Cool Water: కూల్ వాటర్ ఎక్కువగా తాగుతున్నారా.. అయితే ఇది మీకోసమే!
సమ్మర్ లో కూల్ వాటర్ ఎక్కువగా తాగే వారు తప్పకుండా కొన్ని రకాల విషయాలు గుర్తుంచుకోవాలి అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
- By Anshu Published Date - 04:00 PM, Thu - 27 March 25

వేసవికాలం మొదలయ్యింది. ఎండలు మండిపోతున్నాయి. వేసవిలో ఆహారం కంటే ఎక్కువగా పానీయాలు తాగడానికి ఇష్టపడుతూ ఉంటారు. వేడిగా ఎలాంటి ఆహార పదార్థాలు తినాలి అనిపించదు. కేవలం చల్లగా మాత్రమే తినాలని తాగాలని అనిపిస్తూ ఉంటుంది. అయితే వేసవికాలంలో ఎక్కువ శాతం మంది తీసుకునే పదార్థం నీరు.. చల్లనీరు ఎక్కువగా తాగడానికి ఇష్టపడుతూ ఉంటారు. అలా కొద్దిసేపు ఎండలోకి వెళ్లి రాగానే వెంటనే ఫ్రిడ్జ్ లో ఉండే వాటర్ బాటిల్ తీసుకొని నీరు తాగుతూ ఉంటారు. కానీ చాలామందికి తెలియని విషయం ఏమిటంటే చల్లని నీరు తాగితే ఆరోగ్యం దెబ్బతింటుందట.. ఇదే విషయాన్ని వైద్యులు చెబుతున్నారు ఇదే విషయాన్ని వైద్యులు చెబుతున్నారు. మరి చల్ల నీరు తాగితే ఏం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
చల్ల నీరు ఎక్కువగా తాగడం వల్ల అవి జీర్ణవ్యవస్థను చాలా ఫాస్ట్ గా ప్రభావితం చేస్తుందట. తరచుగా కూల్ వాటర్ ను తాగితే ఆహారం జీర్ణం కావడం కష్టమవుతుందట. అలాగే కడుపు నొప్పి, వికారం, మలబద్ధకం, అపానవాయువు వంటి సమస్యలు వస్తాయని చెబుతున్నారు. ఎందుకంటే కూల్ వాటర్ ను తాగినప్పుడు అది మన శరీర ఉష్ణోగ్రతతో సరిపోదట. అలాగే కడుపులో ఉన్న ఆహారాన్ని శరీరానికి చేరడం ద్వారా జీర్ణించుకోవడం కష్టమవుతుందని చెబుతున్నారు.
కూల్ వాటర్ ను తరచుగా తాగితే బ్రెయిన్ ఫ్రీజ్ సమస్యలు కూడా వస్తాయని చెబుతున్నారు. అంతేకాకుండా ఐస్ వాటర్ లేదా ఎక్కువ ఐస్ క్రీం తినడం వల్ల కూడా ఇది వస్తుందట. నిజానికి చల్ల నీరు వెన్నెముక సున్నితమైన నరాలను చల్లబరుస్తుందట. ఇది మెదడును ప్రభావితం చేస్తుందని, దీనివల్ల తలనొప్పి, సైనస్ వంటి సమస్యలు వస్తాయని చెబుతున్నారు. మెడ ద్వారా గుండె, ఊపిరితిత్తులు, జీర్ణవ్యవస్థను నియంత్రించే వాగస్ నాడి మన శరీరంలో ఉంటుంది. మీరు ఎక్కువ కూల్ వాటర్ ను తాగితే మీ సిరలు ఫాస్ట్ గా చల్లబడతాయి. అలాగే హృదయ స్పందన రేటు, పల్స్ రేటు నెమ్మదిస్తుందట. అలాగే బరువు తగ్గాలి అనుకున్న వారు కూడా కూల్ వాటర్ కు దూరంగా ఉండడం మంచిదని చెబుతున్నారు. కూల్ వాటర్ ఎక్కువగా తాగడం వల్ల గొంతు ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయట.