Foods: ఈ ఫుడ్స్ ఆల్కహాల్ కంటే ప్రమాదమని మీకు తెలుసా?
ఆల్కహాల్ కంటే కొన్ని రకాల ఫుడ్స్ చాలా డేంజర్ అని వాటిని తక్కువగా తీసుకోవాలని చెబుతున్నారు.
- By Anshu Published Date - 12:45 PM, Mon - 2 September 24

ఆల్కహాల్ ఆరోగ్యానికి హానికరం అన్న విషయం మనందరికి తెలిసిందే. అందుకే మద్యం సేవించకూడదు అని చెబుతూ ఉంటారు. అయితే మీకు తెలుసా మనం తినే కొన్ని రకాల ఆహార పదార్థాలు ఆల్కహాల్ కంటే డేంజరట. ఇంతకీ ఆ ఆహార పదార్థాలు ఏవో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఎక్కువ మార్గాల్లో శరీరాన్ని ప్రభావితం చేసే పదార్థాం సోడియం. దీనిని అధికంగా తీసుకోవడం వల్ల అధిక రక్తపోటు వస్తుంది. ఇది గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుందట. సోడియం తీసుకోవడం కూడా కాలేయానికి హానికరంఅని చెబుతున్నారు.
ఉప్పులో సోడియం ఉంటుంది కాబట్టి ఉప్పు తీసుకోవడం తగ్గించాలట. అదనపు ఉప్పు ఎముకలను కరిగించే సామర్థ్యాన్ని కలిగి ఉంటుందట. అలాగే చక్కెరను ఉపయోగించే చేసిన అనేక రకాల స్వీట్ ఐటమ్స్ మార్కెట్లో ఎన్నో ఉన్నాయి. చాలామంది చక్కెరతో తయారు చేసిన స్వీట్స్ ని ఎక్కువగా తింటూ ఉంటారు. అయితే చక్కెరను ఎక్కువగా తీసుకోవడం వల్ల విపరీతంగా బరువు పెరగడంతో పాటు కొవ్వు స్థాయిల సమస్య కూడా పెరుగుతుందని చెబుతున్నారు. అందుకే చక్కెరను తక్కువగా తీసుకోవాలట. అలాగే ప్రాసెస్ చేసిన మాంసాలలో అధిక మొత్తంలో సోడియం, నైట్రేట్లు ఉంటాయి. రెండూ ఆరోగ్యానికి హానికరం. ఈ రెండింటిని అధికంగా తీసుకోవడం వల్ల శరీరం తీవ్రమైన వ్యాధులకు లోనవుతుంది.
కాబట్టి వీలైనంతవరకు ప్రాసెస్ చేసిన మాంసాహారాలను తీసుకోవడం మానేయాలి. ఈ రోజుల్లో బయట ఏదైనా తింటే దానితో పాటు శీతల పానీయాలు కూడా తీసుకుంటున్నాము. శీతల పానీయాలు ప్రతిరోజూ తాగితే, ఫ్యాటీ లివర్ వచ్చే ప్రమాదం ఉందట. అందుకే శీతల పానీయాలకు బదులు తాజా పండ్ల రసాలు తాగడం మంచిదని చెబుతున్నారు. అలాగే చల్లగా లేని, చక్కెర ఎక్కువగా లేని జ్యూస్ తాగమని సూచిస్తున్నారు.
note: ఈ ఆరోగ్య సమాచారం ఇంటర్నెట్ నుంచి సేకరించబడినది. ఇందులో ఎటువంటి సందేహాలు ఉన్న వైద్యుల సలహా తీసుకోవడం మంచిది.