Weight Loss: పొట్ట తగ్గాలంటే మధ్యాహ్నం అన్నానికి బదులుగా వీటిని తినాల్సిందే?
అధిక పొట్టతో బాధపడుతున్న వారు మధ్యాహ్న సమయంలో అన్నానికి బదులుగా కొన్నింటిని తీసుకోవడం వల్ల ఈజీగా బరువు తగ్గించుకోవచ్చని చెబుతున్నారు.
- By Anshu Published Date - 12:20 PM, Fri - 20 December 24

ఈ రోజుల్లో పొట్ట తగ్గించుకోవడం బరువు తగ్గించుకోవడం అన్నది ఒక సవాల్ గా మారిపోయింది. పొట్ట పెరగడం ఈజీనే కానీ తగ్గించుకోవడం చాలా కష్టం. ఆహారపు అలవాట్లను మార్చుకోవడం నుంచి ఎక్సర్సైజ్ చేయడం, జిమ్ కి వెళ్లడం, వ్యాయామాలు చేయడం, వాకింగ్ చేయడం ఇన్ని చేసినా కూడా కొన్ని కొన్ని సార్లు బరువు తగ్గలేదని దిగులు చెందుతూ ఉంటారు. బరువు తగ్గాలనుకునే వారు వీలైనంత వరకు మధ్యాహ్నం, రాత్రి పూట అన్నం తినకూడదట. ఎందుకంటే బియ్యంలో కేలరీలు, కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి. అందుకే అన్నాన్ని తింటే ఈజీగా బరువు పెరుగుతారట.
శరీరంలో కొవ్వు కూడా పెరుగుతుందట. మరి బరువు తగ్గాలనుకునే వారు మధ్యాహ్నం, రాత్రి పూట అన్నానికి బదులు ఏమేం తినాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. అన్నానికి బదులుగా చపాతీలను తినడం చాలా మంచిది. ఎందుకంటే ఇది మీ శరీర బరువును తగ్గించడానికి ఎంతో బాగా సహాయపడుతుంది. అందుకే మధ్యాహ్నం, రాత్రి పూట అన్నానికి బదులుగా చపాతీలను తినాలని చెబుతున్నారు. అయితే జీర్ణశక్తితో బాధపడే వారు రాత్రిపూట చపాతి తింటే డైజెస్ట్ అవ్వదు అనుకున్న వాళ్లు తినకపోవడమే మంచిది అని చెబుతున్నారు. అలాగే ఓట్స్ బరువు తగ్గించడంలో ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. ఒక కప్పు ఓట్ మీల్ లో 7.5 గ్రాముల ఫైబర్ కంటెంట్ ఉంటుంది.
అంతేకాదు వీటిలో విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు కూడా సమృద్ధిగా ఉంటాయి. ఓట్స్ ప్రోటీన్ కు మంచి వనరు. ఇది కడుపును ఎక్కువ సేపు నిండుగా ఉంచుతుంది. అందుకే బరువు తగ్గాలనుకునే మధ్యాహ్నం, రాత్రి పూట అన్నానికి బదులుగా ఓట్ మీల్ ను తినాలని చెబుతున్నారు. బియ్యం కంటే బార్లీలోనే ప్రోటీన్, ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటాయి. బార్లీలో విటమిన్ బి, జింక్, సెలీనియం, ఐరన్, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. కాబట్టి వీటిని అన్నానికి ప్రత్యామ్నాయంగా ఆహారంలో చేర్చుకుంటే ఈజీగా బరువు తగ్గవచ్చట. యాపిల్స్ లో ఫైబర్ అధికంగా ఉంటుంది. రోజూ ఆపిల్ ను తినడం వల్ల ఎప్పుడూ ఆకలి అయ్యే ఛాన్స్ చాలా వరకు తగ్గుతుంది. అంతేకాదు ఇది మీ కడుపును ఎక్కువ సేపు నిండుగా ఉంచుతుంది. కాబట్టి ఆపిల్ ను తినడం వల్ల ఆకలి తగ్గి ఆరోగ్యంగా బరువు తగ్గవచ్చని చెబుతున్నారు. గుడ్లు మంచి పోషకాహారం. గుడ్లను ఉడకబెట్టి, ఆమ్లెట్ లేదా కూరగా చేసుకుని తినవచ్చు. బెల్లీ ఫ్యాట్ తగ్గించుకోవాలనుకునే వారికి గుడ్లు మంచి ప్రయోజనకరంగా ఉంటాయి. గుడ్లు పోషకాల లోపాలను కూడా పోగొడుతాయి. అలాగే ఫ్రూట్స్ సలాడ్ కూడా తీసుకోవచ్చు. మధ్యాహ్నం సమయంలో భోజనం తినడానికి ఇష్టపడని వారు కొన్ని రకాల ఫ్రూట్స్ ని తీసుకోవడం మంచిదని చెబుతున్నారు.