Belly Fat: వీటిని తింటే చాలు.. ఎలాంటి పొట్ట అయినా సరే ఈజీగా కరిగిపోవాల్సిందే!
అధిక బరువు, బాణ లాంటి పొట్ట సమస్యతో ఇబ్బంది పడుతున్న వారు ఇప్పుడు చెప్పబోయే ఆహార పదార్థాలను తీసుకుంటే చాలు అని చెబుతున్నారు.
- By Anshu Published Date - 01:00 PM, Tue - 4 March 25

ప్రస్తుత రోజుల్లో చాలామంది అధిక బరువు, బాణలాంటి పొట్ట వంటి సమస్యలతో బాధపడుతున్న విషయం తెలిసిందే. అయితే బరువు పెరగాలి అనుకున్న వారు పొట్ట పడకుండా లావు కావాలని అనుకుంటూ ఉంటారు. ఇప్పటికే పొట్ట వచ్చిన వారు ఎలా తగ్గించుకోవాలో ఏం చేయాలా అని తెగ ఆలోచిస్తూ ఉంటారు. మరి బాణ లాంటి పొట్ట తగ్గాలి అంటే ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
ఉదయం పూట నూనెతో తయారు చేసిన పూరీలు దోశలు చపాతీ వంటి వాటిక బదులుగా ఓట్స్ తీసుకోవాలని చెబుతున్నారు. ఓట్స్ రక్తంలో చక్కెర స్థాయిలను కంట్రోల్ లో ఉంచుతాయట. శరీరానికి తక్షణ శక్తిని అందించడంతో పాటు ఎక్కువ సమయం ఆకలి వేయదని చెబుతున్నారు. ఓట్స్ తీసుకునేటప్పుడు అందులో చక్కెరకు బదులుగా ఏవైనా తాజా పండ్ల ముక్కలు, రసాలు కలిపితే సహజ చక్కెర్లు అందుతాయి. దీంతో బెల్లీ ఫ్యాట్ కరుగుతుందట.
అదేవిధంగా గుడ్డులో కూడా ప్రోటీన్ అధికంగా ఉంటుంది. ఈ ప్రోటీన్ పొట్ట పేరుకుపోయిన కొవ్వును ఈజీగా కరిగిస్తుంది. ముఖ్యంగా గుడ్డులోని తెల్లసొనలో విటమిన్ డి విటమిన్లు ఒమేగా 3, ఫ్యాటీ ఆసిడ్స్ మెండుగా ఉంటాయి. ఇవి బరువు తగ్గించడానికి కీలకపాత్ర పోషిస్తాయట. కాబట్టి ప్రతిరోజు మీ డైట్ లో గుడ్డు ఉండేలా చూసుకోవాలి.
గ్లాసు నీటిలో స్పూన్ యాపిల్ సైడర్ వెనిగర్ కలిపి తాగాలి. ఇలా చేస్తే పొట్ట చుట్టూ ఉన్న కొవ్వు తగ్గడమే కాకుండా రక్తంలో చక్కెర స్థాయిలను కూడా నియంత్రింస్తుందట.
ఉదయం ఖాళీ కడుపుతో గ్లాసు గోరువెచ్చని నీళ్లను తాగడం అలవాటు చేసుకోవాలి. ఇవి జీర్ణ ప్రక్రియను వేగవంతం చేస్తాయట. అలాగే మెటబాలిజం రేటుని పెంచుతాయట. పొట్ట కూడా ఈజీగా తగ్గుతుందని చెబుతున్నారు.
ఆకలిగా అనిపించినప్పుడు స్వీట్స్, ఇతర చిరుతిళ్లో తినే బదులు పండ్లు తీసుకోవడం మంచిదట. పండ్లలో చక్కెర, కొవ్వు తక్కువగా ఉంటాయి. పోషకాలూ ఎక్కువగా అందుతాయి. బరువు తగ్గుతారట.