Thyroid: థైరాయిడ్ సమస్య ఉన్నవారు ఉప్పు తినకూడదా.. ప్రత్యామ్నాయంగా ఏం తీసుకోవాలో తెలుసా?
థైరాయిడ్ సమస్యతో బాధపడేవారు ఉప్పు తీసుకోవచ్చా తీసుకోకూడదా, ఒకవేళ తీసుకుంటే ఏం జరుగుతుందో ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
- By Anshu Published Date - 03:04 PM, Sat - 22 March 25

ప్రస్తుత రోజుల్లో చాలామంది ఇబ్బంది పడుతున్న సమస్యల్లో థైరాయిడ్ కూడా ఒకటి. ప్రతి పదిమందిలో ఇద్దరు ఈ థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ థైరాయిడ్ అనేది మెడ యొక్క ముందు భాగంలో కనిపించో ఒక చిన్న సీతాకోకచిలుక లాంటి ఆకారపు గ్రంథి అన్న విషయం తెలిసిందే. ఇది జీవ క్రియ పెరుగుదలను అభివృద్ధిని నియంత్రించే హార్మోన్లను ఉత్పత్తి చేయడం వంటి ముఖ్యమైన పనులను చేస్తుంది. కాబట్టి ఇది శరీర ఎండోక్రైన్ వ్యవస్థకు చాలా అవసరం అని చెబుతున్నారు. అయితే ఈ గ్రంథికి ఉప్పు ప్రమాదాన్ని కలిగిస్తుందట. అందుకే థైరాయిడ్ ఉన్నవాళ్లు ఉప్పు తినకూడదు అని చెబుతున్నారు.
మరి ఒకవేళ థైరాయిడ్ ఉన్నవారు ఉప్పు తినకూడదు అనుకుంటే దానికి బదులుగా ఏం తినాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. థైరాయిడ్ గ్రంథి సరిగ్గా పనిచేయడానికి తగినంత ఉప్పు తీసుకోవడం చాలా ముఖ్యం. థైరాయిడ్ గ్రంథి సరిగ్గా పనిచేయడానికి అయోడిన్ అవసరం, కాబట్టి థైరాయిడ్ రోగులు ఎల్లప్పుడూ అయోడైజ్డ్ ఉప్పు తీసుకోవాలి. ఈ ఉప్పు సాధారణంగా శుద్ధి చేసిన టేబుల్ సాల్ట్ రూపంలో లభిస్తుంది. దానికి అయోడిన్ కలుపుతారు. అయోడైజ్డ్ ఉప్పు థైరాయిడ్ గ్రంథి సరిగ్గా పనిచేయడానికి సహాయపడుతుందట. ఇది హైపోథైరాయిడిజం ప్రమాదాన్ని తగ్గిస్తుంది. థైరాయిడ్ హార్మోన్ల ఉత్పత్తిలో అయోడిన్ ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని, దీని లోపం వల్ల గాయిటర్ వంటి సమస్యలు వస్తాయని చెబుతున్నారు.
అయోడిన్ అవసరాన్ని తీర్చడానికి అయోడైజ్డ్ ఉప్పు చాలా అవసరం అని చెబుతున్నారు. కాగా థైరాయిడ్ రోగులు ఈ ఉప్పును తినకూడదట. థైరాయిడ్ రోగులు హిమాలయన్ పింక్ సాల్ట్ తినకుండా ఉండాలని చెబుతున్నారు. హిమాలయన్ పింక్ సాల్ట్‌లో అయోడిన్ పరిమాణం చాలా తక్కువగా ఉంటుంది. పరిమిత పరిమాణంలో అయోడిన్ తీసుకోవాలని సూచించబడిన వారికి ఈ ఉప్పు మరింత ఉపయోగకరంగా ఉంటుందట. హిమాలయన్ పింక్ సాల్ట్ హైపర్ థైరాయిడిజానికి మంచి మూలం అని చెబుతున్నారు. థైరాయిడ్ కు సముద్రపు ఉప్పు కూడా సిఫారసు చేయబడలేదు. ఇందులో సహజంగానే అయోడిన్ తక్కువగా ఉంటుందట. ఇది హైపర్ థైరాయిడిజంతో బాధపడేవారికి కూడా మంచిది కావచ్చని,కానీ అయోడిన్ లోపం ఉన్నవారికి కాదని చెబుతున్నారు.