Egg: ఉడికించిన గుడ్డు, ఆమ్లెట్.. ఈ రెండింటిలో ఆరోగ్యానికి ఏది మంచిదో తెలుసా?
కోడి గుడ్డు వల్ల అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.
- By Anshu Published Date - 05:30 PM, Tue - 13 August 24

కోడిగుడ్డు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది అన్న విషయం మనందరికీ తెలిసిందే. అందుకే వైద్యులు కూడా తరచూ ఒక కోడి గుడ్డిని తినాలని చెబుతూ ఉంటారు. కోడిగుడ్డు చేసే మేలు అంతా ఇంతా కాదు. అందుకే చిన్నపిల్లల నుంచి పెద్దవారు వరకు ప్రతి ఒక్కరు దీనిని ఎటువంటి భయం లేకుండా తినవచ్చు. కోడిగుడ్డు కండరాల మరమ్మతుకు కండరాల పెరుగుదలకు కూడా ఉపయోగపడుతుంది. కోడిగుడ్డులో ఎన్నో రకాల విటమిన్లు పోషకాలు ఖనిజాలు లభిస్తాయి. అయితే అలాంటి కోడిగుడ్డును కొందరు ఆమ్లెట్ రూపంలో తీసుకుంటే మరికొందరు ఉడకబెట్టి తింటూ ఉంటారు.
ఇంకొందరు కూరల రూపంలో కూడా తీసుకుంటూ ఉంటారు. మరి కోడి గుడ్డుని ఉడకపెట్టి తినడం మంచిదా లేక ఆమ్లెట్ రూపంలో తీసుకుంటే మంచిదా అన్న విషయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఉడకబెట్టిన గుడ్లలో ఆమ్లెట్ల కంటే చాలా తక్కువ కేలరీలు ఉంటాయి. అందుకే ఇవి బరువు తగ్గడానికి బాగా సహాయపడతాయి. గుడ్లను ఉడకబెట్టడం చాలా సులువు. అలాగే ఇందుకోసం మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరం కూడా ఉండదు. దీంతో మీరు గుడ్ల పోషకాలను పొందుతారు. ఉడకబెట్టిన గుడ్లలో ఆమ్లెట్ కంటే తక్కువ కొవ్వు ఉంటుంది. ఎందుకంటే దీని కోసం మీరు నూనెను ఉపయోగించరు.
అలాగే ఆమ్లెట్ లో రకరకాల కూరగాయలు, మసాలా దినుసులను వేయొచ్చు. దీంతో ఆమ్లెట్ టేస్ట్ బాగుంటుంది. ఆమ్లెట్ లో కూరగాయలు, ఇతర పదార్థాలను కలపడం వల్ల ఆమ్లెట్ లో ఫైబర్ కంటెంట్ పెరుగుతుంది. దీంతో మీకు ఎక్కువ సేపు ఆకలి వేయదు. ఆమ్లెట్ ను తయారు చేసేటప్పుడు అవొకాడో, ఆలివ్ ఆయిల్ లేదా నట్స్ మొదలైనవి చేర్చుకుంటే మీకు ఆరోగ్యకరమైన కొవ్వులు అందుతాయి. ఇవి మీ గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆమ్లెట్, ఉడకబెట్టిన గుడ్లు రెండూ ఆరోగ్యానికి చాలా మంచివి. కానీ మీరు తక్కువ కేలరీలు ఉన్నదే తినాలంటే మాత్రం ఉడికించిన గుడ్లే బెస్ట్. అలాగే కేలరీలు ఎక్కువగా ఉన్నా పర్లేదు అనుకుంటే ఆమ్లెట్ ను తినవచ్చు. ఇవి రెండూ ఎలా తీసుకున్నా కూడా ఆరోగ్యానికి మంచిదే అని చెబుతున్నారు వైద్యులు.
note: ఈ ఆరోగ్య సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే.