Ice Apples: మీరు కూడా అలాంటి సమస్యలతో బాధపడుతున్నారా.. అయితే తాటి ముంజలు అస్సలు తినకండి!
తాటి ముంజలు ఆరోగ్యానికి మంచివే కానీ కొన్ని రకాల సమస్యలు ఉన్నవారు వాటిని తినకపోవడమే మంచిది అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. మరి ఎలాంటి సమస్యలు ఉన్న వారు తాటి ముంజలు తినకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
- Author : Anshu
Date : 19-05-2025 - 11:00 IST
Published By : Hashtagu Telugu Desk
తాటి ముంజల వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. తాటి ముంజలు కేవలం వేసవి కాలంలో మాత్రమే లభిస్తూ ఉంటాయి. వేసవిలో వచ్చే చాలా రకాల సమస్యలకు ఇవి చాలా చక్కగా పనిచేస్తాయి. వీటి రుచి చాలా అద్భుతంగా ఉంటుంది అని చెప్పాలి. వీటని వేసవిలో తినడం వల్ల డీహైడ్రేషన్ బారి నుంచి తప్పించుకోవచ్చట. ఇకపోతే తాటి ముంజల్లో విటమిన్ బి, విటమిన్ సి, ఐరన్, కాల్షియం, జింక్, పొటాషియం ఉంటాయి. ఆ సంగతి పక్కన పెడితే కొన్ని రకాల సమస్యలతో బాధపడేవారు తాటి ముంజలను తినక పోవడమే మంచిది అని చెబుతున్నారు. ఇంతకీ ఎవరు తినకూడదో ఇప్పుడు తెలుసుకుందాం..
డయాబెటిస్‌తో బాధపడేవారు తాటి ముంజల్ని మితంగా తీసుకోవాలట. ఎందుకంటే తాటి ముంజల్లో సహజంగానే చక్కెర ఎక్కువగా ఉంటుంది. వీటిని ఎక్కువగా తినడం వల్ల రక్తంలో షుగర్ లెవల్స్ అదుపు తప్పే ప్రమాదం ఉంటుందట. అందుకే వీటిని ఎక్కువగా తినకూడదని, ఒకవేళ తినాలనుకుంటే వైద్యుల సలహా తీసుకోవడం మంచిదని చెబుతున్నారు. అలాగే ఈ రోజుల్లో చాలా మంది కడుపు ఉబ్బరం, గ్యాస్, కడుపు నొప్పి, అజీర్తి వంటి సమస్యలతో బాధపడుతున్నారు. అలాంటి వారు వీటికి దూరంగా ఉండటమే మంచిదట. ఎందుకంటే తాటి ముంజలను ఎక్కువగా తినడం వల్ల కడుపు నొప్పి, ఉబ్బరం వచ్చే ప్రమాదం ఉంటుందట. లేత ముంజలు తినడం వల్ల అంతగా ఇబ్బంది ఉండకపోవచ్చని, కానీ గడ్డు ముంజలు తింటే ఇలాంటి వారి సమస్యలు మరింత ఎక్కువయ్యే ప్రమాదం ఉంది అని చెబుతున్నారు.
గర్భిణీ స్త్రీలు అలాగే పాలిచ్చే తల్లులు తాటి ముంజల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలట. వీటిని తినడం వల్ల అలర్జీలు వచ్చే ప్రమాదం ఉందని, తాటి ముంజల్లో ఉండే ఇథనాల్ లిపిడ్ గర్బిణీ స్త్రీలకు అంత మంచిది కాదట. పాలిచ్చే తల్లులు తాటి ముంజలు తినడం వల్ల శిశువులకు కడుపు నొప్పి వచ్చే ప్రమాదం ఉందట. అందుకే ఇలాంటి వారు వీటిని తినే ముందు వైద్యుణ్ని సంప్రదించి తగిన సలహా తీసుకోవడం మంచిది అని చెబుతున్నారు. ఫ్యాటీ లివర్, కాలేయ సమస్యలతో బాధపడేవారు తాటి ముంజలకు దూరంగా ఉండటమే మంచిదట. తాటి ముంజల్లో ఇథనాల్ లిపిడ్ జీవక్రియకు అంతరాయం కలిగిస్తుందట. ఇది కాలేయంలో కొవ్వు పేరుకుపోవడానికి దారితీస్తుందట. కాబట్టి ఫ్యాటీ లివర్ సమస్యతో బాధపడేవారు తాటి ముంజలకు దూరంగా ఉండటమే మంచిది అని చెబుతున్నారు.