Alcohol : అతిగా మద్యం సేవించడం వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్ గురించి మీకు తెలుసా?
అతిగా మద్యం (Alcohol) సేవించడం వల్ల కలిగే అనర్థాల గురించి చాలామందికి తెలిసి కూడా మందు తాగడం మానేయరు.
- By Naresh Kumar Published Date - 04:50 PM, Mon - 20 November 23
Alcohol Over Consumption : ప్రస్తుత రోజుల్లో చిన్న వయసు నుంచే చాలా మంది మధ్యానికి బానిసలు అవుతున్నారు. మరి ముఖ్యంగా యువత కూడా మద్యానికి బాగా ఎడిక్ట్ అయిపోయారు. ఇష్టాను సారంగా లిమిట్ లేకుండా అదిగా మద్యం సేవిస్తూ ఎక్కడపడితే అక్కడ పడిపోతూ ఉంటారు. అయితే అలా అతిగా మద్యం సేవించడం వల్ల కలిగే అనర్థాల గురించి చాలామందికి తెలిసి కూడా మందు తాగడం మానేయరు. మద్యాన్ని (Alcohol) ఎక్కువగా సేవించడం వల్ల అనేక రకాల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి అంటున్నారు వైద్యులు. మరి మద్యం (Alcohol) సేవించడం వల్ల ఎటువంటి సమస్యలు వస్తాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం…
We’re Now on WhatsApp. Click to Join.
మామూలుగా మద్యం సేవించిన తర్వాత శరీరంలో దాని ప్రభావం 12 గంటల వరకు ఉంటుంది. ఇది ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదు. తరచూ క్రమం తప్పకుండా మద్యం (Alcohol) సేవిస్తూ ఉండడం వల్ల ఎన్నో రకాల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. అంతేకాకుండా చేజేతులా మన ఆయుష్షును మనమే తగ్గించుకున్నట్టు అవుతుంది. ఎక్కువగా ఆల్కహాల్ తీసుకోవడం వల్ల రోజంతా అలసటికీ దారితీస్తుంది. మద్యం ఎక్కువగా తాగడం వల్ల అది గుండెపోటు ప్రమాదాన్ని మరింత పెంచుతుంది. అధిక ఆల్కహాల్ మానసిక స్థితిని ప్రభావితం చేస్తుంది. అలాగే అతిగా ఆల్కహాల్ తీసుకోవడం వల్ల మగవారిలో స్పెర్ము కౌంట్ కూడా పూర్తిగా తగ్గిపోతుంది. మద్యంలో క్యాలరీలు అధికంగా ఉంటాయి.
దాని ఫలితంగా బరువు పెరగడానికి దోహదపడుతుంది. బరువు పెరగడం వలన ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తుంటాయి. నిత్యం మద్యం సేవించడం వలన శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరుగుతుంది. మద్యం తీసుకోవడం వలన మెదడులో తెల్ల పదార్థం వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే అతిగా మద్యం సేవించడం వల్ల అది రోగనిరోధక వ్యవస్థ పై ప్రభావాన్ని చూపిస్తుంది. తరచూ మందు తాగుతూ ఉండడం వల్ల ఉండటం వల్ల అది శరీరాన్ని నాశనం చేస్తూ వస్తుంది. మద్యం కారణంగా సరిగా నిద్ర పట్టక నిద్రకి భంగం కలుగుతుంది. అలాగే ఊబకాయం కూడా పెరుగుతుంది. క్రమంగా లివర్ సమస్యలు కూడా తలెత్తుతాయి. అధిక మద్యం సేవించడం వల్ల లివర్ దిబ్బ తినే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మద్యం సేవించడం మంచిదే కానీ మితిమీరి అసలు తాగకూడదు. అలా అని ప్రతి రోజు కూడా మద్యం సేవించడం ఏ మాత్రం మంచిది కాదు.
Also Read: Lawyers Vs ChatGPT : లాయర్లకు ‘ఛాట్ జీపీటీ’ ఝలక్.. నమ్ముకుంటే నట్టేట ముంచుతోందట !
Related News
Walnut Benefits: నానబెట్టిన వాల్ నట్స్ తింటే ఈ సమస్యలు దూరం..!
ప్రస్తుతం ప్రజలు మలబద్ధకంతో బాధపడుతూనే ఉన్నారు. వాల్నట్స్లో పీచుపదార్థాలు పుష్కలంగా ఉంటాయి. రోజూ 2 నానబెట్టిన వాల్నట్లను తినడం వల్ల మీ జీర్ణవ్యవస్థ బలపడుతుంది.