Egg: మీరు కూడా గుడ్డు తినేటప్పుడు ఇలాంటి పొరపాట్లు చేస్తున్నారా.. అయితే జాగ్రత్త!
గుడ్డు తినడం ఆరోగ్యానికి మంచిదే కానీ గుడ్డు తినేటప్పుడు పొరపాటున కూడా కొన్ని రకాల తప్పులు అస్సలు చేయకూడదు అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.
- By Anshu Published Date - 08:30 AM, Mon - 17 February 25

గుడ్డు ఆరోగ్యానికి చాలా మంచిది. ప్రతిరోజు ఒక కోడిగుడ్డు తీసుకోవడం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టడంతో పాటు ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలను కూడా పొందవచ్చు. గుడ్డులో ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. గుడ్డు తినడం మంచిదే కానీ గుడ్డు తినేటప్పుడు పొరపాటున కూడా కొన్ని తప్పులు అస్సలు చేయకూడదు అని చెబుతున్నారు. మరి గుడ్డు తింటే ఎలాంటి సమస్యలు వస్తాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. గుడ్డు తినేటప్పుడు చాలా మంది పచ్చ సొన తినరు. దానిని పడేస్తారు. కేవలం తెల్ల సొన మాత్రమే తింటారు. ఇదే మీరు చేసే అతి పెద్ద తప్పు. విటమిన్లు, మినరల్స్, లిపిడ్లు గుడ్డులోని పచ్చసొనలో ఉంటాయి.
అయితే గుడ్డు లోని తెల్ల సొనలో దాదాపు 87శాతం నీరు, 10శాతం ప్రోటీన్లు ఉంటాయి. మీరు పచ్చసొనను పక్కన పెట్టి గుడ్డులోని తెల్లసొనను మాత్రమే తింటే పోషక విలువలు గణనీయంగా మారతాయట. గుడ్లలోని ప్రోటీన్లు వివిధ భాగాలలో చాలా సమానంగా పంపిణీ చేయబడతాయట. అయితే గుడ్డులోని తెల్లసొనలో ప్రొటీన్లు ఎక్కువగా ఉంటాయి. కేలరీలు తక్కువగా ఉంటాయి. రెండు తినడం వల్ల శరీరానికి మేలు జరుగుతుందని చెబుతున్నారు. ఇకపోతే గుడ్డులో తెల్ల సొన తినడం వల్ల కలిగే ప్రయోజనాల విషయానికి వస్తే.. గుండె సంబంధిత వ్యాధులు ఉన్నవారికి గుడ్డులోని తెల్లసొన ఎంతో మేలు చేస్తుందట. ఈ భాగం అధిక మోతాదులో శరీరానికి ప్రోటీన్ అందిస్తుందట. కానీ కొలెస్ట్రాల్ పెరగదని చెబుతున్నారు. గుడ్డు తెల్ల సొనలో అనేక రకాల అమైనో ఆమ్లాలను కలిగి ఉంటుందట. ఇది కండరాల పనితీరు మెరుగుపరుస్తుందట.
కండరాల్ని బలంగా మార్చడంలో గుడ్డు తెల్ల సొన ఉపయోగపడుతుందని చెబుతున్నారు. గుడ్డు పచ్చసొనలో కెరోటినాయిడ్స్, లుటిన్, జియాక్సంతిన్ ఉంటాయి. ఇవి కండరాల్ని నిర్మించడంలో , శరీరంలో బయోటిన్ వంటి సమ్మేళనాలను ప్రోత్సహించడంలో సమర్థవంతంగా ఉపయోగపడుతుందట. బరువు తక్కువ ఉన్నవారికి గుడ్డు పచ్చ సొన చాలా మేలు చేస్తుందని చెబుతున్నారు. అంతేకాకుండా చర్మ సంరక్షణ, జుట్టుకు బలాన్ని ఇస్తుంది. గుడ్డు లోని పచ్చసొన శరీరంలో ప్రొటీన్ లోపం వల్ల కలిగే సమస్యలను దూరం చేస్తుందట. గుడ్డు పచ్చసొన లేదా గుడ్డులోని తెల్లసొన రెండు కూడా శరీరానికి మేలు చేస్తారు. అయితే చాలా మంది గుడ్డు పచ్చసొన ఆరోగ్యానికి హాని చేస్తుందని భావిస్తారు. దీంతో దానిని తినడానికి ఇష్టపడరు. గుడ్డు పచ్చసొన కొలెస్ట్రాల్ ను పెంచుతుందని వారి నమ్మకం. చాలా మంది గుడ్డు పచ్చసొన తినకపోవడానికి ఇదే కారణం.