Apple vs Guava: ఏ పండు ఎక్కువ ఆరోగ్యకరం.. జామకాయ? యాపిలా?
మార్కెట్ లో మనకు ఎన్నో రకాల పండ్లు లభిస్తూ ఉంటాయి వాటిలో యాపిల్ జామ పండు కూడా ఒకటి. వర్షాకాలంలో మనకు యాపిల్స్, జామకాయలు మార్కెట్‌లో ఎక్కువ
- Author : Anshu
Date : 04-04-2024 - 6:29 IST
Published By : Hashtagu Telugu Desk
మార్కెట్ లో మనకు ఎన్నో రకాల పండ్లు లభిస్తూ ఉంటాయి వాటిలో యాపిల్ జామ పండు కూడా ఒకటి. వర్షాకాలంలో మనకు యాపిల్స్, జామకాయలు మార్కెట్‌లో ఎక్కువగా లభిస్తాయి. కొందరు యాపిల్ పండుని ఇష్టపడితే మరి కొందరు జామ పండు ఇష్టపడుతూ ఉంటారు. అయితే ఈ రెండింటిలో ఆరోగ్యానికి ఏది మంచిది అన్న సందేహం చాలా మందికి కలిగే ఉంటుంది. మిగతా పండ్ల కంటే యాపిల్స్ అందంగా కనిపిస్తాయి. వాటి ముందు జామకాయలు దిగదుడుపే. పైగా జామకాయలతో పోల్చితే యాపిల్స్ ధర దాదాపు డబుల్ ఉంటుంది. యాపిల్స్‌ని చక్కగా డెకరేట్ చేస్తారు. జామకాయల్ని కుప్పలా పోస్తారు.
We’re now on WhatsApp. Click to Join
అందువల్ల జనరల్‌గా జామకాయల కంటే యాపిల్స్ ఎక్కువ ఆరోగ్యకరం అనే అభిప్రాయం చాలా మందిలో ఉంటుంది. జామకాయలు ఏడాదంతా లభిస్తాయి. మన తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ప్రతీ ఇంటి దగ్గరా జామ కాయల చెట్టు కామన్‌గా ఉంటుంది. అందువల్ల జామకాయలు అనగానే మనలో ఒకింత చీప్ ఫీలింగ్ కలుగుతుంది. అదే సమయంలో యాపిల్స్ చెట్లు ఇక్కడ పెద్దగా పెరగవు కాబట్టి యాపిల్స్‌కి మనం ఎక్కువ విలువ ఇస్తాం. యాపిల్‌లో కంటే జామకాయల్లో పోషకాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా విటమిన్ సి ఆరెంజ్‌లో కంటే జామలో 4 రెట్లు ఎక్కువగా ఉంటుంది. పైనాపిల్‌లో కంటే జామలో ప్రోటీన్ 3 రెట్లు ఎక్కువగా ఉంటుంది.
Also Read:Water Melon: పుచ్చకాయతో వీటిని కలిపి తింటున్నారా.. అయితే జాగ్రత్త?
అలాగే.. ఫైబర్ 4 రెట్లు ఎక్కువగా ఉంటుంది. టమాటాలో కంటే 2 రెట్లు ఎక్కువగా లైకోపీన్ జామలో ఉంటుంది. అరటిలో కంటే కొద్దిగా ఎక్కువ పొటాషియం జామకాయల్లో ఉంటుంది. జామకాయల్ని మనం పుష్కలంగా తినవచ్చు. జామకాయల్ని ఎక్కువగా తింటే.. వాటిలోని గింజల వల్ల కిడ్నీలో రాళ్లు ఏర్పడతాయనే ఉద్దేశంతో చాలా మంది ఈ పండ్లను తినేందుకు ఇష్టపడరు. కానీ జామకాయల వల్ల 15 ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. గింజలు తొలగించి తింటే ఈ ప్రయోజనాలన్నీ పొందవచ్చు. డయాబెటిస్‌ను కంట్రోల్‌లో ఉంచగలవు. బ్లడ్ షుగర్ లెవెల్స్ ఒక్కసారిగా పెరగవు. అలాగే ఈ పండ్లు విటమిన్ ఏ ద్వారా కంటి చూపును మెరుగు పరుస్తాయి. ఇంకా బరువు తగ్గాలి అనుకునేవారు జామకాయల్ని తింటే బరువు తగ్గగలరు. కారణం వీటిలోని ఫైబర్ ఆకలిని తగ్గించగలదు.
అలాగే మెరిసే చర్మం కావాలనుకునేవారికి జామకాయ మేలు. ఇందులోని విటమిన్ ఏ , లైకోపీన్, బీటా-కెరోటిన్ త్వరగా ముసలితనం రానివ్వవు. ముడతలను పోగొట్టగలవు. జామలోని బి3, బి6 విటమిన్లు.. రక్త ప్రసరణను మెరుగు పరచి.. బ్రెయిన్ బాగా పనిచేసేలా చేస్తాయి. అలాగేమలబద్ధకం సమస్యను జామ తగ్గిస్తుంది. జామలోని విటమిన్ C ఇమ్యూనిటీని పెంచుతుంది. జలుబు, దగ్గును తగ్గిస్తుంది. అలాగే బాడీకి కావాల్సిన కొల్లాజెన్ ప్రోటీన్‌ను జామ ఇస్తుంది. గర్భిణీలకు జామ మేలు చేస్తుంది. ఇందులోని ఫోలిక్ యాసిడ్ (n