HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Health
  • >What Happens If You Eat Corn Flour Every Day

Corn Flour: కార్న్ ఫ్లోర్ ఎక్కువగా తింటున్నారా.. అయితే ఇది తెలుసుకోవాల్సిందే?

కార్న్ ఫ్లోర్ ఎక్కువగా తినడం అంత మంచిది కాదని, ఇది అనేక రకాల సమస్యలను తెచ్చిపెడుతుందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

  • Author : Anshu Date : 27-04-2025 - 3:00 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Corn Flour
Corn Flour

కార్న్ ఫ్లోర్ దీనిని మొక్కజొన్న పిండి అని పిలుస్తారు. ఈ కార్న్ ఫ్లోర్ ని చాలా రకాల వంటల్లో ఉపయోగిస్తూ ఉంటారు. ఇది ఆరోగ్యానికి మంచి చేసేది అయినప్పటికీ అతిగా తింటే మాత్రం సమస్యలు తప్పవు అంటున్నారు. ఇటీవల కాలంలో చాలా మంది స్నాక్స్ రూపంలో తీసుకోవడం కోసం ఈ కార్న్ ఫ్లోర్ ని ఎక్కువగా వినియోగిస్తున్నారు. మరి ఈ మొక్కజొన్న పిండి ఎక్కువగా తింటే ఏం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. మొక్కజొన్న పిండిని ఎన్నో రకాల వంటకాలకు ఉపయోగిస్తారు. ఇది ఫుడ్ కు క్రంచ్ నెస్ ను తీసుకొస్తుంది.

అందుకే చికెన్, ఫిష్, కాలీఫ్లవర్, బంగాళాదుంప లాంటి చాలా ఆహారాలకు మొక్కజొన్న పిండిని ఉపయోగిస్తుంటారు. కానీ దీన్ని మోతాదుకు మించి తింటే మాత్రం మీరు ఎన్నో సమస్యల బారిన పడతారట. ఒక కప్పు మొక్కజొన్న పిండిలో దాదాపుగా 490 కేలరీలు, 120 గ్రాముల కార్బోహైడ్రేట్ ఉంటుందట. ఈ మొక్కజొన్న పిండిలో ప్రోటీన్లు, విటమిన్లు చాలా తక్కువ మొత్తంలో ఉంటాయట. అందుకే ఇది ఆరోగ్యంగా ఉంచడం కంటే,ఆరోగ్యాన్ని దెబ్బతీయడమే ఎక్కువగా ఉంటుందట. బరువు మాత్రం పెరగకూడదనుకునేవారు చాలా మందే ఉన్నారు.

మొక్క జొన్న పిండిని ఎక్కువగా తింటే మాత్రం ఖచ్చితంగా బరువు పెరిగిపోతారట. కాబట్టి బరువు తగ్గాలి అనుకునేవారు మొక్కజొన్నపిండికి దూరంగా ఉండడం మంచిదని చెబుతున్నారు. ఎందుకంటే ఈ పిండిలో కార్బోహైడ్రేట్లు, కేలరీలు ఎక్కువ మొత్తంలో ఉంటాయట. అందుకే దీన్ని ఎక్కువగా తింటే మీరు బరువు విపరీతంగా పెరుగుతారట. డయాబెటీస్ పేషెంట్లకు మొక్కజొన్న పిండి అంత మంచిది కాదట. ఎందుకంటే ఈ పండిలో కేలరీలు, కార్బోహైడ్రేట్లు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇవి మీ బరువును పెంచడంతో పాటుగా మీకు డయాబెటీస్ వచ్చేలా చేస్తుందట. ఈ పిండిని తింటే రక్తంలో చక్కెర స్థాయిలు బాగా పెరుగుతాయని చెబుతున్నారు. మొక్కజొన్న పిండి ప్రాసెస్ చేయబడుతుంది. కాబట్టి ఈ పండిలో ఫైబర్ వంటి ఆరోగ్యకరమైన పోషకాలు ఉండవు. అందుకే ఈ పిండిని రోజూ తింటే గుండెకు సంబంధించిన సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని చెబుతున్నారు. మొక్కజొన్న పిండిని రోజూ, ఎక్కువగా తీసుకోవడం వల్ల కొంతమందికి జీర్ణ సమస్యలు వస్తాయట. ముఖ్యంగా గ్యాస్, విరేచనాలు లేదా మలబద్ధకం వంటి జీర్ణ సమస్యలు ఈ పిండి వల్ల వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Corn Flour
  • Corn Flour eating
  • health tips
  • use too much Corn Flour

Related News

Hormonal Imbalance

మహిళల్లో హార్మోన్ల అసమతుల్యత.. ఇవే ల‌క్ష‌ణాలు?!

నిరంతరం చిరాకుగా ఉండటం, ఆందోళన, డిప్రెషన్, కోపం వంటివి హార్మోన్ల అసమతుల్యత వల్ల కలగవచ్చు. అలాగే నిద్ర పట్టకపోవడం లేదా నిద్రలో సమస్యలు కూడా దీనికి సంకేతాలే.

    Latest News

    • Donald Trump : ట్రంప్‌కు కోలుకోలేని దెబ్బ కొట్టిన మిత్రదేశాలు

    • ఈ ఎన్నిక‌ల‌కు ప‌ర్పుల్ మార్క‌ర్‌ను ఉప‌యోగిస్తార‌ని మీకు తెలుసా?

    • Drugs Case : మొయినాబాద్ డ్రగ్స్ కేసు ఎఫ్ఐఆర్ లో సంచలన విషయాలు !!

    • ఏప్రిల్ నుండి భారీగా పెర‌గ‌నున్న ధ‌ర‌లు!

    • Monalisa Marriage : ఏంటీ.. మోనాలిసా పెళ్లి చెల్లదా..?

    Trending News

      • ఐపీఎల్‌కు ముందు సూర్య‌వంశీ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌!

      • ఉగాది పండుగ ఎప్పుడు? ఆ రోజు ఏం చేయాలి?!

      • మళ్ళీ లేఆఫ్స్ కలకలం.. 16,000 మంది ఉద్యోగులపై వేటు?!

      • వినియోగ‌దారుల‌కు అల‌ర్ట్‌.. బ్యాంకుల‌కు వ‌రుస‌గా సెల‌వులు!

      • ఇకపై వీరికి ఎల్‌పిజి సిలిండర్లు లభించవు!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd