Iron Deficiency: ఐరన్ లోపం లక్షణాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకుంటే ఆరోగ్యమే ఆరోగ్యం!
ప్రస్తుత కాలంలో చాలామంది జీవనశైలిలో కలిగే మార్పుల కారణంగా ఐరన్ లోపంతో ఎక్కువగా బాధపడుతున్నారు. మరి
- By Anshu Published Date - 03:32 PM, Tue - 9 August 22

ప్రస్తుత కాలంలో చాలామంది జీవనశైలిలో కలిగే మార్పుల కారణంగా ఐరన్ లోపంతో ఎక్కువగా బాధపడుతున్నారు. మరి ముఖ్యంగా పురుషులతో పోల్చుకుంటే స్త్రీలు ఎక్కువగా ఐరన్ లోపంతో బాధపడుతున్నారు. ఈ ఐరన్ లోపం కారణంగా బలహీనంగా ఉండడం, శరీరంలో రక్తం తగ్గిపోవడం, రక్తహీనత , హిమోగ్లోబిన్ తగ్గిపోవడం వలన జుట్టు రాలడం, నీరసం, అలసట, నిద్రలేమి, ఒత్తిడి వంటి సమస్యలు అన్ని కూడా ఐరన్ లోపం వలన కలుగుతాయి. కేవలం ఇవి మాత్రమే కాకుండా ఇంకా ఐరన్ లోపం నా సమస్యలు వస్తూ ఉంటాయి.
అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.. ఐరన్ లోపం ఉన్నవారు చిన్న చిన్న పనులకే ఎక్కువగా అలిసిపోతూ ఉంటారు. అలాగే ఉన్నవారు ఎక్కువగా చికాకుగా కనిపించడం, మనిషి బలహీనంగా మారడం, కుదరకపోవడం వంటివి కూడా ఐరన్ లోపం లక్షణాలే. నిద్రలో కాళ్లు అదే పనిగా కదిలించడం, దురదలు రావడం, మెదడులోని రక్త కణాలు ఉంటే తలనొప్పిగా అనిపించడం వంటివి ఐరన్ లోపం లక్షణాలు. అలాగే ఐరన్ లోపం ఉన్నవారిలో గుండె వేగంగా కొట్టుకుంటుంది. ఐరన్ లోపం ఉన్నవారు చిన్న చిన్న విషయాలకే ఎక్కువగా ఆందోళన చెందుతూ టెన్షన్ పడుతూ ఉంటారు.
అలాగే ఐరన్ లోపం వల్ల థైరాయిడ్ గ్రంథి పనితీరు కూడా మందగిస్తుంది. దానివల్ల హైపోథారాయిడిజమ్ అనే సమస్య తలెత్త వచ్చు. అలాగే బరువు పెరుగుతుండడం, శరీరం చల్లగా అనిపించడం, జుట్టు ఊడడం, చర్మం పాలిపోవడలోపం నాలుక పై మంట పుట్టడం వంటివీ ఐరన్ లక్ష్మణాలు.