HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Health
  • >This Is The Right Time And Way To Eat The Mango Fruit

Mango Fruit: మామిడి పండ్లు తినడానికి సరైన సమయం ఎప్పుడు..? ఒక రోజులో ఎన్ని మామిడి పండ్లు తినొచ్చు..?

వేసవి కాలంలో ప్రజలు ఏదైనా పండు కోసం ఎక్కువగా ఎదురుచూస్తుంటే అది మామిడి (Mango Fruit) కోసమే. రుచితో కూడిన ఈ మామిడి పండు (Mango Fruit) మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.

  • Author : Gopi Date : 08-06-2023 - 8:52 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Mango Fruit
How to store Mangoes for more days

Mango Fruit: వేసవి కాలంలో ప్రజలు ఏదైనా పండు కోసం ఎక్కువగా ఎదురుచూస్తుంటే అది మామిడి (Mango Fruit) కోసమే. రుచితో కూడిన ఈ మామిడి పండు (Mango Fruit) మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అయితే మామిడి పండ్లను కూడా తినడానికి సరైన సమయం ఉందని మీకు తెలుసా? మామిడి పండ్లను ముందుగా తినాలన్నా, తర్వాత తినాలన్నా.. దీనికి కొన్ని నియమాలు కూడా ఉన్నాయి. ఈ విషయాన్ని డైటీషియన్లు కూడా అంగీకరిస్తున్నారు. కడుపు నొప్పి, చర్మం చిట్లకుండా ఉండేందుకు మామిడి పండ్లను తినడానికి సరైన సమయం, సరైన మార్గం ఏమిటో తెలుసుకుందాం.

పండ్లలో రారాజు మామిడి అని ఎందుకు అంటారు..?

పండ్లలో రారాజుగా పిలువబడే మామిడి అనేక ముఖ్యమైన పోషకాలకు అద్భుతమైన మూలం. నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం.. మామిడి పండ్లు ప్రోటీన్, ఫైబర్, విటమిన్ సి, కాపర్, ఫోలేట్, విటమిన్ B6, విటమిన్ A, విటమిన్ K, విటమిన్ E, నియాసిన్, పొటాషియం, రిబోఫ్లావిన్, మెగ్నీషియం, థయామిన్ ఉంది. పబ్‌మెడ్ సెంట్రల్ ప్రకారం.. సహజ చక్కెర మామిడిలో ఉంటుంది. ఇది మధుమేహ రోగులకు ప్రయోజనకరంగా ఉంటుంది. మీకు కూడా మధుమేహం ఉంటే మామిడి పండ్లను పరిమిత పరిమాణంలో తినండి.

మామిడి పండ్లు తినడానికి సరైన సమయం ఎప్పుడు?

పోషకాహార నిపుణుల అభిప్రాయం ప్రకారం.. “భోజనం తర్వాత” మామిడి పండ్లను తినడానికి సరైన సమయం. అంటే భోజనం తర్వాత కొంత సమయం. మామిడికాయను చిరుతిండిగా కూడా తినవచ్చు. ఈ రకంగా మామిడిని తీసుకోవడం ద్వారా మీ రక్తంలో గ్లూకోజ్ స్థాయి సాధారణంగా ఉంటుంది. ఖాళీ కడుపుతో మామిడి పండ్లను తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు వేగంగా పెరుగుతాయి. అందుకే ఉదయం పూట ఖాళీ కడుపుతో మామిడి పండ్లను తినకుండా ఉండేందుకు ప్రయత్నించాలి. మీరు ఏదైనా తిన్న తర్వాత మామిడి పండ్లను తింటే, దాని ప్రభావం మీ రక్తంలో చక్కెర స్థాయిపై తక్కువగా ఉంటుంది.

Also Read: Rudraksha: ఏ రుద్రాక్ష ధరిస్తే ఎటువంటి ఫలితం కలుగుతుందో మీకు తెలుసా?

తినడానికి ముందు మామిడి పండ్లను నీటిలో నానబెట్టండి

నిపుణుల ప్రకారం.. మామిడి పండ్లను మార్కెట్ నుండి కొనుగోలు చేసిన వెంటనే తినకూడదు ఎందుకంటే మామిడిలో ఫైటిక్ యాసిడ్ అనే సహజ అణువు ఉంటుంది. మామిడికాయను తినడానికి ముందు కనీసం అరగంట నుండి 1 గంట వరకు నీటిలో నానబెట్టాలి. ఫైటిక్ యాసిడ్ అధికంగా తీసుకోవడం ఆరోగ్యానికి హానికరం. మామిడికాయను నీళ్లలో వేసి కాసేపు అలాగే ఉంచితే ఆ నీరు అదనపు ఫైటిక్ యాసిడ్‌ని పీల్చుకుంటుంది.

ఒక రోజులో ఎన్ని మామిడి పండ్లు తినాలి..?

నిపుణుల ప్రకారం.. పగటిపూట మొత్తం మామిడికాయను తినడానికి బదులుగా ఒక మామిడిని రెండు భాగాలుగా విభజించి చిరుతిండిగా తినడం మంచిది. ఇందులో ఫ్రక్టోజ్ ఎక్కువగా ఉండటం వల్ల బ్లడ్ షుగర్ లెవెల్ ను మెయింటెయిన్ చేస్తుంది.

రాత్రి భోజనం చేసిన తర్వాత మామిడి పండ్లు తినకూడదు

పోషకాహార నిపుణుల అభిప్రాయం ప్రకారం.. రాత్రి భోజనం తర్వాత మామిడిని ఎప్పుడూ డెజర్ట్‌గా తీసుకోకూడదు. రాత్రిపూట మామిడి పండ్లను తినడం ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదు. ఇది రక్తంలో చక్కెర స్థాయిని వేగంగా పెంచుతుంది. దీని కారణంగా మధుమేహం వచ్చే ప్రమాదం పెరుగుతుంది. కాబట్టి రాత్రి భోజనం తర్వాత మామిడి తినడం డయాబెటిక్ రోగులకు మరింత ప్రమాదకరం.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Health News
  • lifestyle
  • Mango Fruit
  • Mango Overeating
  • Mango Uses

Related News

    Latest News

    • CM Vijay: సీఎంకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు

    • Weight Loss: సడెన్‌గా బరువు తగ్గారా..?

    • CM Joseph Vijay: మీ విజయ్‌ మామ అండగా ఉంటాడు : సీఎం విజయ్‌

    • Cm Vijay: తొలి సంతకం ఉచిత విద్యుత్ పై సీఎం విజయ్

    • TVK Vijay: సీఎం‌గా దళపతి విజయ్ ప్రమాణస్వీకారం… హాజరైన ప్రముఖులు

    Trending News

      • TVK విజయ్‌ అను నేను..

      • CM VIJAY: టీవీకేకు వీసీకే మద్దతు: ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్

      • CM Vijay Thalapathy: ప్రభుత్వ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్..!

      • Tamil Nadu Politics: విజయ్ను ముప్పుతిప్పలు పెడుతున్న VCK.. డిప్యూటీ సీఎం పదవి ఇస్తేనే

      • Cm Thalapathy Vijay: విజయ్‌కి లైన్ క్లియర్!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd