Oils That Reduce Pain: నొప్పులు తగ్గించే ఆయిల్స్ ఇవే
కండరాలు (Muscles), కీళ్ల నొప్పులు వేధిస్తుంటే.. సరిగ్గా నడవలేం, కూర్చోలేం, లేచి నిలబడటానికి కూడా కష్టంగా ఉంటుంది.
- By Maheswara Rao Nadella Published Date - 08:00 PM, Sat - 18 February 23
నొప్పుల (Pains) కారణంగా చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు. శీతాకాలం ముగుస్తోంది.. వేసవి కాలం ప్రారంభం కానుంది. ఈ సీజన్లో చాలా మంది కండరాలు, కీళ్ల నొప్పుల గురించి ఎక్కువగా కంప్లైంట్ చేస్తూ ఉంటారు. కండరాల నొప్పి తరచుగా ఛాతీ, ఉదరం, వీపు, అంత్య భాగాలను ప్రభావితం చేస్తుంది. ఈ కాలంలో తరచుగా భుజాలు, మోచేతులు, మణికట్టు, వేళ్లు, మోకాలు, చీలమండల దగ్గర కీళ్లు నొప్పి ఎక్కువగా ఉంటుంది. కండరాలు, కీళ్ల నొప్పుల (Pains) నుంచి ఉపశమనం పొందడానికి.. ఫిజియోథెరపీ, నొప్పి నివారణలు, హాట్ ప్యాక్‌లు వంటి అనేక వైద్య చికిత్సలు ఉన్నాయి. కానీ కొన్నిసార్లు ఇవి కూడా అంతగా ఉపశమనం ఇవ్వవు. కీళ్లు, కండరాల నొప్పుల నుంచి ఉపశమనం ఇచ్చే ఆయిల్స్ (Oila) గురించి ఆయుర్వేద డాక్టర్ కపిల్ త్యాగి మనకు వివరించారు.
కీళ్లు కండరాల నొప్పులతో వృద్ధులే కాకుండా పిల్లలు, యువకులు కూడా బాధపడుతున్నారని డాక్టర్ కపిల్ త్యాగి అన్నారు. లైఫ్‌స్టైల్ మార్పులు, సరైన ఆహారం తీసుకోకపోవడం, శారీరక శ్రమలేకపోవడం, ఎక్కువసేపు కూర్చోవడం, పాత గాయం, వాతావరణ మార్పుల కారణంగా ఈ సమస్యలు ఎదురువుతాని అన్నారు. కీళ్లు, కండరాల నొప్పుల నుంచి ఉపశమనం ఇవ్వడానికి ఆయుర్వేదంలో కొన్ని నూనెలు (Oils) సహాయపడతాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.
నువ్వుల నూనె (Oils):
నారాయణ్ ఆయిల్ (Oils):
నారాయణ్ ఆయిల్ కీళ్ల , కండరాల నొప్పులకు దివ్యౌషధంలా పనిచేస్తుంది. మీరు నొప్పి నుంచి చౌకగా ఉపశమనం పొందాలనుకుంటే, ఈ నూనె చాలా బాగా పనిచేస్తుంది. నారాయణ్ తైలం, బాలా తైలం సమపాళ్లలో తీసుకుని కొంచెం వేడి చేయండి. రాత్రి నిద్రపోయే ముందు గోరువెచ్చని నూనెను నొప్పిగా ఉన్న చోట.. ఈ నూనెను మసాజ్ చేస్తే నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.
ఆముదం:
ఆముదం ఆకులు:
ఆముదం నూనె వలె.. ఆముదం ఆకు కూడా పెయిన్ కిల్లర్‌లా పనిచేస్తుంది. మీకు కీళ్ల నొప్పు వేధిస్తుంటే.. ఆకుకు ఆముదం నూనె రాసి.. చిన్న మంటపై వేడి చేసి నొప్పి ఉన్న పాంతంలో కట్టండి. ఆ తర్వాత కొంత సమయం నడవండి. ఉదయానికి మీ నొప్పి మాయం అవుతుంది.
అల్లం, వెల్లుల్లి వేసిన నూనె (Oils):
నువ్వుల నూనె ఎలాంటి నొప్పినైనా మాయం చేసే గొప్ప ఔషధం. నూవ్వుల నూనెలో శొంఠి, వెల్లుల్లి వేసి బాగా మరిగించాలి. వీటి సారం నూనెలోకి దిగిన తర్వాత మంట ఆఫ్ చేయండి. రాత్రి నిద్రపోయేముందు గోరువెచ్చని నూనెను నొప్పిగా ఉన్న ప్రాంతంలో మసాజ్ చేయండి. మీకు కచ్చితంగా ఉపశమనం లభిస్తుంది.
కొబ్బరి నూనె (Oils:)
కీళ్ల నొప్పులు, కండరాల నొప్పుల నుంచి ఉపశమనం ఇవ్వడానికి కొబ్బరి నూనె సహాయపడుతుంది. మీరు కీళ్ల నొప్పులతో బాధపడుతుంటే.. కొబ్బరి నూనెను కొద్దిగా వేడి చేసి, దానిలో కొద్దిగా కర్పూరం పొడి, శొంఠి పొడి వేయండి. ఈ నూనెను మోకాళ్లకు పట్టించి మసాజ్ చేస్తే.. నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు.
Also Read: Acne: మొటిమలంటే భయమా? ఇలా నివారించుకోవచ్చు.
Related News
Addiction: మీకు ఈ రెండు వ్యసనాలు ఉన్నాయా..? అయితే కోలుకోవటం కష్టమే..!
నేటి కాలంలో పిల్లలైనా, వృద్ధులైనా ప్రతి ఒక్కరి చేతిలో ఫోన్ ఉంటుంది. ఫోన్ లేకుండా గడపడం ప్రతి ఒక్కరికీ కష్టంగా మారింది.