Tomatoes: టమాటాలు ప్రతిరోజు తినవచ్చా తినకూడదా.. ఆరోగ్య నిపుణులు ఏమంటున్నారంటే!
టమాటాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి అన్న విషయం తెలిసిందే. ప్రతిరోజు తినవచ్చా తినకూడదా? ఒకవేళ తింటే ఏమవుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
- By Anshu Published Date - 12:00 PM, Sat - 17 May 25

భారతీయుల ఇళ్లలో ఉండే కూరగాయలలో టమాటా కూడా ఒకటి. టమాటా ఉపయోగించి ఎన్నో రకాల వంటలు తయారు చేస్తూ ఉంటారు. ప్రత్యేకించి కొన్ని రకాల కూరలు కూడా టమోటాలతో చేస్తూ ఉంటారు. అయితే టమోటాలను తరచుగా తీసుకోవడం వల్ల అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయని చెబుతున్నారు. మన ఆరోగ్యానికి కూడా మంచి మేలు చేస్తాయట. కాగా టమాటాల్లో విటమిన్ సి, విటమిన్ కె, ఫోలెట్, పొటాషియం,యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. టమాటాను తింటే మన ఆరోగ్యం బేషుగ్గా ఉంటుందట. అలాగే శరీరంలోని విష పదార్థాలు బయటకుపోతాయని చెబుతున్నారు.
కాగా టమాటాలు, కీళ్ల నొప్పులకు మధ్య సంబంధం ఉందట. టమాటా బంగాళదుంప వంటి కూరగాయల్లో సోలనిన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది ఆర్థరైటిస్, కీళ్లు, మోకాళ్ల నొప్పులను బాగా పెంచుతుందని చెబుతున్నారు. మీకు ఇప్పటికే ఆస్టియో ఆర్థరైటిస్ లేదా రుమటాయిడ్ ఆర్థరైటిస్ వంటి సమస్యలతో బాధపడుతున్నట్లయితే టమాటాలకు దూరంగా ఉండటం మంచిదని చెబుతున్నారు. ఒకవేళ మీరు టమాటాలను అతిగా తింటే ఆర్థరైటిస్ లేదా కీళ్ల నొప్పులు పెరిగే అవకాశం ఉందని. చాలా మందికి టమాటాలను తింటే కీళ్ల నొప్పులు ఎక్కువ ఏం కావు. ఎందుకంటే వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు ముఖ్యంగా లైకోపీన్ లు పుష్కలంగా ఉంటాయట. ఇవి శరీర మంటను తగ్గించడానికి సహాయపడతాయని చెబుతున్నారు.
టమాటాలను తింటే మీకు కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు లేదా ఏదైనా సమస్య వస్తే మాత్రం వీటిని తగ్గించడం మంచిదని చెబుతున్నారు. టమోటాలు ఎక్కువగా తింటే కొన్ని రకాల సమస్యలు వస్తాయట. టమాటాలు కిడ్నీ స్టోన్స్ తో బాధపడుతున్న వారు తినకపోవడమే మంచిది. ఎందుకంటే దీనిలో ఆక్సలేట్ చాలా ఎక్కువ మొత్తంలో ఉంటుందట. అందుకే వీటిని ఎక్కువగా తింటే మన శరీరంలో ఆక్సలేట్ పేరుకుపోతుందని, దీనివల్ల మీకు కిడ్నీ స్టోన్స్ వచ్చే ప్రమాదం ఉంది. ముఖ్యంగా ఇప్పటికే కిడ్నీ స్టోన్స్ ఉన్నవారు టమాటాలను తినకపోవడమే మంచిదని, లేదంటే స్టోన్స్ పెద్దగా అవుతాయని చెబుతున్నారు. టమాటాల్లో మాలిక్ యాసిడ్, సిట్రిక్ యాసిడ్ లు పుష్కలంగా ఉంటాయి. వీటిని ఎక్కువగా తీసుకుంటే యాసిడ్ రిఫ్లక్స్ సమస్య వచ్చే ప్రమాదం ఉందట. యాసిడ్ రిఫ్లక్స్ వల్ల జీర్ణ సమస్యలు, గుండెల్లో మంట వంటి సమస్యలు వస్తాయని, అందుకే టమాటాలను ఎక్కువగా తినకూడదని చెబుతున్నారు. కాగా టమాటాల్లో ఉండే ఓ మూలకం అలెర్జీ, చర్మపు దద్దుర్లను కలిగిస్తుందట. ముఖ్యంగా స్కిన్ అలర్జీ ఉన్నవారికి ఇవి మంచివి కావట. కాబట్టి టమాటాలను ఎక్కువగా తినకూడదని చెబుతున్నారు..