Hot Water: వేడి నీళ్లు తాగడం మంచిదే కానీ.. ఈ సమస్యలు ఉన్నవారు అస్సలు తాగకూడదట!
ఉదయాన్నే గోరువెచ్చని నీళ్లు తాగడం మంచిదే కానీ కొన్ని రకాల సమస్యలు ఉన్న తాగకూడదని చెబుతున్నారు. మరి ఎలాంటి సమస్యలు ఉన్నవారు వేడి నీరు తాగకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
- By Anshu Published Date - 05:03 PM, Sat - 22 March 25

గోరు వెచ్చని నీరు తాగడం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయన్న విషయం మనందరికి తెలిసిందే. ఉదయం ఖాళీ కడుపుతో గోరు వెచ్చని నీరు తాగడం చాలా మందికి అలవాటు ఉండే ఉంటుంది. ఉదయం గోరువెచ్చని నీరు త్రాగడం వల్ల బరువు తగ్గడం, కడుపు క్లియర్ కావడం అనేక ఇతర ప్రయోజనాలు ఉన్నాయట. కానీ కొంత మందికి, ఉదయం వేడినీరు తాగడం హానికరం. అలాగే 5 రకాల సమస్యలు ఉన్నవారికి మాత్రం ఉదయం వేడినీరు తాగితే అది వారికి హాని కలిగిస్తుందట. మరి ఎలాంటి సమస్యలు ఉన్నవారు గోరు వెచ్చని నీరు తాగకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
కడుపులో అల్సర్లు ఉంటే, ఉదయం ఖాళీ కడుపుతో వేడినీరు తాగకూడదట. దీని వల్ల హాని జరగవచ్చట. మీకు అల్సర్ ఉంటే వేడినీరు తాగడం వల్ల కడుపులో చికాకు నొప్పి వస్తుందట. దీనివల్ల కడుపు వాపు కూడా వస్తుందట. అల్సర్లు ఉన్నవారు కారంగా ఉండే ఆహారాలు, కెఫిన్, ఆల్కహాల్ ఆమ్ల ఆహారాలు తీసుకోవడం మానుకోవాలట. అదే సమయంలో కడుపు పొరను చికాకు పెట్టే వేడి వేడి డ్రింక్స్ కు కూడా దూరంగా ఉండాలని చెబుతున్నారు.
యాసిడ్ రిఫ్లక్స్.. చాలా మంది ఎదుర్కొనే సమస్యల్లో ఇది కూడా ఒకటి. తిన్న వెంటనే పుల్లటి త్రేన్పులు రావడం దీనికి సంకేతం అని చెబుతున్నారు. అటువంటి పరిస్థితిలో ఈ కడుపు సమస్యలో కూడా వేడినీరు తాగడం మానుకోవడం మంచిదని చెబుతున్నారు. దీనివల్ల కడుపు లోని ఆమ్లం ఆహార పైపు లోకి చేరుతుందట. దీని కారణంగా కడుపు నొప్పి వస్తుందని చెబుతున్నారు.
విరేచనాలు అనేది జీర్ణవ్యవస్థకు సంబంధించిన సమస్య కాబట్టి ఈ సమస్యతో బాధ పడేవారు కూడా ఉదయాన్నే వేడి నీరు అస్సలు తాగకూడదట. విరేచనాలకు వైరల్ లేదా బాక్టీరియల్ ఇన్ఫెక్షన్, సరైన ఆహారం లేకపోవడం, మందుల దుష్ప్రభావాలు లేదా ఒత్తిడి వంటి అనేక కారణాలు ఉండవచ్చట. అతిసారం విషయంలో కడుపు ప్రేగులలో మంట పెరుగుతుందట. ముఖ్యంగా ఇది ఇన్ఫెక్షన్, విషపూరిత ఆహారం లేదా అల్సరేటివ్ కొలిటిస్ లేదా క్రోన్ స్ వ్యాధి వంటి ఐబీడీ కారణంగా వస్తుంటుందట. ఈ పరిస్థితిలో మీరు తరచుగా టాయిలెట్ కి వెళ్ళవలసి రావచ్చని చెబుతున్నారు. గోరువెచ్చని నీరు త్రాగడం వల్ల శరీర జీవక్రియ పేగుల కదలికలు పెరుగుతాయట.
కాగా వేడి నీరు తాగడం వల్ల శరీర ఉష్ణోగ్రత పెరుగుతుందట. ఎందుకంటే వేడి నీరు శరీరాన్ని వేడిగా చేస్తుందట. చెమట పట్టడానికి కారణమవుతుందని, ఇది శరీరం నుండి విషాన్ని బయటకు పంపడంలో సహాయపడుతుందని చెబుతున్నారు. అదే సమయంలో తీవ్రమైన వేడిని అనుభవించే వ్యక్తులు వేసవిలో వేడి నీటిని తాగకుండా ఉండాలట.