HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Health
  • >Those Who Have These Problems Should Try Drinking Bottle Gourd Juice Daily

Bottle Gourd Juice : ఈ సమస్యలు ఉన్నవాళ్లు రోజూ సొరకాయ జ్యూస్ తాగి చూడండి.

సొరకాయను కూరగా తీసుకోవడం కంటే జ్యూస్‌ (Juice) గా తీసుకుంటే అద్భుతమైన

  • By Maheswara Rao Nadella Published Date - 06:00 AM, Sun - 1 January 23
  • daily-hunt
Bottle Gourd Juice
Bottle Gourd Juice

సొరకాయలో (Bottle Gourd) పోషకాలు పుష్కలంగా ఉంటాయి. సొరకాయను కూరగా తీసుకోవడం కంటే.. జ్యూస్‌గా తీసుకుంటే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. క్రమం తప్పకుండా సొరకాయ జ్యూస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తీసుకుంటే.. అరోగ్య సమస్యలు దూరం అవుతాయని ఆయుర్వేద వైద్యురాలు దీక్షా భావ్‌సర్‌ అన్నారు.

సొరకాయ పేరు చెబితేనే కొంతమంది ముఖం చిట్లించుకుంటారు. సొరకాయ కూర తినడానికి అంతగా ఇష్టపడరు. కానీ, సొరకాయలోని పోషక విలువలు గురించి తెలిస్తే మాత్రం దానిని వదిలిపెట్టరు. సొరకాయలో విటమిన్ సి, బి, రైబోఫ్లేవిన్, జింక్, థయమిన్, ఇనుము, మెగ్నీషియం, మాంగనీస్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. శరీరానికి హాని చేసే కొవ్వు ఇందులో ఉండదు. బరువు తగ్గాలనుకునే వారికి సొరకాయ బెస్ట్‌ ఆప్షన్. దీనిలో ఉండే అధికంగా ఉండే పీచు జీర్ణవ్యవస్థకు మేలు చేస్తుంది. సొరకాయను కూరగా తీసుకోవడం కంటే.. జ్యూస్‌గా తీసుకుంటే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. క్రమం తప్పకుండా సొరకాయ జ్యూస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (Bottle Gourd Juice) తీసుకుంటే.. అరోగ్య సమస్యలు దూరం అవుతాయని ఆయుర్వేద వైద్యురాలు దీక్షా భావ్‌సర్‌ అన్నారు.

హైపర్‌ టెన్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కంట్రోల్‌లో ఉంటుంది:

Hypertension: 12 home remedies to beat high blood pressure | Hypertension  News – India TV

సొరకాయ జ్యూస్‌ క్రమం తప్పకుండా తాగితే.. హైపర్‌టెన్షన్‌ కంట్రోల్‌లో ఉంటుందని ఆయుర్వేద వైద్యురాలు దీక్షా భావ్‌సర్‌ అన్నారు. సొరకాయలో ఉండే.. పొటాషియం రక్తపోటును కంట్రోల్‌లో ఉంచుతుంది. హైపర్‌టెన్షన్‌తో బాధపడేవారు.. పరగడుపున సొరకాయ జ్యూస్‌ తాగితే బీపీ కంట్రోల్‌లో ఉంటుంది. దీనిలో కొద్ది మొత్తంలో లభించే సూక్ష్మ పోషక ఖనిజాలు గుండె జబ్బులు రాకుండా చూస్తాయి.

శరీరం నుంచి వ్యర్థాలను తొలగిస్తుంది:

Seven body organs you can live without

సొరకాయ జ్యూస్‌ న్యాచురల్‌ క్లెన్సర్‌గా పనిచేస్తుంది. ఇది తాగితే.. శరీరం నుంచి విష పదార్థాలు తొలగుతాయి. ఈ జ్యూస్‌తో అవయవాల పనితీరు మెరుగుపడుతుంది.

శ్వాసకోశ సమస్యలు దూరం అవుతాయి:

Breathing Problems Symptoms, Risk Factors, Diagnosis and Treatment |  Narayana Health

సొరకాయ వాత, పిత్త దోషాలను సమతుల్యం చేస్తుంది. దీనిని అల్సర్‌, జ్వరం, నొప్పులను, శ్వాసకోసం సమస్య చికిత్సలో ఉపయోగిస్తారు. యూరినరీ ఇన్ఫెక్షన్స్‌కి చాలా ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది. యూరిన్‌లో ఉండే యాసిడ్ కంటెంట్‌ని బాలెన్స్ చేయడం ద్వారా ఇన్ఫెక్షన్ తగ్గుతుంది.

బరువు తగ్గుతారు:

How to Lose Weight, Mathematically | by Jørgen Veisdal | Cantor's Paradise

ఈ జ్యూస్ ఆకలిని తగ్గిస్తుంది. మెటబాలిజంను మెరుగుపరుస్తుంది. దీంతో.. బరువు తగ్గడం తేలికవుతుంది. శరీరంలోని క్యాలరీలను అతి సులభంగా తగ్గిస్తుంది.

