Viral Fever Cases: పెరుగుతున్న వైరల్ ఫీవర్ కేసులు.. ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్తగా ఉండండి..!
మారుతున్న సీజన్‌తో వ్యాధులు, అంటువ్యాధుల ప్రమాదం కూడా పెరుగుతుంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా సీజనల్ ఫ్లూ, వైరల్ ఫీవర్ (Viral Fever Cases) కేసులు నిరంతరం పెరుగుతున్నాయి.
- By Gopichand Published Date - 07:36 AM, Wed - 16 August 23

Viral Fever Cases: మారుతున్న సీజన్‌తో వ్యాధులు, అంటువ్యాధుల ప్రమాదం కూడా పెరుగుతుంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా సీజనల్ ఫ్లూ, వైరల్ ఫీవర్ (Viral Fever Cases) కేసులు నిరంతరం పెరుగుతున్నాయి. వర్షాకాలం కావడంతో ఇన్ ఫెక్షన్లు, వైరల్, కండ్లకలక వేగంగా విస్తరిస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా అనేక నగరాల్లో వరదల వంటి పరిస్థితులు ఏర్పడి ఈ కేసుల్లో తీవ్ర పెరుగుదలకు దారితీసింది. ఇటీవల కాన్పూర్, గౌహతి, కోల్‌కతాతో సహా దేశంలోని అనేక ప్రాంతాల్లో వైరల్ జ్వరం, ఫ్లూ కేసులు పెరిగాయి.
వాతావరణంలో నిరంతర మార్పుల కారణంగా అంటువ్యాధుల రోగుల సంఖ్య పెరుగుతోంది. వర్షాకాలంలో వాతావరణం, తేమ స్థాయిలు బ్యాక్టీరియా, వైరస్‌లు, శిలీంధ్రాలు వృద్ధి చెందడానికి, వ్యాప్తి చెందడానికి అనువైన వాతావరణాన్ని సృష్టిస్తాయి. ఇలాంటి పరిస్థితుల్లో వాతావరణంలో వచ్చే మార్పుల వల్ల వచ్చే వైరల్ ఫీవర్ గురించి సరైన సమాచారాన్ని పొందడంతోపాటు వాటి నివారణకు తగిన చర్యలు తీసుకోవడం చాలా అవసరం. ఈరోజు ఈ ఆర్టికల్‌లో వైరల్ ఫీవర్‌కి సంబంధించిన ముఖ్యమైన సమాచారాన్ని మేము మీకు చెప్పబోతున్నాం.
జ్వరం అంటే ఏమిటి?
సాధారణ మానవ శరీర ఉష్ణోగ్రత 37 °C లేదా 98.6 °F. శరీర ఉష్ణోగ్రత ఇంతకంటే ఎక్కువగా ఉంటే దానిని జ్వరం అంటారు. పెరిగిన శరీర ఉష్ణోగ్రత మీ శరీరం వైరల్ లేదా బాక్టీరియల్ ఇన్ఫెక్షన్‌తో పోరాడుతుందనడానికి సంకేతం.
వైరల్ జ్వరం లక్షణాలు
– చెమటలు అధికంగా పట్టడం
– ఒళ్ళు నొప్పులు
– చలి
– కండరాల నొప్పులు
– ఆకలి లేకపోవడం
– డీహైడ్రేషన్
– వికారం
Also Read: Corn Benefits : మొక్కజొన్న వలన కలిగే ప్రయోజనాలు తెలుసా..
వైరల్ జ్వరం రావటానికి కారణాలు
– వైరల్ ఫీవర్ సోకిన వ్యక్తి స్పర్శ లేదా సదరు వ్యక్తి తీసుకున్న ఆహారం తీసుకోవడం వల్ల వ్యాపిస్తుంది
– కలుషిత ఆహారం, నీరు తాగడం వల్ల వ్యాధి వ్యాప్తి
– దోమలు, కీటకాల కాటు వైరస్ వ్యాపించేలా చేస్తుంది. చలికి కారణం కావచ్చు
– ఫ్లూ సోకిన వ్యక్తి తుమ్మినా దగ్గినా అతని దగ్గర ఉన్నప్పుడు అంటుకుంటుంది
తీసుకోవాల్సిన జాగ్రత్తలు
– శరీరానికి విశ్రాంతి అవసరం
– ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్ గా ఉంచుకోవాలి. శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచేందుకు ద్రవాలు తగినన్ని తీసుకోవాలి
– ఆరోగ్యకరమైన, తేలికపాటి భోజనం తీసుకోవాలి
– సులభంగా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవాలి
– వ్యక్తిగత శుభ్రత పాటించాలి
– వైరస్ వ్యాప్తి చెందకుండా సోషల్ డిస్టెన్స్ పాటించాలి