HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Health
  • >Try These Vegetables Which Will Make You Lose Weight Faster

Weight Loss Tips: మీరు వేగంగా బరువు తగ్గేలా చేసే ఈ కూరగాయలను ప్రయత్నించండి.

బరువుని కంట్రోల్ చేయడం చాలా కష్టమైన పని అనుకుంటారు చాలా మంది. కానీ, కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఇదంతా కష్టమేమి కాదు. ముఖ్యంగా తినే ఆహారం విషయంలో..

  • Author : Maheswara Rao Nadella Date : 06-03-2023 - 6:00 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Try These Vegetables Which Will Make You Lose Weight Faster.
Try These Vegetables Which Will Make You Lose Weight Faster.

వెజిటేరియన్స్.. వీరికి తినందుకు కొన్ని ఆప్షన్స్ మాత్రమే ఉన్నాయనుకుంటారు. కానీ, ఏ మాత్రం కాదు. వీరికి బోలెడు ఆప్షన్స్ ఉంటాయి. ముఖ్యంగా నాన్‌వెజిటేరియన్ ఫుడ్స్‌ని కూరగాయలతోనూ చేయొచ్చు. వీటికి అవే టేస్ట్ వస్తుంది. అంతేకాదు, వీటిని తినడం వల్ల బరువు (Weight) కూడా తగ్గడం ఈజీ అవుతుంది. అందుకే డైటీషియన్, డాక్టర్ అర్చనా బాత్రా కొన్ని రెసిపీస్ గురించి చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం.

శాండ్‌విచ్:

శాండ్‌విచ్ అందరూ తింటారుగా. పైగా దీని వల్ల బరువు (Weight) ఏం తగ్గుతారని ఫీల్ అవ్వొద్దు. దీనిని హెల్దీగా ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా శనగలు తీసుకుని ఉడికించండి. కాబూలి శనగలు అయితే బావుంటుంది. ఇవి బాగా ఉడికాక వాటిని మిక్సింగ్ బౌల్‌లో వేయండి. సెలెరీ తరుగు, స్కాలియన్లు, వేగన్ పెరుగు, నిమ్మరసం, ఉప్పు, మిరియాల పొడి చల్లండి. బాగా కలపండి. ఇలా తయారైన మిక్చర్‌ని బ్రైడ్‌పై అప్లై చేయండి. వీటిని బాగా రెండు వైపులా కాల్చి కట్ చేయండి. మీకు నచ్చితే స్టఫింగ్‌లో పాలకూర కూడా యాడ్ చేయొచ్చు. శనగలు, పాలకూరలో మంచి ఫైబర్ ఉంటుంది. ఇవి మీకు బరువు తగ్గడంలో హెల్ప్ చేస్తాయి.

వైట్ సాస్:

జీడిపప్పు.. నట్స్‌లో చాలా రుచిగా ఉండేవాటిలో ఇవి ముందువరుసలో ఉంటాయి. వీటితో కూడా మంచి రెసిపీ తయారు చేసుకోవచ్చు. ఇందుకోసం ముందుగా ఓ కప్పు జీడిపప్పుని నీటిలో 20 నిమిషాలు నానబెట్టండి. తర్వాత బ్లెండర్‌లో జీడిపప్పు, 3 వెల్లుల్లి రెబ్బలు, 1 టీ స్పూన్ నిమ్మరసం వేసి మిక్సీ పట్టండి. ఇప్పుడు ఇందులోనే పావు టీ స్పూన్ ఉప్పు, మిరియాలు, ఇప్పుడు పాలు పోయండి. దీనిని మెత్తగా మయోనైస్‌లా తయారయ్యే వరకూ బాగా కలపండి. ఇందులో కొద్దిగా జాజికాయ వేస్తే చాలా బావుంటుంది. దీన్ని సైడ్ డిప్‌గా కూడా లేదా డ్రెస్సింగ్‌లో, పాస్తాలో కూడా వాడొచ్చు. ఇది మీ ఫుడ్స్‌కి టేస్ట్‌ని యాడ్ చేస్తుందంటే నమ్మండి.

కాలీఫ్లవర్ వింగ్స్:

కాలీఫ్లవర్ కూడా బరువు (Weight) తగ్గేందుకు బెస్ట్ చాయిస్. దీనిని హెల్దీగా, టేస్టీగా ఇలా చేయండి. ముందుగా కాలీఫ్లవర్‌ని కట్ చేయంటి. జాగ్రత్తగా చూడండి పురుగులు ఉంటాయి. మొత్తం కట్ చేశాక. వేడి నీరు పోసి ఓ 2 నిమిషాలు ఉంచి కడిగి పక్కన పెట్టండి. ఇప్పుడు మిక్సింగ్‌బౌల్ తీసుకుని పిండి కలపండి. ఇందుకోసం మీకు నచ్చిన పిండిని 3 నుంచి 4 కప్పులు తీసుకోండి. రెండు టేబుల్ స్పూన్ల ఉల్లిపాయ, వెల్లుల్లి తురుము వేయండి. మిర్చి తరుము, మిరియాల పొడి, ఉప్పు వేసి బాగా కలపండి. ఇప్పుడు ఇందులో సోయా పాలు పోసి గిలక్కొట్టండి. కాస్తా పాన్ కేక్ బ్యాటర్‌లా ఉండాలి. ఇప్పుడు కాలీఫ్లవర్‌ని పిండిలో ముంచి కోట్ చేయండి. ఇలా కోట్ చేసిన వాటిని ఓవేన్ ఉంటే బేక్ చేయొచ్చు. లేకపోతే పాన్‌లో కొద్దిగా ఆలీవ్ ఆయిల్ వేసి కాలీఫ్లవర్ ముక్కల్ని ఒకదానికి ఒకటికి అంటుకోకుండా ఫ్రై చేయండి. వీటిని తిప్పుతూ బాగా ఫ్రై చేయండి. ఇలా తయారైన వాటిని మీకు ఇష్టమైన సాస్‌తో లాగించేయడమే. ఇది మంచి స్నాక్ ఐటెమ్ కూడా.

క్వినోవాతో:

క్వినోవా కూడా మంచి హెల్దీ ఫుడ్ ఐటెమ్ అని చెప్పొచ్చు. ముందుగా ఓ కప్పు క్వినోవా తీసుకుని కడిగి 30 నిమిషాలు నానబెట్టండి. తర్వాత పాన్‌లో రెండు టీ స్పూన్ల నూనె వేడి చేసి ఉల్లిపాయల తరుగు వేసి బాగా వేయంచండి. తర్వాత వెల్లుల్లి తరుగు వేసి మరికాసేపు ఫ్రై చేయండి. ఇప్పుడు ఇందులోని జీలకర్ర పొడి, ధనియాల పొడి, మిరియాలు వేయండి. బాగా ఫ్రై చేశాక మీకు ఇష్టమైన కూరగాయలు వేయండి. అన్ని కలిపి ఓ కప్పు ఉంటే సరిపోద్ది. తర్వాత ఉప్పు వేసి రెండు నిమిషాలు ఫ్రై చేయండి. ఇప్పుడు క్వినోవా వేసి ఫ్రై చేయండి. తర్వాత నీరు పోసి క్వినోవా ఉడికే వరకూ 20 నుంచి 25 నిమిషాలు సిమ్‌లో పెట్టి ఉడికించండి. తర్వాత కాసేపు ఆవిరి పోనివ్వకుండా ఉంచి ఆస్వాదించడమే.

బరువు (Weight) తగ్గేందుకు:

అయితే, బరువు తగ్గడం అంటే కేవలం హెల్దీ ఫుడ్స్ తినడం మాత్రమే కాదు. ప్రతి విషయంలోనూ జాగ్రత్త పడాలి. సరిగ్గా తినడం, వర్కౌట్, కంటి నిండా నిద్ర, నీరు తాగడం, ఒత్తిడి లేకుండా చూసుకోవడం. ఇలా ప్రతి విషయంలోనూ జాగ్రత్తలు తీసుకోవడం వల్ల త్వరగా బరువు తగ్గుతారని గుర్తుపెట్టుకోండి.

Also Read:  Holi: హోలీ రోజున 5 వస్తువులను మీ ఇంటికి తెచ్చుకోండి


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • benefits
  • Faster
  • food
  • health
  • Life Style
  • loss
  • tips
  • Tricks
  • Try
  • Vegetables
  • weight

Related News

Here is how you can tell if someone truly loves you!

True Love: ఒక వ్యక్తికి మీ మీద నిజంగా ప్రేమ ఉందో లేదో ఇలా తెలుసుకోవచ్చు!

True Love: ఎవరైనా మిమ్మల్ని నిజంగా ప్రేమిస్తే అది మీకు తెలిసిపోతుంది. ఎందుకంటే వారు ఎల్లప్పుడూ మీ కోసం ఉంటారు. మీరు ఎవరైనప్పటికీ మిమ్మల్ని ప్రేమించే వారు ఎల్లప్పుడూ మీకు మద్దతు ఇస్తారు. ఎవరైనా మిమ్మల్ని నిజంగా ప్రేమిస్తే ఆ వ్యక్తి మిమ్మల్ని బాధపెట్టే లేదా మీకు నచ్చనిది ఏమీ చేయరు. నిజమైన ప్రేమగల (True Love) వ్యక్తి మీ కోసం ఎల్లప్పుడూ సమయాన్ని వెతుకుతాడు. అతను ఎంత బిజీగా ఉన్నప్పటిక

  • 7 Tips to Curb Insomnia for Stress Management

    Stress Management Tips: స్ట్రెస్ మేనేజ్‌మెంట్ కోసం.. నిద్రలేమిని అరికట్టే 7 టిప్స్

Latest News

  • Vastu Tips: ఇంట్లో అరటి చెట్టు నాటితే అశుభమా..? శాస్త్రం ఏం చెబుతోంది..!!

  • Cigarette Alert: ఇప్పుడు బాక్స్‌పై కాదు, ప్రతి సిగరెట్‌పై హెచ్చరిక.. ఎక్కడంటే?

  • Harish Rao: బీజేపీతో టచ్‍లో హరీశ్ రావు : రేవంత్ రెడ్డి

  • Donald Trump: ముంచుకొస్తున్న డెడ్‌లైన్.. ఇరాన్‎కు ట్రంప్ మాస్ వార్నింగ్

  • Bhagyashri Borse: ఎట్టకేలకు హిట్ కొట్టిన అందాల భామ భాగ్యశ్రీ బోర్సే

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd