Urine Infections: వేసవిలో పదేపదే యూరిన్ ఇన్ఫెక్షన్ ఇబ్బంది పెడుతోందా.. అయితే వెంటనే ఇలా చేయండి?
వేసవిలో యూరిన్ ఇన్ఫెక్షన్ ఇబ్బంది పెడుతున్నప్పుడు ఏం చేయాలో ఎలాంటి చిట్కాలు పాటించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
- By Anshu Published Date - 04:06 PM, Fri - 7 March 25

వేసవికాలంలో వచ్చింది అంటే చాలు చాలా మంది యూరిన్ ఇన్ఫెక్షన్ గురించి భయపడుతూ ఉంటారు. ఎండ వేడి కారణంగా యూరిన్ ఇన్ఫెక్షన్ వస్తూ ఉంటుంది. దీనినే కొన్ని ప్రదేశాలలో పైకాయి, పైసరుకు చేసుకుంది అని కూడా అంటూ ఉంటారు. ఈ సమస్య ఉన్నప్పుడు రాత్రిళ్ళు మొత్తం పదేపదే యూరిన్ కి వెళ్లాల్సి వస్తూ ఉంటుంది. ముఖ్యంగా వేసవిలో ఎండకు ఎక్కువగా ఉన్నప్పుడు ఈ సమస్య ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. యూరిన్ ఇన్ఫెక్షన్ కి కారణం శరీరానికి తగినంత నీరు తీసుకోకపోవడం వల్ల యాసిడ్ రిలీజ్ అవుతాయి. దీని కారణంగా మంట, నొప్పి వంటి సమస్యలు కలుగుతాయి.
ముఖ్యంగా వేసవికాలంలో ఈ సమస్య వేధిస్తుంటుంది. అయితే ఈ సమస్యకు నుంచి ఉపశమనం పొందాలి అంటే మొదటి పని అధికంగా నీరు తీసుకోవాలి. అలాగే వేడి చేసే ఆహారాలు తీసుకోకుండా ఉండడం మంచిది. వీటికి బదులుగా కొబ్బరి నీళ్లు, మజ్జిగ, బార్లీ నీళ్లు, సబ్జా నీళ్లు వంటివి తీసుకోవడం వల్ల మూత్రం సమయంలో మంట కలిగే సమస్య తగ్గుతుందట. మూత్రం వచ్చినప్పుడు వెంటనే మూత్ర ఖాళీ చేయాలి. ఎక్కువ సేపు మూత్రాన్ని ఉంచడం వల్ల బ్యాక్టీరియా పెరుగుదలకు అనువైన వాతావరణం ఏర్పడుతుందట. మీరు మూత్ర విసర్జన తర్వాత లైంగిక కార్యకలాపాల తర్వాత ఎల్లప్పుడూ ముందు వెనుక భాగాలను శుభ్రం చేసుకోవడం చాలా అవసరం అని చెబుతున్నారు.
అంతేకాకుండా ఆల్కహాల్ కూడా తీసుకోవడం మానుకోవాలట. దీని వల్ల కూడా యూరిన్ మంట కలిగిస్తుందట. మీరు తరచు కాఫీ, టీలు ఎక్కువగా తీసుకుంటే వాటికి కూడా దూరంగా ఉండటం చాలా మంచిదని ముఖ్యంగా వేసవిలో వాటికి మరింత దూరంగా ఉండటం మంచిది అని చెబుతున్నారు. లేకుంటే శరీరం డిహైడ్రేషన్ బారిన పడే ప్రమాదం ఉంటుంద. మీరు వేసవికాలంలో కాటన్ దుస్తులు ధరించడం చాలా ముఖ్యం దీనివల్ల శరీరంలో ఉండే చెమట బయటకి పోతుందట. మీరు ఎల్లప్పుడూ శరీరాన్ని శుభ్రతగా ఉంచడం చాలా అవసరం. రోజుకి రెండు సార్లు స్నానం చేయడం ఉత్తమం అని చెబుతున్నారు. ఉతికిన బట్టలను వేసుకోవాలి అలాగే కాళ్లు చేతులు, మోకాలు వరకు కడుక్కోవాలి. ఈ విధంగా మీరు యూరిన్ ఇన్ఫెక్షన్ సమస్యలను తగ్గించవచ్చట. దీంతోపాటు మీరు ఆరోగ్యకరమైన ఆహారాలను తీసుకోవడం అత్యంత ముఖ్యం అందులో ముఖ్యంగా బార్లీ ఇంకా స్ట్రాబెరీ పదార్థాలను తీసుకోవడం చాలా మంచి ఇది యూరినరీ ఇన్ఫెక్షన్ లోనే తగ్గిస్తాయని చెబుతున్నారు. పైన చెప్పిన చిట్కాలు పాటించినప్పటికీ యూరిన్ ఇన్ఫెక్షన్లు ఎక్కువగా ఇబ్బంది పెడుతుంటే వెంటనే వైద్యుని సంప్రదించడం మంచిది.