Watermelon : పుచ్చకాయను ఎట్టి పరిస్థితుల్లో ఆలా తినకూడదు
Watermelon : గుడ్డు, పుచ్చకాయ వేర్వేరు ప్రభావాలు కలిగి ఉండటంతో కడుపులో అసౌకర్యం కలిగించవచ్చు
- By Sudheer Published Date - 10:59 AM, Sat - 15 March 25

వేసవి కాలంలో పుచ్చకాయ (Watermelon ) తినడం ఎంతో మేలు. ఇందులో 90% నీరు ఉండటం వల్ల వేడిమి వల్ల డీహైడ్రేషన్ సమస్యను తగ్గించడంలో ఇది సహాయపడుతుంది. పుచ్చకాయలో విటమిన్ A, C, పొటాషియం, యాంటీఆక్సిడెంట్లు లైకోపీన్, బీటా-కెరోటిన్ ఉంటాయి. ఇవి చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరిచేలా చేస్తాయి. అయితే పుచ్చకాయ తినే విధానంలో కొన్ని జాగ్రత్తలు పాటించకపోతే అనేక ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే ప్రమాదముంది.
YS Viveka : సాక్షుల మరణాలపై అనుమానం ఉంది.. వైఎస్ సునీత సంచలన వ్యాఖ్యలు
పుచ్చకాయ (Watermelon ) తిన్న వెంటనే పాల ఉత్పత్తులను తీసుకోవడం ఆరోగ్యానికి హానికరం. దీనివల్ల అజీర్ణం, ఉబ్బరం సమస్యలు రావచ్చు. అలాగే అధిక ప్రోటీన్ కలిగిన ఆహారాలతోపాటు గుడ్డును కూడా పుచ్చకాయతో కలిపి తినకూడదు. గుడ్డు, పుచ్చకాయ వేర్వేరు ప్రభావాలు కలిగి ఉండటంతో కడుపులో అసౌకర్యం కలిగించవచ్చు. మరింతగా పుచ్చకాయకు ఉప్పు కలిపి తినడం రక్తపోటు సమస్యలను పెంచే ప్రమాదముంది.
Ear Phones: గంటల తరబడి చెవులలో ఇయర్ ఫోన్స్ పెడుతున్నారా.. అయితే తప్పకుండా ఈ విషయం తెలుసుకోవాల్సిందే?
అలాగే పుచ్చకాయను (Watermelon ) కొంత భాగం తిని మిగిలినదాన్ని ఫ్రిజ్‌లో ఉంచడం చాలా మందికి అలవాటు. అయితే ఫ్రిజ్‌లో ఉంచిన పుచ్చకాయ పోషకాలు కోల్పోతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీని వలన అనారోగ్య సమస్యలు కలగవచ్చు. అంతేకాకుండా రాత్రి పూట పుచ్చకాయ తినడం వల్ల నిద్రపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంటుంది. కాబట్టి పుచ్చకాయను తినే ముందు ఈ జాగ్రత్తలను తీసుకుంటే ఆరోగ్యానికి మేలు జరుగుతుంది.