటిపండు అందిస్తుంది. అయితే అరటిపండు ఆరోగ్యానికి మంచిదే అయినప్పటికీ కొన్ని రకాల సమస్యలు ఉన్నవారు తినకపోవడమే మంచిది అని చెబుతున్నారు.

మరి ఎలాంటి సమస్యలు ఉన్నవారు అరటిపండు తినకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. కిడ్నీ సమస్యలు, మూత్రపిండ వ్యాధులతో బాధపడేవారు అరటి పండును ఎక్కువగా తినకూడదట. ఎందుకంటే ఇందులో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. ఎక్కువగా తినడం వల్ల పొటాషియం ను విసర్జించడం మూత్ర పిండాలకు కష్టంగా ఉంటుందట. డయాబెటిస్ సమస్యలు ఉన్నవారు కూడా అరటి పండును ఎక్కువగా తినకూడదట. అరటి పండు చక్కెర శాతం ఎక్కువగా ఉంటుంది. షుగర్ రోగులు తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి పెరిగే ప్రమాదముందట. దీంతో కొంత సేపు ఎనర్జీగా అనిపించినా ఆ తర్వాత నీరసంగా అయిపోతారట.
అలాగే మలబద్ధకం, గ్యాస్ సమస్యలు ఉన్నవారు అరటి పండును ఎక్కువగా తినకూడదట. మితంగా మాత్రమే తినాలని చెబుతున్నారు. ఎక్కువగా తింటే మలబద్ధక సమస్యలు మరింత తీవ్రమయ్యే ప్రమాదం ఉందట. అంతేకాకుండా ఎక్కువ తినడం కడుపు నొప్పి, గ్యాస్ సమస్యలు, ఉబ్బరం వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. అందుకే ఈ సమస్యలతో బాధపడేవారు అరటి పండును ఎక్కువగా తినకూడదని నిపుణులు చెబుతున్నారు. అలర్జీ, శ్వాసకోస సమస్యలు, అస్తమాతో బాధపడే వారు అరటి పండుకు దూరంగా ఉంటేనే మంచిదట. అరటి పండు తింటే వీరిలో అలర్జీ రియాక్షన్స్ మొదలయ్యే ప్రమాదం ఉందట. చర్మంపై ఎరుపు, దురద, మంట, వాపు వచ్చే ప్రమాదముందని చెబుతున్నారు నిపుణులు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • banana
  • eat banana
  • eating Banana
  • health tips

Related News

Are you gaining weight due to thyroid issues? Then do this immediately—you won't gain any weight at all!

Thyroid: థైరాయిడ్ వల్ల బరువు పెరుగుతున్నారా? అయితే వెంటనే ఇలా చేయండి.. అస్సలు బరువు పెరగరు!

ప్రస్తుత రోజుల్లో చాలామంది ఇబ్బంది పడుతున్న సమస్యలలో థైరాయిడ్ సమస్య కూడా ఒకటి. ప్రతి పదిమందిలో నలుగురు ఈ థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్న విషయం తెలిసిందే. థైరాయిడ్ సమస్యతో బాధపడే వారిలో ముఖ్యంగా కనిపించే ప్రధాన లక్షణం అధిక బరువు. థైరాయిడ్ సమస్యతో బాధపడే వాళ్ళు చాలామంది అధిక బరువు సమస్యతో కూడా బాధపడుతూ ఉంటారు. ఈ థైరాయిడ్ సమస్య కారణంగా విపరీతంగా బరువు పెరగడం వల్ల ఇతర అనార

  • A juice that boosts sexual desire... Drinking this juice will improve your sex life.

    Romantic Life: శృంగార వాంఛలను పెంచే జ్యూస్.. ఈ జ్యూస్ తాగితే మీ శృంగార జీవితం మెరుగుపడుతుంది..

Latest News

  • NTR Trivikram: ఎన్టీఆర్‌-త్రివిక్రమ్‌ మూవీ.. ఫ్యాన్స్‌కు పండగ.. పోస్టర్ అదిరిందిగా

  • DSP Transfers: తెలంగాణలో భారీగా డీఎస్పీల బదిలీలు

  • Alcohol: మీకు ఆల్కహాల్ తాగే అలవాటు ఉందా..? అయితే వీటి వినియోగంలో జాగ్రత్త…!!

  • Ashok Gajapathi Raju: నా స్థలాన్ని ప్రభుత్వ భూమిగా మార్చారు: అశోక్ గజపతిరాజు

  • Hero MotoCorp : హీరో మోటోకార్ప్ సరికొత్త ప్రయోగం.. మార్కెట్లోకి ‘ప్యాషన్+ డిస్క్’ లాంచ్!

Trending News

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd