Constipation: మలబద్దకం సమస్యతో ఇబ్బంది పడుతున్నారా.. అయితే ఈ చిట్కాలు పాటించాల్సిందే!
మలబద్ధకంతో ఇబ్బంది పడే వారు కొన్ని రకాల చిట్కాలను పాటించాలని చెబుతున్నారు.
- Author : Anshu
Date : 27-09-2024 - 3:00 IST
Published By : Hashtagu Telugu Desk
ప్రస్తుత రోజుల్లో చాలా మంది మలబద్ధకం సమస్యతో బాధపడుతున్న విషయం తెలిసిందే. చాలామంది ఈ మలబద్ధకం సమస్యతో బాధపడుతున్నారు. చిన్నపిల్లల నుంచి పెద్ద వారి వరకు చాలామంది ఈ సమస్యతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న విషయం తెలిసిందే. ఆహారంలో మార్పుల కారణంగా, జీవనశైలిలో మార్పుల కారణంగా మలబద్ధకంతో ఇబ్బందిపడుతున్నారు. ఈ సమస్య బారిన పడగానే చాలా మంది వైద్యులను సంప్రదిస్తుంటారు. కొన్ని కొన్ని సార్లు ఈ సమస్య మరింత తీవ్రం అయ్యి ఆపరేషన్ చేయించుకునే వరకు కూడా వెళుతూ ఉంటుంది.
అలాగే ఈ సమస్య నుంచి బయటపడడానికి రకరకాల మందులను వాడుతుంటారు. అయితే ఇందుకోసం కొన్ని రకాల ఆహర పదార్థాలు తినాలని చెబుతున్నారు. ఆ ఆహార పదార్థాలు ఏవి అన్న విషయానికి వస్తే.. ప్రతిరోజు నారింజ తినాలి. ఇందులో విటమిన్ సి తో పాటు ఫైబర్ కూడా పుష్కలంగా ఉంటుంది. అలాగే పాలలో కొన్ని ఖర్జూరాలను నానబెట్టి గుజ్జులాగా చేసి పాలతో కలిపి వారం రోజులు పాటు తీసుకుంటే మలబద్ధకం నుంచి ఉపశమనం లభిస్తుందని చెబుతున్నారు. త్రిఫల చూర్ణం తేనెతో రోజుకి రెండుసార్లు తీసుకుంటే చాలా మంచిదట. పడుకునే ముందు ఒక గ్లాసు వేడి పాలలో ఒక టీ స్పూన్ నెయ్యి కలిపి తీసుకోవటం వలన మలబద్ధకం నివారించవచ్చట.
అలాగే ఒక అర గ్లాసు బచ్చలిరసాన్ని ఆరు గ్లాసు నీటిలో కలిపి రోజుకి రెండుసార్లు రెండు మూడు రోజులు పాటు తాగాలట. ఇది తీవ్రమైన మలబద్ధకం నుంచి కూడా మిమ్మల్ని రక్షిస్తుందని చెబుతున్నారు. మలబద్ధకానికి ప్రధాన కారణం ప్రేగులకు సరియైన కదలికలు లేకపోవడం. కాబట్టి ప్రేగు కదలికలను మెరుగుపరచడానికి శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచడానికి రోజు కనీసం మూడు లీటర్ల నీళ్లు తాగాలని చెబుతున్నారు. అలాగే రెగ్యులర్ గా శారీరక వ్యాయామము, ప్రాణాయామము, యోగ చేయటం వలన కూడా ప్రేగు కదలిక చురుగ్గా ఉంటుంది. అలాగే మలబద్ధకం నుండి ఉపశమనం పొందటానికి పవన్ ముక్తాసనం, బాలాసనం, అర్ధమత్యేంద్రాశనం సుప్త వజ్రాసనం వంటి ఆసనాలు చేయటం వలన సులువుగా మలబద్ధకం సమస్యకు చెక్ పెట్టవచ్చని చెబుతున్నారు. ఈ విధమైన చిట్కాలు పాటిస్తే మలబద్ధకం సమస్య నుంచి పూర్తిగా ఉపశమనం పొందవచ్చు అని చెబుతున్నారు.