అందానికీ మేలు చేస్తుంది:

Trending news: Bottle gourd Side effects: Bottle gourd juice is 'poison'  for health, Tahira kashyap's life was in trouble after drinking - Hindustan  News Hub

సొరకాయ జ్యూస్‌ ఆరోగ్యానికే కాదు.. అందానికీ మేలు చేస్తుంది. సొరకాయ జ్యూస్ తరచూ తీసుకుటే.. తెల జుట్టు, ముడతల సమస్య దూరం అవుతాయి. ఈ రసాన్ని తలకు అప్లై చేస్తే.. జుట్టు రాలడం, నెరవడం సమస్యలు పరిష్కారం అవుతాయి.

ఎలా తయారు చేసుకోవాలి?

ఇవి తీసుకోండి:

🍲 సొరకాయ – మీడియం సైజ్

🍲 పుదీనా ఆకులు – పది

🍲 అల్లం – అరంగుళం ముక్క

🍲 నిమ్మకాయ – ఒకటి

🍲 బ్లాక్‌ సాల్ట్‌ – రుచికి సరిపడా

సొరకాయ తొక్కతీసి శుభ్రంగా కడిగి ముక్కలుగా తరిగి బ్లెండర్‌లో వేయాలి. దీనిలోనే తొక్కతీసిన అల్లం, పుదీనా, రుచికి సరిపడా బ్లాక్‌సాల్ట్ వేసి మెత్తగా గ్రైండ్‌ చేయాలి. గ్రైండ్‌ అయిన మిశ్రమాన్ని పలుచని వస్త్రంలో వడగట్టి జ్యూస్‌ను తీసుకోవాలి. ఈ జ్యూస్‌లో నిమ్మరసం పిండి తాగండి.

వీళ్లు తాగకూడదు:

They Should Not Drink Bottle Gourd Juice

మీరు కడుపు, పేగులకు సంబంధించిన సమస్యతో బాధపడుతుంటే.. పచ్చి సొరకాయ జ్యూస్‌ తాగకూడదు. మీరు ముందుగా సొరకాయను ఉడకబెట్టి జ్యూస్‌ చేసుకోవడం మంచిది. కొంతమందికి పచ్చి సొరకాయ జీర్ణకావడం కష్టం అవుతుంది. దీని దృష్టిలో ఉంచుకుని సొరకాయ ఉడకబెట్టడం మంచిది.

Also Read:  New Year Gifts 2023 : ఈ టెక్ గాడ్జెట్స్‌ ని న్యూ ఇయర్ గిఫ్ట్స్ గా ఇవ్వండి…


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • benefits
  • Bottle gourd
  • health
  • Juice
  • Life Style

Related News

Fatty Liver

Fatty Liver: ఫ్యాటీ లివర్ సమస్యకు ఈ ఆహారాలతో చెక్ పెట్టండి!

సరైన ఆహార నియమాలతో ఈ సమస్యను సులభంగా దూరం చేసుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ఫ్యాటీ లివర్‌ను తగ్గించడంలో అద్భుతంగా పనిచేసే కొన్ని వంటింటి చిట్కాలను ఈరోజు మ‌నం తెలుసుకుందాం.

  • Talcum Powder

    Talcum Powder: టాల్కమ్ పౌడర్‌తో పిల్లలకు ప్రమాదమా?

Latest News

  • Mega Job Mela: నిరుద్యోగ యువ‌త‌కు శుభ‌వార్త‌.. సింగరేణి సహకారంతో మెగా జాబ్‌ మేళా!

  • India vs Australia: తొలి వ‌న్డేలో భార‌త్ ఘోర ఓట‌మి.. 1-0 ఆధిక్యంలోకి ఆస్ట్రేలియా!

  • WhatsApp: వాట్సాప్‌లో స్పామ్, అనవసర మెసేజ్‌లకు ఇక చెక్!

  • Air Pollution: వాయు కాలుష్యం.. గర్భంలో ఉన్న శిశువు మెదడుపై తీవ్ర ప్రభావం!

  • Confirm Ticket: ఐఆర్‌సీటీసీతో ఇబ్బంది ప‌డుతున్నారా? అయితే ఈ యాప్స్‌తో టికెట్స్ బుక్ చేసుకోవ‌చ్చు!

Trending News

    • Diwali: రేపే దీపావ‌ళి.. ఈ విష‌యాల‌ను అస్సలు మ‌ర్చిపోకండి!

    • Diwali: దీపావ‌ళి ఏ రోజు జ‌రుపుకోవాలి? లక్ష్మీ పూజ ఎలా చేయాలంటే?

    • Layoffs: ఉద్యోగాలు కోల్పోవ‌డానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కార‌ణ‌మా?!

    • RCB For Sale: ఆర్సీబీని కొనుగోలు చేయ‌నున్న అదానీ గ్రూప్‌?!

    • Diwali: దీపావ‌ళి రోజు ప‌టాకులు కాల్చుతున్నారా? అయితే ఈ వార్త మీకోస‌మే!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd