Type 3 diabetes : టైప్-3 సీ డయాబెటిస్ అత్యంత ప్రమాదకరం..ప్రారంభ లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసుకోండి..!!
ప్రపంచంలో చాలామంది ఎదుర్కొంటున్న సమస్య డయాబెటిస్. నేటికాలంలో ఇది చాలా సాధారణ వ్యాధిగా మారింది.
- By hashtagu Published Date - 09:51 AM, Mon - 17 October 22

ప్రపంచంలో చాలామంది ఎదుర్కొంటున్న సమస్య డయాబెటిస్. నేటికాలంలో ఇది చాలా సాధారణ వ్యాధిగా మారింది. అయితే ఇప్పటివరకు టైప్ 1, టైప్ 2 డయాబెటిస్ గురించి మాత్రమే మనలో చాలామందికి తెలుసు. కానీ ఇప్పుడు టైప్ 3 డయాబెటిస్ కూడా చాపకిందనీరులా విస్తరిస్తోంది. టైప్1, టైప్ 2 కంటే టైప్ 3 డయాబెటిస్ అత్యంత ప్రమాదకరమైందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దీన్ని ముందుగానే గుర్తించలేము.
టైప్ 3 సి డయాబెటిస్ అంటే ఏమిటి.
టైప్ 3 సి డయాబెటిస్ ప్యాంక్రియాస్ లో ఆటంకాల వల్ల వస్తుంది. ప్యాంక్రియాస్ కు నష్టం జరిగినప్పుడు ఇది జరగతుంది. ఈ టైప్ 3 సిడయాబెటిస్ లో ఇన్సులిన్ పరిమాణం అనేది తగ్గుతుంది. దీంతో శరీరం తగినంత ఇన్సులిన్ ఉత్పతి చేయదు. టైప్ 3సి డయాబెటిస్ సోకినట్లయితే…ప్యాంక్రియాస్ ఆహారాన్ని జీర్ణం చేసేందుకు అవసరమైన ఎంజైమ్ లను ఉత్పత్తి చేయదు.
లక్షణాలు.
ఇది చాలా అరుదుగా వస్తుంది. అలా అజాగ్రత్తగా ఉండకూడదు. దాని లక్షణాలు బయటకు కనిపించవు. కాబట్టి ఆ వ్యాధిని సమయానికి గుర్తించి వైద్యం అందించడం కష్టం అవుతుంది. అయితే శరీరంలో జరిగే కొన్ని మార్పుల ఆధారంగా ఈవ్యాధిని గుర్తించవచ్చు. మీరు డయాబెటిస్ పేషంట్ అయినట్లయితే…మీరు ఎలాంటి కారణం లేకుండా వేగంగా బరువు తగ్గుతారు. ఇలాంటి లక్షణం కనిపించిన వెంటనే వైద్యుడిని సంప్రదించండి. ఇవే కాకుండా కడుపనొప్పి, అలసట, అతిసారం, గ్యాస్ , హైపోగ్లైసీమియా, వంటి లక్షణాలన్నీ కూడా టైప్ 3 సి డయాబెటిస్ ఉన్న రోగిలో కనిపిస్తాయి.
కారణాలు
టైప్ 3 సి డయాబెటిస్ కు చాలా కారణాలు ఉన్నాయి. వీటిలో చాలా వరకు ప్యాంక్రియాస్ కు వ్యాధులకు సంబంధించినవి. దీర్ఘకాలిక ఫ్యాంక్రియాటైటిస్ ఉన్నవారిలో 80శాతం మంది వరకు టైస్ 3సి వచ్చే ప్రమాదం ఉంటుంది. ఇవేకాకుండా మధుమేహం, ఊబకాయం, అధిక రక్తపోటుతో బాధపడుతున్న రోగుల్లో కూడా ఇది సంభవించే ఛాన్స్ ఉంటుంది. రోగికి ఈ లక్షణాలు నిరంతరం ఉన్నట్లయితే ఈ వ్యాధిని గుర్తించవచ్చు. సరైన సమయంలో చికిత్స తీసుకోకుంటే ఈ ప్రాణాంతకం అయ్యే అవకాశం ఉంటుంది.
ఈ వ్యాధితో బాధపడుతున్న రోగులు కఠినమైన ఆహారం, జీవనశైలిని అనుసరించాల్సి ఉంటుంది. అమెరికన్ డయాబెటిస్ అసోసియేషన్ ప్రకారం టైప్ 3 సి డయాబెటిస్ గతంలో కంటే చాలా సాధారణమైంది. డయాబెటిస్ రోగుల్లో కనీసం 8శాతం మందికి వచ్చే ప్రమాదం ఉంటుందని తెలిపింది.