Bottle Gourd Juice : ఈ సమస్యలు ఉన్నవాళ్లు రోజూ సొరకాయ జ్యూస్ తాగి చూడండి.
సొరకాయను కూరగా తీసుకోవడం కంటే జ్యూస్ (Juice) గా తీసుకుంటే అద్భుతమైన
- Author : Maheswara Rao Nadella
Date : 01-01-2023 - 6:00 IST
Published By : Hashtagu Telugu Desk
సొరకాయలో (Bottle Gourd) పోషకాలు పుష్కలంగా ఉంటాయి. సొరకాయను కూరగా తీసుకోవడం కంటే.. జ్యూస్‌గా తీసుకుంటే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. క్రమం తప్పకుండా సొరకాయ జ్యూస్ తీసుకుంటే.. అరోగ్య సమస్యలు దూరం అవుతాయని ఆయుర్వేద వైద్యురాలు దీక్షా భావ్‌సర్ అన్నారు.
సొరకాయ పేరు చెబితేనే కొంతమంది ముఖం చిట్లించుకుంటారు. సొరకాయ కూర తినడానికి అంతగా ఇష్టపడరు. కానీ, సొరకాయలోని పోషక విలువలు గురించి తెలిస్తే మాత్రం దానిని వదిలిపెట్టరు. సొరకాయలో విటమిన్ సి, బి, రైబోఫ్లేవిన్, జింక్, థయమిన్, ఇనుము, మెగ్నీషియం, మాంగనీస్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. శరీరానికి హాని చేసే కొవ్వు ఇందులో ఉండదు. బరువు తగ్గాలనుకునే వారికి సొరకాయ బెస్ట్ ఆప్షన్. దీనిలో ఉండే అధికంగా ఉండే పీచు జీర్ణవ్యవస్థకు మేలు చేస్తుంది. సొరకాయను కూరగా తీసుకోవడం కంటే.. జ్యూస్‌గా తీసుకుంటే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. క్రమం తప్పకుండా సొరకాయ జ్యూస్ (Bottle Gourd Juice) తీసుకుంటే.. అరోగ్య సమస్యలు దూరం అవుతాయని ఆయుర్వేద వైద్యురాలు దీక్షా భావ్‌సర్ అన్నారు.
హైపర్ టెన్షన్ కంట్రోల్‌లో ఉంటుంది:

శరీరం నుంచి వ్యర్థాలను తొలగిస్తుంది:

శ్వాసకోశ సమస్యలు దూరం అవుతాయి:

బరువు తగ్గుతారు:

అందానికీ మేలు చేస్తుంది:

ఎలా తయారు చేసుకోవాలి?
ఇవి తీసుకోండి:
🍲 సొరకాయ – మీడియం సైజ్
🍲 పుదీనా ఆకులు – పది
🍲 అల్లం – అరంగుళం ముక్క
🍲 నిమ్మకాయ – ఒకటి
🍲 బ్లాక్ సాల్ట్ – రుచికి సరిపడా
సొరకాయ తొక్కతీసి శుభ్రంగా కడిగి ముక్కలుగా తరిగి బ్లెండర్‌లో వేయాలి. దీనిలోనే తొక్కతీసిన అల్లం, పుదీనా, రుచికి సరిపడా బ్లాక్‌సాల్ట్ వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. గ్రైండ్ అయిన మిశ్రమాన్ని పలుచని వస్త్రంలో వడగట్టి జ్యూస్‌ను తీసుకోవాలి. ఈ జ్యూస్‌లో నిమ్మరసం పిండి తాగండి.
వీళ్లు తాగకూడదు:

మీరు కడుపు, పేగులకు సంబంధించిన సమస్యతో బాధపడుతుంటే.. పచ్చి సొరకాయ జ్యూస్ తాగకూడదు. మీరు ముందుగా సొరకాయను ఉడకబెట్టి జ్యూస్ చేసుకోవడం మంచిది. కొంతమందికి పచ్చి సొరకాయ జీర్ణకావడం కష్టం అవుతుంది. దీని దృష్టిలో ఉంచుకుని సొరకాయ ఉడకబెట్టడం మంచిది.
Also Read: New Year Gifts 2023 : ఈ టెక్ గాడ్జెట్స్ ని న్యూ ఇయర్ గిఫ్ట్స్ గా ఇవ్వండి…